Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, November 23, 2022

Ferdowsi - Kalhana Historian poets

ఫిరదౌసి 940 ప్రాంతంలో ఇరాన్  లో తౌసు అనే పట్టణంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతను చాలా గ్రంధాలు చదివి, మంచి జ్ఞానాన్ని ఆర్జించి చక్కని కవిత్వపటుత్వము, భాషాశైలి అలవడ్డ తరువాత షానామా అనేగ్రంధం వ్రాయడం మొదలు పెట్టాడు.  షా-నామా  977- 1010 సమయంలో వ్రాయబడిన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తజికిస్థాన్ జాతీయ ఇతిహాసం  పర్షియన్ రాజుల  పరాక్రమాన్ని చెప్పే  చారిత్రక గ్రంథం .

 రాజతరంగిణి   కాశ్మీర్ రాజుల పరాక్రమాన్నిచెప్పే  చారిత్రక  గ్రంథము . 12వ శతాబ్దం కాశ్మీరీ చరిత్రకారుడు కల్హన చే సంస్కృతంలో వ్రాయబడిన సాంస్కృతిక ఇతిహాసం. అందుకే  రాజతరంగిణిని  షా నామా తో, కల్హణుడిని ఫిరదౌసి తో పోల్చవచ్చు.  ఇట్లాంటి కవితలని వ్రాసే కవులని హిస్టారియన్ పోయెట్స్ అంటారు.

షానామా అనగా రాజుల చరిత్ర అని అర్ధము. బాహిరీ-తాఖ్ రబ్ అనే పార్సీ వృతాలలో 60,000 పద్యాలతో కూడిన గొప్ప ఇతిహాస గ్రంథం. షానామా పలు ప్రపంచదేశ భాషలలోనికి తర్జుమా చేయబదినది కూడా.

ఫిరదౌసి షానామా వ్రాస్తున్న  నాటి కాలంలో కవులకు గ్రంథాలకు చాలా విలువ ఉండేది. ఫిరదౌసి షానామా వ్రాస్తున్న విషయం దేశంలో వ్యాపించి అంతా ఆతనిని సన్మానిస్తూ ఉండేవారు. ఈవార్త కొంతకాలానికి గజనీ పురసుల్తాను మహమ్మద్ ఆస్థానంలోకి కూడా ప్రాకింది. భారతదేశం మీదకి అనేక దండయాత్రలు చేసిన గజనీ మహమ్మద్ ఫిరదౌసిని తన ఆస్థానానికి రప్పించేడు.

సుల్తాను ఆస్థానం చేరే ముందు అక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది. గజనీ పట్టణముబైట ఉద్యానవనంలో అతనిని ఆంసరీ, ఆస్ జాదీ, పరూఖి అనే ముగ్గురు ఆస్థాన కవులు కలుసుకున్నారు. పల్లెటూరి వానివలే కనిపిస్తున్న ఫిరదౌసిని నీవెవరని ప్రశ్నించగా నేనొక కవినని అతడు బదులు చెప్పాడు. వారు ఆతనిని పరీక్షంచ డానికి షక్ అనే అంత్యప్రాసతో కూడిన పద్యపాదములు తలాఒకటి చదివారు. పారశీ భాషలో షక్ అనే అక్షరంతో ముగిసే శబ్దాలు మూడుమాత్రమే ఉండగా నాల్గవది ఫిరదౌసి చెప్పాడు. అప్పుడు వారు ఆశ్చర్యపోయి ఫిరదౌసిని ఆస్థాన కవిగా నియమించారు.

సుల్తాను ఆస్థానం ప్రవేశించి ఫిరదౌసి తన కావ్యంలో కొంత భాగాన్ని వినిపించాడు. అతని రచనానైపుణ్యానికి సుల్తాను ఆస్థానమంతా దిగ్భ్రాంతి చెందింది. అతనిని అందరు ప్రశంసించారు. సుల్తాను సింహాసనం దిగి ఎంతో గౌరవంతో షానామాను తన ఆస్థానంలో ఉండి ముగించమని కోరేడు. ప్రతిపద్యానికీ ఒక సువర్ణ దీనారు ఇస్తానని వాగ్దానం చేసాడు. సుల్తాను కోరిక కాదనలేక ఫిరదౌసి సమ్మతించాడు.

ఫిరదౌసి తన శక్తినంతా వినియోగించి 30సం. శ్రమించి గ్రంధం పూర్తిచేసి సుల్తాను చేతిలో పెట్టాడు.సుల్తాను తన వాగ్దానం చెల్లించుకోకుండా సువర్ణదీనారులకు బదులి వెండిదీనారులు కొన్ని సంచులలో వేసి పంపినాడు. ఫిరదౌసి ఈ అవమానం సహించలేకపోయాడు. అవమానంతో క్రుంగి ఇతరౌలకు చెప్పకుండా గజనీ పట్టణము విడిచి వెళ్ళిపోయాడు.పోయేటప్పుడు ఒక దుప్పటీ ఒక కర్రమాత్రం తనతో తీసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 75సం. దాటినది.

వెళ్ళేముందు తన ఆవేదనని తెలుపుతూ కొన్ని పద్యాలు వ్రాసి సుల్తానుకు పంపాడు.  దేశ చరిత్రలోవలె వాజ్మయంలో కూడా గజనీ సుల్తాను అపకీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫిరదౌసి దేశ సంచారం చేస్తూ బాగ్దాదు .కొంతకాలానికి అతని స్వగ్రామం తౌసు చేరుకున్నాడు. సుల్తాను హిందూదేశం ముట్టడి ముగించి తన పట్టణం వెళ్ళిపోతూ మార్గంలో ఒక శత్రువులకోట ముట్టడివేశాడు. ఈవార్త తెలిసి కోటలోనివారు ఫిరదౌసి ఒకప్పుడు వ్రాసిన "నీకంటే గొప్ప చక్రవర్తులు ఎందరో ఈప్రపంచం నుండి వెళ్ళిపోయారు నీవెంతకాలం ఈదండయాత్రలు చేస్తూ ఉంటావు అనే   ఫిరదౌసి అపఖ్యాతి పద్యాలను  సుల్తానుకు  వినిపిస్తారు.

సుల్తాను సిగ్గుతో ఆముట్టడి విరమించి ఫిరదౌసి ఉనికి తెలుసుకొని గజనీ పట్టణము చేరిన తరువాత తొలివాగ్దానం చేసిన ధనం కంటే అధికముగా రాయబారుల చేతికిచ్చి ఫిరదౌసికి పంపించేడు. కానీ ఫిరదౌసి రాయబారులు తౌసు నగరం చేరేసమయానికి మర్త్య లోకం విడిచి వెళ్ళిపోయాడు. ధనరాసులతో రాయబారులు తౌసు పట్టణములోనికి ఒక ద్వారం గుండా ప్రవేసిస్తుండగా అతని మృతకళేబరము మరొక ద్వారం నుండి కదలిపోయినది.

                                        
Such great poets and writers are plenty in our country but there are no such memorials to glorify them. The cinema halls are there to glorify the actors and their children but they are cemeteries of our culture.

No comments:

Post a Comment