Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, February 26, 2024

Research on Bharatavarsha

భారతవర్ష విడుదల అయిన నాటి నుంచి నేటిదాకా ఎన్ని కొత్త పుస్తకాలో,  ఎన్ని కార్యక్రమాలో ఎన్ని టీ  వీ  ఇంటర్ వ్యూ లో..  ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన నాకు భారతవర్ష పై రీసెర్చ్ చేస్తున్నానని , నేను వ్రాసిన గ్రంధం గురించి,   నాగురించి తెలుసుకుంటున్నానని తెలియదు.  

భారతవర్ష వ్రాసేటప్పుడు  అది ప్రబంధ కావ్యమని తెలియదు. భారతవర్ష పూరిగా చదివిన వ్యక్తి  మల్లాది అనిల్ గారు  భారతవర్షలొ ప్రబంధ కావ్య లక్షణాలు ఉన్నాయని  2021 లో  టీవీ ఇంటర్వ్యూ లో  చెప్పారు.  అప్పటికీ   ప్రబంధ కావ్యమంటే అష్టాదశవర్ణనలు ఉండాలని తెలియదు. అష్టాదశవర్ణనలు ఏమిటో తెలియదు.  

        శా. పూదోట్ల    న్దిరుగా  డినాత  లపులం  బ్రోచేవు  యేభాగ్య మో                
పూదేనం  తయున ద్దినాప  దములన్ బుట్టేవు తాళంబు గా
  స్వాధీనం  బుగని  మ్ముచంద  మికనే   ౙాల్వార పారాణిగా నీ
పాదాల ద్దెదని  ల్వవమ్మ  నిలునా భావాల వేదంబుగా.     

నవరస పద్యాలు : 

వృత్తపద్యాల తో  అచ్చతెలుగులో  ఒక మంచి కథ వ్రాయాలనుకుని   బారతవర్ష కథ  వ్రాస్తూ ఆస్వాదించడం మాత్రమే తెలుసు  తరళ మత్తేభ శార్ధూల   పద్యాలు వ్రాయడానికి ఛందస్సు నేర్చుకుంటూ   అనేక  ఉపమానాలు ప్రకృతి వర్ణనలు తో మునిగిపోయిన నాకు   నేను వ్రాసిన పద్యాలలో  నవరసాల పద్యాలు  ఉన్నటు తెలియదు. రెండు సంవత్సరాల తరువాత  2022 ఆగస్టు లో  వ్యూస్ టీ వీ ఇంటర్వ్యూ కోసమని హైదరాబాదు  వెళ్ళేటప్పుడు పద్యాలమీద దృష్టి సారించగా నవరసాల పద్యాలు ఉన్నట్టు తెలిసింది.   అప్పుడు నవ రసాలపద్యాలు  అనే పది పేజీల సంపుటి తయారు చేసాను.

పురాణ ఇతిహాసాలు : 

పురాణ ఇతిహాస ప్రస్తావన ఎంత ఉందో తెలియదు.  పురాణ ఇతిహాసాలు  అప్రయత్నంగా వ్రాస్తే శృంగారం మాత్రం ప్రయత్న పూర్వకంగా, ఇంకా చెప్పాలంటే ఇష్ట పూర్వకంగా వ్రాసాను.  

భారతవర్షలో  తెలుగు సంస్కృత గీతాలు కృతులు అన్నీ  గాయకురాలు శ్రీవల్లి  వాట్సాప్ కి 2020 లోనే పంపినా వాటిని ప్రత్యేకంగా  ఒక  డాకుమెంట్ మీదకు చేర్చి దాచడానికి   2022 28 మే న  మార్కాపురంలో  బారతవర్ష సాహిత్య సాంస్కృతిక సమావేశం జరిగే వరకూ  కుదరలేదు. అలా దాచినా అది వందలాది భారతవర్ష అనే పేరుగల  డాక్యుమెంట్స్ లో కలిసిపోయి ఎక్కడో పోయింది.

2022, 2023     మాతృభాష దినోత్సవాలలో  పిలిచి  సత్కరించినా  ఫ్రెంచ్ జర్మన్ , జాపనీస్  పుస్తకాలతో రచన తో  పాటుగా ఇండియన్ సోనెటీ ర్  అనే పుస్తక రచనలో అంతకంటే పెద్దదైన  భారతవర్ష ద్వితీయ ముద్రణలోనూ ,   దాని ఆంగ్ల అనువాదమైన  లవ్ అండ్ పీస్ రచనలోనూ  ఊపిరిసలపక  సతమతమౌతున్న  నాకు  భారతవర్ష  పాటలన్నీ ఒక దారికి చేర్చాలని అనిపించలేదు 

2024 ఫిబ్రవరిలో  లో ఫ్రెంచ్ జాపనీస్ , జర్మన్ కొత్త పుస్తకాలు వెలువరించి ఒక భారం దించుకున్నాక   2024 ఫిబ్రవరి 14 వ తారీఖున లయోలా కాలేజీ వారు మాతృబాష దినోత్సవము సందర్భంగా  భారతవర్ష ని సత్కరించిన రోజున లయోలా కళాశాల  చిత్రాలతో భారతవర్ష గీతాలన్నిటినీ ఒక బ్లాగ్ లోపొందు  పరిచాను.  

  

2024 ఫిబ్రవరి 21 వ తారీఖున  దూరదర్శన్ లో   మాతృబాష దినోత్సవము సందర్భంగా  కార్యక్రమానికి భారతవర్ష లో అష్ఠాదశవర్ణనలు ఉన్నాయని తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు  దూరదర్శన్ వారి ఆహ్వానం భారతవర్ష పై  అన్వేషణ చేసి భారతవర్ష ఒక ప్రబంధం  అని తెలుసుకు నేలా చేసింది     భారతవర్షలొ  అష్ఠాదశవర్ణనలు వెలికి తీసి ఒక పుస్తకం ముద్రిస్తున్నాను.   


భారతవర్ష  -  ప్రాచీన కవితా ధోరణులు 

 ప్రకృతి వర్ణనలతో, ప్రౌఢ బాషా శైలితో  పురాణ ప్రస్తావనలతో  సాగే సంప్రదాయ కవిత్వాన్ని  ప్రాచీన కవిత్వం అంటారు.   ఇతిహాస పురాణ,  ప్రస్తావనలేకాక  అష్టాదశ వర్ణనలతో, వ్యాకరణ బద్ద  ఛందోబద్ధ నియమాలతో, వీర, శృంగార రసాలతో, అలంకారాలతో అలరించే  ఈ రచనా శైలి నన్నయ్య నుంచి చిన్నయ్య దాకా కొనసాగినా   మొఘలు  తురుష్క  పారశీ,  పాశ్చాత్త్య ప్రభావంతో  పూర్తిగా అడుగంటి పోయింది.  ప్రబంధాలు కనుమరుగైపోయాయి. చలనచిత్ర ప్రభావంతో   తెలుగు బాషా మనుగడే ప్రస్నార్ధకమయ్యింది. ఇలాటి గడ్డు పరిస్థితులలో నన్నయ్య చిన్నయ్య రాకపోయినా  నేటితరానికి ప్రబంధ సౌందర్యాన్ని అందించడానికి ఎవరో ఒక వెంకయ్య   వచ్చే ఉంటాడు. సమంగా చూడండి. ధర్మానికి సాహిత్యానికి సంబంధం ఉందంటూ ప్రబంధాల అందాలను, వేదచందాలను,  శృంగార పూగంధాలను పూంచిపట్టి   పూలబాల చేసిన శంఖారావం ఉత్కృష్ట భారతావని  ఆవిష్కారం  భారతవర్ష. 1. భారతవర్ష గ్రంధం  చంపకమాల  తో ప్రారంభమవుతుంది 
అది ఇష్టదేవతా ( సరస్వతీ) ప్రార్ధన. ఇది ప్రాచీన కవితా ధోరణి  

చ . అనువుగ వేడ భారతి  సత్కృప నొసంగె కవిత్వ శక్తతన్  
కినుకము వీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
 అనితము నీకృప ధన్యముగాదె సనాతని దివ్య బాసటన్  
మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్

సరిగా వేడుకొనగా సరస్వతి దయతో కవిత్వ సామర్ధ్యమును 
కినుకము వీడి  ( దయతో ) కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
(షార్ప్ లిటరరీ మైండ్) ని అనుగ్రహిచెను. అనితము (ఆన్ పేర్లల్డ్) 
 నీకృప ధన్యముగాదె సనాతని( సరస్వతి ) దివ్య బాసటన్ 
మనసులో పుట్టిన పద్యాలను మాలాగట్టి తల్లి పాదములవద్ద ఉంచెదను.  

 2. ఉ.  తూరుపు  రత్న దీప జిగి  తోరణ సోయగ మేలె నాకశ                                 

    మ్మేరవికాంతి తో వెలిగె వేంకట నాథుని సుప్రభా తసం

     కీర్తన జేయు భాస్కరుని  కేళిక  చూడరె  కీరవాణి రా 

     గార్చన చేయుకీరముల గారము చేయరె ముద్దుముద్దుగా


తూరుపున  రత్నదీప  జిగి  తోరణమును గట్టి   ఆకాశము నలకరించి  ఆదిత్యుడు అబ్రదీపమై వెలుగుచుండగా దీపము వెలిగించి  వేంకటే స్వరుని కి  సుప్రభాతసంకీర్తన  జేయుచున్నట్టున్నది.  చలించు వెలుగు రేఖల ను చూడగా  అంశుపతి  కేళిక  (సూర్యుని నృత్యము) చేయుచున్న ట్టున్నది.  కీరముల ( చిలుకల)  కిలకిలారావములు కీరవాణి  రాగార్చన చేయుచున్నట్టున్నది. అట్టి  కీరములను  ముద్దుముద్దుగా గారముచేయ వలెను. ప్రాతఃకాల శోభను ఆస్వాదించవలెను. 

సున్నితమైన ప్రకృతి వర్ణనలలో భారతీయ దేవీ దేవతల ప్రస్తావన ప్రాచీన కవితా ధోరణి. 


4. చ. తెరిచి గవాక్ష   మంతట  యు తే ట  గవెన్నె లకాంచ  నుల్లమే 

విరిసె  సుమాలు ముచ్చట గ వే డు    కజేయ   గనూర్ధ్వ  లోకమే 

మురిసి  వరాల   జల్లుల  ను మూట  గగుగుప్పె నొతాలు  తాపరే      

అరలు  తనూజ లందడి మి  హత్తు  కుభాష్ప ఝరుల్గు ప్పించెనో. 


కిటికీతెరచి తేటగ ( స్పష్టంగా)  వెన్నెలనుచూడగా  ఉల్లము సుమము 

వలే విరిసినది.  విరిసిన సుమాల చూసి ఊర్ధ్వలోకము( స్వర్గము) మురిసి 

వానజల్లు కురిపించెనో లేక తాలుతావిరి  ( బ్రహ్మ) తన  విరిత నూజలను 

(పువ్వులు బ్రహ్మ దేముని కుమార్తెలు) ముద్దాడు చుండెనో! అన్నట్లున్నది. 


మరీదు అతికష్టముపై మండువాలోకి దృష్టి మరల్చెను.

స్వర్గం  పూలను అభినందించి వాన జల్లు  కురిపించడం  

బ్రహ్మ విరులను  ( కూతురులను) ముద్దాడి ఆనంద బాష్పాలను

 రాల్చడం చంపకమాలలో ఇమడ్చడం ప్రాచీన  కవితా ధోరణి.


ప్రాచీనధోరణిలోనే సాగుతూ వస్తున్న కవిత్వంలో కొత్త దృక్పధాలు 1850 తరువాత ప్రారంభమయినాయి. జపాన్‌కు వ్యతిరేకంగా కొరియా స్వాతంత్య్రంకోసం పోరాడిన యోధుడు, కవి హాయోంగ్ (1879) తో ఆధునిక కవిత్వం ఆరంభమయింది.  పాశ్చాత్య దేశాలలో కవిత్వంలో వచ్చిన మార్పులు, ఇంగ్లీషు సాహిత్యంతో పరిచయమున్న కవులలో పెరిగిన ఆసక్తి, రాజకీయ, సామాజిక రంగాలలో వచ్చిన మార్పులు, జీవన శైలిలో వచ్చిన కొత్తదనాలు ఆధునిక కవిత్వానికి మరికొన్నికారణాలు. 

ఆధునిక కవితాధోరణులలో  ముఖ్యమైనది "భావ కవిత్వం." ఇంచుమించు 1930 వరకు భావకవిత్వం రాజ్యమేలింది. 1935 తరువాత రెండో ప్రపంచ యుద్ధం నాటికి భావకవిత్వం స్థానాన్ని అభ్యుదయ కవిత్వం పూర్తిగా ఆక్రమించింది. భావకవిత్వంలో  ఆత్మాశ్రయ వాదం, ఊహా ప్రేయసులు, అమలిమ శృంగారం, ప్రకృతి వర్ణనలు, స్మృతి కవిత్వాలు ముఖ్యమైనవి.  కాటూరి, విశ్వనాధ,  నండూరి వంటి ఎంతోమంది కవులు భావకవితలలో వెలిగారు.. రాయప్రోలు, దేవులపల్లి వంటి వారు  భావకవిత్వాన్ని వెలిగించి  తమదైన ముద్ర వేసారు. పఠాభి  ఫిడేలు రాగాల డజన్' గేయాలు భావకవిత్వం మీద తిరుగుబాటుగా పరిగణించవచ్చు.  శ్రీరంగం శ్రీనివాసరావు కూడా 1930లో శ్రీ శ్రీగా మారకముందు భావకవిత్వం రాసిన వాడే.

1980 ప్రాంతం నుండే కొరియా కవిత్వం ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతున్నది. తమనుతాము కవులుగానే వియత్నామీయులు ఎప్పుడూ భావించుకుంటారు. వియత్నాం మొదటినుండి ఒక యుద్ధ్భూమి. వియత్నాం యుద్ధ కవితలను అక్కడివారే కాదు, ప్రపంచవ్యాప్తంగా కవులు రాశారు.


No comments:

Post a Comment