Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, November 7, 2019

డగడ పర్బో బోగో - ఆదివాసి పాట -పూలబాల


 తొలికోడి కూయంగానే తంగేడు పూలు తట్టాకెత్తి 
గునుగు పూలు గుచ్చి గుడిసె సింగారించి. 
గుమ్మలందరూ పోయి గూడెం గుండె తడిమి,
గుమ్మడి పూలు  కోసి  గుట్టా  కాడ పోసి.  
 గారాగింజల నూనె  గారంగ వంటికి  రాసి, 
పసుపుగొమ్ముల గొట్టి  పాదాలనిండా పూసి. 
 కొండా పడుసులంతా పావడాలు గట్టి,  
కొనసీకట్లో కోలాటమాడి తామర్ల  కోనేట్లో తానలాడంగా 
ఎ లకోడి (నాయకి):డగడో.. డగడో..  డగడో..   డగడ    పర్బో బోగో  II
గూడెంలో మొదలాయె డగడో..   నా గుండెల్లో మొదలాయె రగడో II
డమ్ డమ్ డమ్ డగడ డగడ , డమ్ డమ్ డమ్ డగడ డగడ
నేనిక్కడ నువ్వక్కడ మనసక్కడ మనువిక్కడ లంబాడోళ్ళ రాందాసు
గూడెం పడుచులు: డమ్ డమ్ డమ్ డగడ డగడ డమ్ డమ్ డమ్ డగడ డగడ.
ఆకక్కడ వక్కిక్కడ ,చుక్కిక్కడ పక్కక్కడ, లంబాడోళ్ళ రాందాసు
డమ్ డమ్ డమ్ డగడ డగడ డమ్ డమ్ డమ్ డగడ డగడ
డమ్  నువ్వక్కడ  నేనిక్కడ గువ్విక్కడ గూడక్కడ లంబాడోళ్ళ రాందాసు

ఉయ్యా ఉయ్యా ఉయ్యా ఉయ్యా ఉయ్యా ఉయ్యా ఉయ్యా ఉయ్యా ఉయ్యా

ఊగిసలాడే మనసుని బట్టి,  ఉన్నా మనువు కి గట్టి  ఊసు లన్ని సుట్ట సుట్టి
గట్టు మీదపెట్టి  కదలరండి పడుసులారా డగడా పండుగ సేసుకుందాం
డగడో.. డగడో..  డగడో..   డగడ    పర్బో బోగో  II
కొండతల్లి గద్దెకి పోదాం గజ్జె కట్టి సిందులేద్దాం  - డమ్ డమ్ డం డో  II  
డగడో.. డగడో..  డగడో..   డగడ    పర్బో బోగో  II
గూడెం లో మొదలాయె డగడో..   నా గుండెల్లో మొదలాయె రగడో
ఎలకోడి రాననగానే  పుత పుత పోయిరి సంగడికత్తెలు,
ఎల్లిపోయిరి ఆటగత్తెలు గజ్జె కట్టి సిందులేయ 
అందరి గజ్జలు ఘల్లు మన్నవి  నాకాలి గజ్జ మోగబోయె 
సూరీడొచ్చి సూదులు గుచ్చే  ఎలిమికాడా రారా ఎలకోడి సూసెను రా రా II

గురితప్పని  విలుకాడా రా రా   మాటా తప్పని మొనగాడా  రా రా
బంజారా జేత రారా .... లంబాడా మోత తేరా ....II
గువ్విక్కడ గూడక్కడ నువ్వక్కడ నేనిక్కడ లంబాడోళ్ళ రాందాసు
ఆకక్కడ వక్కిక్కడ చుక్కిక్కడ పక్కక్కడ లంబాడోళ్ళ రాందాసు

సీమంతినిలు  :  లంబాడా లంబాడా రారా లంబడిమనువు పోవ
చూపర  కోడికి తోవ లంబాడా లంబాడా రారా, లంబాడా లంబాడా రారా. 
దినము నడిమికి  జేర  మొదలయ్యింది దోయ, కోయ కోయ కోయ
వంటికి మట్టి  పూయ, బఱ్ఱె లెక్కి బోయ తొఱ్ఱతేనె దేయ    
ఎలకోడి పిలిచెను రారా!! కోనేటి సెగడి లో నిలిచెను రారా!!!     
కొండపడుసూ లంతా  జంటగా కేళికాడ,  వంటిగా నిలిచెను రారా
                                                                         
లంబాడా: కొండలోని  యూటనీరు బొర్ర లోన బట్టి, కొయ్యకోల బట్టి
విప్పసారా గరగల బట్టి, వచ్చా వచ్చా వచ్చా, కంటికి వెలుగు తెచ్చా 
డమ్ డమ్ డమ్ డగడ డగడ డమ్ డమ్ డమ్ డగడ డగడ
నేనొస్తే  రగడ రగడ   అగడ  బిగడ  సెగడ లగడ డగడ డగడ....    
కాండ్రదుబ్బులు  కాడా  కసిమిరి దీర్చ వచ్చా మారు మనువుని వచ్చా   
చెయ్య చెయ్య పట్టి పుంజు పెట్ట జట్టు కట్టి డగడో. డగడ పర్బో బోగో  II

-------------------------------------------------------------------------------------------------------------------------
This is the Story of  Elakodi a married woman of Gondi tribe who in her youth was married to a vain man of her father's choice. Ramdas a Lambada Tribe was her choice. Her love has been a mirage while her marriage has been a nightmare. She decided to divorce her vain husband and sings for her heart beat Ramdas who promised his lover Elkodi to return on Dagada Fest and parted silently. He had disappeared into civilized society to fetch money for her divorce. Whether he keeps his promise and fulfills her dream is a million dollar question. 

Urban people can not understand this theme because they are connect to British or American societies by the culture. Their western culture worship is the reason for their resentment to read tribal cultures. However literature lovers and Lovers who are in similar situation of Elakodi get transported into forest. They don't hate to sit  beside the primitive tribes. They rather imagine themselves singing with the tribes at the Lotus pond. 

 Divorces in tribals 

There is no uniform system of divorce among the tribals. The grounds on which divorce can be conceded are different from tribe to tribals.

The korawa tribals of Mirzapur in U.P. the mere order of the husband to leave his house is a decree for the wife to leave his husband’s house and to live with her parents till she marries someone again.

Among the Bhills, the husband calls the Village Panchayat and offers his wife a piece of cloth from his turban, in public as a token of his divorcing her.


Among the Gonds the system is quite interesting. Here, the woman can divorce her husband without his willingness, the second husband pays compensation to the first husband. 

ఆది వాసులు, సంచారజాతులు ,నాగరిక  సమాజానికి  దూరంగా ,   అభివృద్ధి కి నోచుకోక జావనసాగిస్తున్న జాతులుతెలంగాణ రాష్ట్రంలో  వందకు పైగా సంచార జాతులున్నాయి. గుర్తింపులేని సంచారాజాతుల  సాహిత్యం మరుగున పడిపోయింది వారిని సమాజంలో భాగమని గుర్తించాలని జాతులు కోరుకుంటున్నాయి. వారి సంస్కృతీ సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని వారి కళలను ప్రోత్సహించి జాతుల పరిరక్షణకు తోడ్పడితే బాగుంటుంది.

  సాహిత్య చరిత్రలో ఆదివాసీ గొంతులు దాదాపు శూన్యం.
గిరిజన సాహిత్యం రెండు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. అవి 1. గిరిజనేతరుల సహానుభూతి సాహిత్యం. 2. గిరిజనుల స్వీయానుభవ సాహిత్యం.


"డగడా  పర్బో  బోగోఅనే జానపద గేయం  గిరిజనేతరుల సహానుభూతి సాహిత్యం క్రిందకి వస్తుందిగొండి  జాతికి చెందిన ఎలకోడి అనే గిరిజన పడుచు లంబాడజాతికి చెందిన రాందాస్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. కానీ ఎలకోడి  తండ్రి  ఆమె ఇష్టానికి వ్యతిరికంగా గొండి జాతికి చెందిన ఒక అయోగ్యుడితో మనువు జరిపిస్తాడు. గొండి జాతి భార్య కి ఇష్టం లేకపోతేభర్త అంగీకరించకున్నా విడాకులు ఇవ్వ వచ్చువిడాకులు ఇవ్వాలంటే రెండవ భర్తమొదటి భర్తకి నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందిరాందాస్ ఎలకోడిని దక్కించుకోడానికి డబ్బు చెల్లించాలి. డబ్బు సంపాదించడానికి పట్టణం వెళతాడుపండుగనాడు డబ్బుతో తిరిగొస్తానని వెళ్లిన లంబాడోళ్ళ రాందాస్ వస్తాడా రాదా అని ఆందోళన చెందుతూ పాడేపాట "డగడా  పర్బో  బోగో "

No comments:

Post a Comment