Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, April 13, 2021

వన శృంగారం - రెండవ భాగం

వన శృంగారం మొదటిభాగంలో ఉపవనంలో (కలియుగ)రాధ మాధవులు కలిసి వెన్నెల విహారం చేస్తారు. నిండు పున్నమి పండు వెన్నెల లో వనమంతా వెన్నలలో వెలుగు తుంటుంది. మన్మథతాపము కలిగిన జంట చకోరపక్షులు వెన్నెల లో విహరించినట్లు , వనవిహారం చేసి ద్రుమసుమాల (పారిజాత కుసుమాల) నెత్తావుల(పరిమళాల)ను గ్రోలి రాసక్రీడలాడతారు. చెట్లచుట్టూ భ్రమరి పారుతుండగా రాధను పిరుదుకొని గోపాలుడామె పిరుదులమీద చరుస్తాడు. రాధ అందెల  రవళులతో వనమంతా మారు మ్రోగుతుంది, రాయంచలు రాధ మిత్రులే కానీ రాధ పరిచేలము ( పయిట) ను ముక్కుతో పట్టి లాగుతూ గోపాలునికి మేలు చేస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ గోపాలుడు ముందుకి పోబోతే అతడిని అడ్డుకుంటాయి . అలా రాయంచలు  గోడమీద పిల్లివాటంగా అనిపించినా వారిరువురికీ మిత్రులుగా ఉండి రాసక్రీడను రక్తి కట్టిస్తాయి. చివరకు ప్రేమజంట కొలను చేరుకొంటుంది. రాధ వీణా వాదనముతో గోపాలునలరిస్తుంది. అంతటితో వారు వనమునుండి నిష్క్రమిస్తారు.     


రెండవ భాగంలో : సాయంసంధ్యలో ఏకాంతవేళ ఒక కోవెలలోనున్న ఒక కట్టడము మిద్దెపై గోపాలుడు రాధను  కలుస్తాడు. రాధ  మాధావళి (పీతాంబర-పరికిణీ వోణి)దాల్చి వాలుజడతో, గులాబి పెదవులతో, మదించిన ఊరువులతో, సైకత నితంబములతో తిరుగుతుంటుంది. గోపాలుడు ఆ గుబ్బెత్త  అందము చూసి పరవశించి ఆమెకు అందెలు బహుమతిగా ఇచ్చి నాట్యమాడమని కోరతాడు.  రాధ గడుసుపిల్ల.  గోపాలుడు ఎందుకు నాట్యమాడమనుచున్నాడో తెలుసుకోలేని బేల కాదు.  ఇక చదవండి ....35.క.మనకో  రికమన  సదరము 

మనరా  గమునీ   లిరాగ  మతిసయ మేలా   

వనసం సర్గమె  స్వర్గము 

మనపా లిటవర  ముకాదె  మరిచెద  వేలా

మన కోరిక మన  సదరము ( స్నేహము ) మన రాగము  నీలిరాగ ( ప్రేమ) అతిశయ మేలా! వన సంసర్గమె ( కలయిక) స్వర్గము మనపాలిట వరము కాదె  మరిచెద  వేలా. (తనకోపమె  తన శత్రువు తన శాంతమె తనకు రక్ష - అదేగణాలతో లిఖించబడిన కందము. నచ్చితే ఏ స్టైల్ లో నైనా వ్రాసుకోవచ్చు ) మన కోరికల్లా మన చెలిమే.  చెలిమి ఉంటే చాలు అని కృష్ణుడు రాధతో అంటూ , ఆమెను కలవడమే స్వర్గమని అదే వరంగా భావించాలని వివరిస్తాడు   


 36.క. వెచ్చని మరదలు పిల్లా 

మెచ్చిన  శుభసర  సమాడ  వెచ్చని పానుపు లేలా 

తెచ్చితి  సిరిసిరి మువ్వలు

నచ్చిన కొమరా  లుగావ నర్తము జేయా  

మరదలు పిల్లా అని సంబోధించాలనిపించి  గోపాలుడు రాధను "వెచ్చని మరదలు పిల్లా" అంటూ సరసమాడడానికి పడకగది పానుపు అవసరం లేదని  "మెచ్చిన  శుభసర  సమాడ  వెచ్చని పానుపు లేలా?"  అంటాడు. చేతిలో ఉన్న మువ్వలు రాధకు  చూపుతూ  "తెచ్చితి  సిరిసిరి మువ్వలు నచ్చిన కొమరా లుగావ నర్తము జేయా"  అని  ఆమెను నాట్యము చేయమని కోరతాడు. అయితే రాధ బేల కాదు జాణ. రుక్మిణి తనని లేపుకు పోవాలని కృష్ణుడికి వర్తమానం పంపింది. రుక్మిణి బేల. రుక్మిణి స్థానంలో రాధ ఉంటే ?  రాధ గడసరి కనుకే  భర్తని , సమాజాన్ని పక్కన పెట్టి  వెన్నదొంగ మనసునే దొంగిలించి తనకోసం తపించేలా చేసింది.  


 37క.గడుసరి  మరదల జూపవె     

పడుచం  దాలుపొ  డచూపు పరికిణి లోనే      

వడకే  నాట్యము  లాడవె  

జడకు  చ్చులుపిరు దులపై జాలు వ్రాలా  

గడుసరి  మరదల జూపవె పడుచందాలు పొడచూపు (కనిపించు)  పరికిణి లోనే. వడకే  నాట్యము  లాడవె  ( శరీరము కంపించు విధముగా నాట్యము చేయమ)ని "జడకు  చ్చులుపిరు దులపై జాలు వ్రాలా " అంటాడు అంటే రాధని చూడా  లనుతీవ్ర కాంక్షను తెలియజేస్తున్నాడు.  పూర్వము రాధనుకలిసినా మరదలా అని సంభోదించడం చేత కాలేదు.  పాపం!  Poor Krishna!


 38.క. రాధా రమణా తెలుసుర

బాధా హరణా  మకార  వాంఛలు ఊపే  

సోదా  లందుకె  గదరా

మాదా వళ మే  నుగట్ట   మనసిక చిక్కే

రాధా రమణా తెలుసుర బాధా హరణా  మకార  వాంఛలు ఊపే. సోదా  లందుకె గదరా(అనగా అన్వేషణ, అందాల కొరకు అన్వేషణ అందుకే కదా ) రాధ ఎంత గడుసుదో కదా! నేరుగా అడిగేసింది.  మాదావళమేను ( మాదావళము + నేను = మాదావళమేను) గట్ట మనసిక చిక్కే.  అనగా కృష్ణుడి మనసు రాధ పరిచేలమందు చిక్కిందని అర్థం.  

 39.క. నలుగురు చూచిన నవ్వర 

కులుకులు చూపే టివేళ కూతలు ఏలా 

ఉలుకుడు కొత్తురు జనులు 

బులుపులు చెల్లిం తునొంటి పురమే దక్కా    

నలుగురు చూచిన నవ్వర కులుకులు(శృంగార కుదుపులు) చూపే టివేళ కూతలు ( సవ్వడి ) ఏలా ! ఉలుకుడు ( చిన్న శబ్దం ) కొత్తురు జనులు . బులుపులు  ( కోరికలు ) చెల్లిం తునొంటి పురమే ( పురము = గృహము ) దక్కా. రాధ నిజంగా జాణ . ఎంత చక్కగా మాట మార్చింది. నా నాట్యము చూడాలని కాదు నీకు వేరే ఏవో  చూడాలని ఉంది అని ఆట పట్టించి, ఇప్పుడు "నలుగురు చూస్తే బాగుండదు, ఏకాంతము దొరికినప్పుడు చూపిస్తానని అంది రాధ. ఏకాంతయినా ఏకాంతం లేకుండా  అనుకోవచ్చు మనం. కానీ మాట మార్చడం తిప్పించడం కూడా క్రీడలో భాగమే.  అదే శృంగారంలో తియ్యదనం. ఆవిషయం రాధకి తెలుసు, కృష్ణుడికి తెలియద్దూ!  ఎలా అడుగుతున్నాడో చూడండి. 


40.క. నటనము నకేల  సంశయ       

మటజని  పరికిం  చపంచ పటములు మూసే  

పటవా  సముపరి చేలము 

కటకట  పెట్టుచు  సలాక కానును చూపెన్ 

1. రావి, 2. మారేడు, 3. మఱ్ఱి, 4. మేడి, 5. అశోకము.  ఈవృక్షములు పంచ పటములు. 

నటనము నకేల  సంశయ  మటజని (ఆటుపోయి ) పరికించ పంచ పటములు  (ఐదు మహావృక్షములు) మూసే.(ఈ దేవళమును మూయుచున్నవి) పటవాసము (లంగా) పరిచేలము ( పయిట )కటకట పెట్టెను(భాదించుచున్నవి) సలాక కానును చూపెన్ ( సన్నని నడుము చూపెను). పాపం కష్టపడి మంచి పద్యమే చెప్పేడు. లంగా వోణీ లో రాధ చక్కదనమంతా చిక్కగా కనిపిస్తోంది. చిక్కిన ఆమె నడుము మత్తెక్కిస్తోంది అని చెప్పేసాడు  గానీ రాధ కళ్ళతోనే నవ్వి ఊరుకొంది.   

41.క.మగువా నీకిది తగునా

మగవా  నిపైన పవాదు పలుకుట మేలా

సెగరే  పదగున   మగువా

వగలెం  తదాపె  డతావు వయసే పొదలా

మగువా నీకిది తగునా మగవానిపై నపవాదు పలుకుట మేలా? సెగరే  పదగున   మగువా?  వగలెంత  దాపెడతావు వయసే పొదలా! పాపం ఏంచేస్తాడు వెనకటి కెవడో  అటునుంచి నరుక్కు రమ్మన్నాడుట. అలాగ కృష్ణుడు మరో వైపు నుండి ప్రయత్నిస్తున్నాడు. వగలెంత  దాపెడతావు వయసే పొదలా! మాయగాడే కానీ రాధ దగ్గర అవేమి చెల్లవు. హహ్హహ్హ హ  అని నవ్వింది కానీ పూర్ కృష్ణ అని అనలేదు . కృష్ణుడుని గౌరవంగా కవికుల తిలకా అని సంభోదించి

  42.క. కవికుల తిలకా రాధా

మవితః సివమె త్తునర్త  మాడుచు తీర్చే

నువరుని   వలకా  క నెరిగి

అవరో  ధముమా  న తీర్తు  నలక నిపుడే

కవికుల తిలకా రాధా మవితః  ( రాధకు బద్దుడు) సివమె త్తునర్త మాడుచు ( చెలరేగి నాట్యమాడుచూ) తీర్చే నువరుని   వలకాక ( మన్మథ తాపము ) నెరిగి.  అవరోధము  బోవ ( అడ్డంకులు తొలగువిధముగా )  తీర్తునలక నిపుడే  అలక ఇపుడే తీరుస్తానుండని  రాధ ఏంచేసిందంటే..  

 43.క. చుంబిం  చెనుచెలి  అధరా

లందిం  చిసఖు నినోట రతికే  ళాడెన్

కంపిం    చెతనువు   చమ్మగ   

స్తంబిం   చెజగము లుచూడ  శుక్లము  ఒలికే   

చుంబించెను చెలి  అధరాలందించి   అంటే   bouche à bouche  (మౌత్ ఇన్ మౌత్ అని ఆంగ్లములో, నోట్లో నోరు అని తెలుగులో చెప్పుకోవచ్చు) ఇచ్చేసింది. (అంటే ఫ్రెంచ్ కిస్ ఇచ్చేసింది).  చూడాలని, తాకాలని పాతకాలం విప్రనారాయణ పథకాలు వేస్తుంటాడు కృష్ణుడు. పూర్ ఫెలో!  రాధ ఏంచేసిందంటే " సఖు నినోట రతికేళాడెన్" అంటే langue à langue. వివరించడం కంటే ఊహించుకుంటే తియ్యగా ఉంటుంది. తప్పులేదండీ సుమతీ శతకంలో బద్దెన (ఎఱ్ఱన కుమారుడు) ఉన్ననిజం చెప్పేసాడు.  

"వీడెము సేయని నోరును

 జేడెల యధరామృతంబుఁ  జేయని నోరును

బాడంగ రాని నోరును 

బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

అధరామృతము గ్రోలని  నోరు బూడిద గొయ్యి అని తేల్చి చెప్పేసాక ..తియ్యగా ఊహించుకోండి . ఊహాప్రపంచములో కూడా బానిసత్వం ఎందుకు ? "కంపించె తనువు చమ్మగ." కృష్ణుడి శరీరములో వెచ్చని సుఖము వ్యాపిస్తున్నాది. స్తంబించె జగములు ( ప్రపంచము అంతా నిలిచి పోయింది ) చూడ శుక్లము ఒలికే.  This is the Climax.


44.క.సర్పము బుసగొ  ట్టినిలుపు 

దర్పము మదిరా క్షికాద  దర్పము చూపే 

సర్పము  తర్పణ  చేయుచు 

నర్పణ  గావిం  చిరాజు నామే ఏలున్     

సర్పము బుస గొట్టి నిలుపు దర్పము.  మదిరాక్షి (మత్తుకళ్ళ ఆడది) కాద  దర్పము చూపే సర్పము? (స్త్రీ కూడా దర్పము చూపించునపుడు సర్పము వంటిదే)  తర్పణ (తృప్తి ) చేయుచు  అర్పణ గావించి  రాజు (భర్త) నేలు నామే.   సుఖపెడుతూ భర్తని ఏలేది స్త్రీ మాత్రమే! కనిపించే  మగడు రాజు. కనిపించని రాజు భార్య. ఇది నాభావన. అనుచూ కృష్ణుడు” ఏమందువు రాధా?” అని అడుగగా ఆ మిద్దె పై నున్న ఎత్తైన మెట్టు పై నిలిచి ప్రకృతిని చూచుచున్న రాధ కృష్ణుని వైపు తిరిగి  "ఊ బాగున్నది వేదాంత ప్రకర్షణ

45.క.తలచిన పలుకును పావకి

కలిపి శృంగా రవేద కాదం బరీ

తెలిపిన సులువుగ నాకె టు 

తెలియు  సంసర్గ మలేక తేలిక గాదే    

నీవు శృంగారమునకు వేదాంత మద్దు సమర్ధుడవే!  కానీ నేను శృంగార ప్రకర్షితను కాను నాకెట్లు తెలియును నీ శృంగార వేదాంతము అని మూతి విరిచి రాధ వెనుకకు తిరిగి నిలిచెను. "నీముద్దు మోము చూచు అవకాశము నాకు దక్కకున్ననూ  వెనుకనున్నది కూడా అందమే కదా ఆహా ఎటుచూచినా అందమే" అని గోపాలుడనుచుండగా కృష్ణుడు ఏమిచూచుచున్నాడో స్ఫురించి తోకతొక్కిన తాచువలె వెనుతిరిగి రాధ మెట్టుపై నుండి కాలుజారి పడుచున్న రాధను కృష్ణుడు తన బాహువులతో పొదివి పట్టు కొనెను.   

46.క. పొందా మరమకిల తటాక 

మందా రుచుకాం తులీను మాణిక్య రీతిన్ 

అందాల రాధమం దారము 

చిందాడె నగధా రియుక్కు  చేతుల జూడన్

మకిల జలమున  పొందామర(బంగరు కలువ)వలె,   శ్యామల దళముల(నల్లని పత్రముల) దాగిన  పింజర కుసుమ పరాగము (పసిడి పుప్పొడి)  వలె రాధ నల్లదేవర చేతిలో ఇమిడెను. గోవర్ధనమునెత్తిన  నగధరునకు రాధ ఒక లెక్కా , కానీ రాధ  ఊరువుల క్రింద అతడు తన చేతులను నిలపజాలకుండెను. " అతడి చేతులు ఆమె జఘన సీమ వైపు ప్రాకుచుండగా రాధ అతడిని ఉరిమి చూసెను 

 47.క.తూనిక యంత్రము  నుమింగి  

 పూనిక రాధను మోహము  చేత  మోసి 

  దానిమ్మ సొగసుల  చవిగొని 

 దేనికి మురిసిప  డతావు  ధీరసు రూపా   

బరువు కొంచెము పెరిగినదే  అనుచూ రాధను క్రిందకి దించెను  " బావా  తూనిక యంత్రమును మింగినావా?  రాతి మెడపై నాతిని నిలిపి రాసలీలలాడుట పాడిగాదు అనగా కృష్ణుడు అవునవును ఈ సిద్ధాంత  గోష్ఠి కట్టిపెట్టి వనవిహారమునకు పోయెదము . కానీ  వీణావాదనము తో సరిపుచ్చక నీవు అచ్చట నాట్యము చేయవలెను. అని కృష్ణుడు కోరగా, రాధ మందహాసము చేయుచూ  "నాట్యమాడిననూ , సరసమాడిననూ ఏకాంతమునందే కదా !" అనెను. వారు రాతి మిద్దె దిగి నడవసాగిరి.

48.క.అరుణా  ర్చి లంబ కిరణా 

లరుదా  రల్లెగు డివాకి లంతసు మములే 

కురిసే సంధ్యా శోభలే 

చూచుచు బిగిసికొ నరాధ చూలిక  లూగెన్  

అరుణార్చి(ఎర్రని కాంతులీను సూర్యుడు) లంబ కిరణా  లరుదారల్లె ( అరుదారి + అల్లె )అరుదారి - చక్కగా; అల్లెను;   గుడివాకిలంత  సుమములే  కురిసే ;   శోభలే  చూచుచు బిగిసికొన  రాధ   చూలిక (ముంగురులు ) లూగెన్. 

ఎర్రని కాంతులీను సూర్యుని  లంబ కిరణాలు చక్కగా ఆకాశమంతా అలుముకొనెను. గుడివాకిలంత  నేలరాలిన సుమములు  కనువిందు చేయుచున్నవి.     ఆ సంధ్య   శోభలను చూచుచు  ముగ్డురాలయిన   రాధ   ప్రతిమ వలే బిగిసికొని  ముంగురు లూగుచున్నవి.      

 కుసుమ వ్యాకీర్ణ కోవెల ప్రాంగణము లో  రాధాకృష్ణుల జంట మందహాసములతో మందగమనమున సాగుచుండెను.  "కృష్ణా! దినదిన ప్రవర్ధమానమగుచున్న నీకోరికలకు కళ్లెము వేయవలెను" వివాహమైన పిదప తప్పక వేయవలెను.  "వివాహపూర్వమే ఇట్లున్నచో  వివాహమైన పిదప  ఇంక నిన్ను వదిలిపెట్టెదవా?"  అని రాధ అనుచుండగా కృష్ణుని ముఖము  వివర్ణమయ్యెను. రాధ మందహాసము చేసి  "కృష్ణా! వివాహము కొరకు బంధములను తెంచుకొంటిని. అనెను.  అప్పుడు కృష్ణుడు "ఇంకనూ గట్టి బంధమొకటి మిగిలియున్నది."  కదా. అనెను. అదివిని  రాధ   

49.క.గట్టిగ బట్టెను చట్టము  

  పట్టిమె డనుచ  ట్రమందు బంధిం చంగా  

  మట్టము  నకుమ  ట్టబడితి 

  చివరకు అందరు తొలగగ శివమే మిగిలే

"అది గట్టి బంధము కాదు కృష్ణా చట్ట బంధము, కాదందువా?"  "ఇంత  గడసరి మరదలుని కాదన్న ఊరుకొనునా!"  అనుచూ   గోపాలుడు నవ్వి  "సరే రాధ అంతా  మంచే జరిగిందనుచున్నావు, శుభ సూచకంగా ఆకాశము కూడా జల పుష్పములను కురిపించుటకు సిద్ధముగా నున్నది." 

   

  50.క. జీబుకొ  నెనుజీ  మూతము

    డాబుస రిగపె  ళ్లుమంచు  ఠాణము  పగలం  

    గాబిల  బిలనడచి  జేరెను   

    కాబిల  కాముని తలెత్తి   కాంచిన భమున్   

జీమూతములు జీబుకొనె నంబరమున  పెళ్ళుమని  పగలె   ఇంద్రాగ్ని, విభ్రాంత కాంత రాధ పెదవులు కంపించె పల్లవ ములై .  పరుగిడి  చేరి రాధ గోపాలు నల్లుకొనెను.కారు మబ్బులు కమ్ము చున్నవి ఇప్పుడు వన విహారమునకు ఎట్లు పోయెదము. అని రాధ కృష్ణుని అడుగు చుండగా  రాధకు ఒక సుందర దృశ్యము కనిపించెను

51.క. పర్జ  న్యుప్రేం  ఖణగనె  

నిర్జన దేవళ  మునందు నింగివ డశితున్   

గర్జిం చెడిమే ఘనిగనె            

అర్జున  మంతా  తూనీ గలగని మురిసే      

పర్జన్యు (మేఘ)   ప్రేంఖణ  (నృత్యము)  గనె (చూచెను);  నిర్జన దేవళ  మునందు నింగివడు (అస్తమించు)  అశితున్  (సూర్యుని);  గర్జించెడి మేఘుని గనె , అర్జునము (పచ్చిక ) మందున   తూనీ గలగని (చూసి ) మురిసే .  

52.క. తూనీ   గలంత  టముసిరె           

వానీ  కరము  పైపారు  పసిడ ప్సరల్       

కానీ చిక్కవు  చేతికి 

తూనీ గలుకన గవాన దూతలు భువిలో

 తూనీ గలంతట ముసిరె.  వానీకరముపై  ( పచ్చికపై ) పారు ( ఎగురు) పసిడ ప్సరల్ (పసిడి + అప్సరలు)బంగారు అప్సర కన్యలు.  తూనీగలు అందమైన అప్సరసలట . అప్సరస లతో సరసాలాడాలని ఎవరికుండదు? కానీ చిక్కవు  చేతికి. అయ్యో ! తూనీ గలుకన ( తూనీగలు చూడగా ) వాన దూతలు భువిలో. వానరాకను తూనీగలు ముందుగా సూచిస్తాయి 

అట్లు తూనీగలతో  ఆడి ఆడి  అలసిన రాధ కృష్ణుని జేరి " బావా ఇచ్చటనే ఈ ప్రాంగణమందునే  రెండు మందిరములు  కలవు. ఒకటి శివ మందిరము  రెండవది శ్రీకృష్ణ మందిరము. మనము పోయి దర్శనము చేసుకొనవలెను. " నేను రథములో నీకొరకు వేచి యుండును నీవు పోయిరమ్ము " అని కృష్ణుడు తన రథములో కి పోయెను. రాధ శివుని దర్శించి రధము కడకు వచ్చి ముందు భాగమున కూర్చొన్న గోపాలునివద్దకు వచ్చి " నేను గోపాలునివద్దకు పోవుచున్నాను నీకెంతో ప్రియమగు దైవము , స్వామి వద్దకు రమ్ము జంటగా దర్శించెదము " అనగా  రథములో నున్న కృష్ణుడు నవ్వి " 

నేపద్యగానం

 53..పంకిం చడుతల వేడిన  

అంకిత మిచ్చితి నకావ్య మంకడు  అకటా    

మంకిల ముచుట్ట చూడడు     

శంకిం  చకవె  ళ్ళవమ్మ   శ్రమనా  కేలా  

 అతడి పై ఒక కావ్యమును వ్రాసి అతడికే  అంకితమిచ్చి  అన్న సంతర్పణ గావించిననూ అతడు నాకొనర్చి న దేమియునూ లేదు " అనెను.  స్వామి నీ పేరుతొ గాక స్వామిపేరుతో పిలిపించుకొని రేయింబవళ్లు ఆయన ధ్యాసలో గడిపిన నీవేనా ఇట్లు మాట్లాడుచున్నది. నీకు నమ్మకము లేనిచో నాకున్నది నేను పోయి దర్శించుకొందును. ఆఖరి సారి అడుగుచున్నాను వచ్చెదవా? "ఆ గొల్లవానివద్దకు నేనేల పొవలేనమ్మా !" కృష్ణుడు ఎన్నడూ  అట్లు మాట్లాడలేదు.  రాధకు పట్టరాని ఆవేశమావహించెను ఆమె కరము  గోపాలుని చెంపను తాకెను. గోపాలుని దర్శనానంతరం  బయటకు వచ్చురాధ మదిలో బాధ అలుము కొనెను. 

నా ముద్దు గోపాల కోపాలేలా! గోవిందుని వేడ విసిగితివేలా!నావద్దకు రారా  నాముద్దుల కృష్ణా!  అయ్యో చెయ్యెత్తితినే అలగకు  కృష్ణా అనుకొనుచూ రాధ  దూరముగా నున్న రధము లోనుండి చూచుచున్న గోపాలుని చూచి అయ్యో అనవసరముగా చెంపపై కొట్టితిని అని అనుకొనుచూ మందహాసము చేసెను . గోపాలుడు కూడా మందహాసము చేసెను. కృష్ణునికి కోపమురానందుకు రాధ సంతోషించెను. చినుకులు మొదలయినవి.  రాధ రధము కేసి పరుగు ప్రారంభించెను. రధము చేరనంతలో  రాయి తన్నుకొని తూలిపడి గోపాలుని భుజములపై వాలెను గోపాలుడు రాధ చేయిపట్టి రధమెక్కించెను  

54.. చిటపట చినుకులు కురిసే 

అటుఇటు చూడగ జనులిక హాహా యంచూ 

మొటమొట  మొగములు  చూపగ 

పిటపిట మనుగు బ్బలూగ  వెలదియు పారే  

అదిచూచి వనవిహారము చేయుటెట్లు సాధ్యము అని రాధ చింతించుచుండగా  కృష్ణుడు "ఇప్పుడు   వన విహారమునకు పోవుట దుర్లభము  కావున వాన విహారమునకు పోయెదము. అని పరిహాసమాడుచూ రాధని  రథమునందు నందు ఎక్కించుకొనిసాగుచుండెను.  మొదట చిటపట చినుకులతో మొదలయిన వాన అంతకంతకూ పెరిగి ఉదృత రూపమును దాల్చెను.  వానహోరు  జూచి రాధ భీతిల్లెను. " ఏమీ  కుంభ వృష్టి!   ఇదేదో  ఉపద్రవమును  సూచించుచున్నది.  రధము త్రిప్పుము గోపాలా" అని రాధ గోపాలుని వేడెను.   

 55.క. పెళపెళ మని పగిలి నింగి  

గళగళ మని దిక్కులోడ ఘనముగ కురిసే 

తళతళ మెరుపులు మెరిసే   

భళిర భళి అమరాధిప వళావళికిన్

పెళపెళమని పగిలి నింగి గళగళమని దిక్కులోడ (ఓడ - భయపడ ) ఘనముగ కురిసే. తళతళ మెరుపులు మెరిసె  భళిర భళి (శభాష్ )  అమరాధిప (మహేంద్ర  ) వళావళికిన్.:: గోపాలుడు " మారాకను చూచి  అమరేంద్రుడు వళావళి (merry uproar)చేయుచున్నాడు.  నల్లని రహదారిపై రబ్బరు చక్రముల  రధము తొణకక సాగుచుండెను.  కృష్ణునకు ఏమీ కచ్చు అని రాధ మ్రాన్పడి రధము తోలుచున్న గోపాలుని చూచుచుండ గోపాలునకు ఆమె మనోగతము అర్ధమయినట్టు చిరునవ్వు నవ్వెను. కొద్దీ క్షణములలో వాన నిలిచిపోయెను. మేఘములు తొలగి తొగరాజు నిండుగా నవ్వుచుండెను. చల్లని వెన్నెల చేతులు చాచి ఆహ్వానించుచున్నట్టు న్నది ఇచ్చట కొలదీసేపు సంచరించెదము అని రాధ కోరగా గోపాలుడు రధము నిలిపెను. ఇరువురూ రథము దిగి నడుచుచుండిరి. నవయవ్వనము తొణికిసలాడు ప్రకృతి కన్య స్నానము చేసి శశికిరణములలో అందములారబెట్టుకొనుచున్నది. శాఖముల ను చీల్చుకొని నేలను తాను శశికిరణములు సమ్మోహనముగాఉన్నవి.       

*      కాదనకుతూహల రాగం ఆది తాళం 


నృత్యము ముగిసిన పిదప రాధ  విరహాగ్నిలో కాగుచుండ. సుందర శృంగారాలోకమున వారిరువురు విహారం  చేయుచూ చాలా దూరము సాగిపోయిరి. అక్కడక్కడా రధమును నిలిపి  వెన్నెల వన్నెలను  చూసి  శీతల కుడుము(ice cream)లారగించి  వెనుకకు మరలిరి.  వూరు సమీపించుచుండగా  ఒక వన  ప్రదేశమున గోపాలుడు  రధమును నిలిపేను 


*   మాధ్యమావతి రూపకతాళం 

 వానవెలసిననూనేల  అంతయూ పంకిలముతో నిండియున్నది చంద్రుడు మబ్బుల చూటుకి పోయెను ,   చీకటి అలిమెన. కొలది దూరములో స్మశానము సమాధులు కనపడుచున్నవి.  విగతజీవులు భూమిలో నిద్రించుచున్నారు   మిణుగురు పురుగులు చీకటిలో ఎగురుచుండగా రాధ కాళ్ళకి గోపాలుడు గజ్జెలు కట్టెను. మాధవా " నీకెందుకయ్యా ఈపని " అని రాధ నొచ్చుకొనెను. గోపాలుడు నువ్వెను.  ఈ ప్రదేశము ఊరికి దగ్గర ఊరివారు వచ్చిన రావచ్చును , గోపాలుడు మరల నువ్వెను. 

 స్వరజతి

 తథాధిత్తి తై  ధాధాధిత్తి తై   తథాధిత్తి తై  ధాధాధిత్తి తై 

తథాధిత్తి థడాంగ్  తక తై   ధాధాధిత్తి  థడాంగ్  తక తై

 థకథక దిత్తి తై          -           ధాధాధిత్తి  తై

ధాధాధిత్తి  థడాంగ్  తక తై    ధాధాధిత్తి  థడాంగ్  తక తై 

థాకు జేకుథకు తడాన్గ్ థకథోం   థాకు జేకుథకు తడాన్గ్ థకథోం

థకడ  థకడ  ధిథోం  -  థకడ  థకడ  ధిథోం  - థకడ  థకడ  ధిథోం 

థకడ  థకడ థకడ  థకడ  ధిత్తథోం  - థకడ  థకడ థకడ  థకడ - ధిత్తథోం  ధిత్తథోం

ధాధాధాధా థకడ  థకడ  ధిథోం  -   ధాధాధాధా థకడ  థకడ  ధిథోం

థాకు జేకుథకు తడాన్గ్  థడాంగ్  తక తై - థాకు జేకుథకు తడాన్గ్  థడాంగ్  తక తై

 తథాధిత్తి థడాంగ్  తక తై  -  ధాధాధిత్తి  థడాంగ్  తక తై

థకడ  థకడ థ థ త్ -  ధికట థకట  థోం 

 థకట ధికట  ధికట  థకట  - ధిత్తథోం  ధిత్తథోం  ధిత్తథోం  ( composed by poolabala)

బిలబిల మనుచూ   జనసమూహము రథమువద్దకు వచ్చి నిలిచింది.  ఇది ఆ కృష్ణుడి రథమే అంటూ  అందరూ కొలది దూరంలో నర్తిస్తున్న రాధని  చుట్టుముట్టేరు.  వాడిని కొట్టండి రాధతో తిరుగుతున్నాడు.  ఎంత ధైర్యం అంటూ కొందరు  రాధని ప్రక్కకి లాగేసారు. ఇలాటి తప్పుడు పనులు చేస్తే మనఊరిలో శిక్ష ఏంటో తెలుసా? గద్దించాడు ఊరిపెద్ద. "తప్పుడు పనులు చేస్తే కదా, ఆ  రాధా కృష్ణుడు ఎంతవరకూ ఉన్నారో  ఈ రాధ కృష్ణుడు  కూడా అంతవరకే ఉన్నారు." అన్నాడు కృష్ణుడు. "నోర్ముయ్ పెళ్లి అయినా పిల్లతో తిరుగుతూ ఇంకా మాట్లాడుతున్నావా?"  చాలాగొంతులు లేచాయి. "ఆ పిల్లకి ఇష్టం లేని మనువు ,  అతడు ఎంత అయోగ్యుడో నాచేత చెప్పించకండి. రాధకి అతడు ఇష్టం లేదు. ఆమె కృష్ణుడిని కోరుకుంటోది."   "ఇష్టం ఉన్నా లేక పోయినా తాళి కట్టేడు తెలుసా?" అన్నాడు ఒకడు. "తాళి కట్టేడా తాడు కట్టేడా?"   అన్నాడు కృష్ణుడు.  "అయినా పెళ్లయిన స్త్రీ తో  తిరగడం తప్పు" అన్నాడు ఊరిపెద్ద.  అలా అయితే  కృష్ణుడు చేసింది అదేగా  కృష్ణ మందిరం ఎందుకు కట్టేరు మీ వూరిలో? అడిగేడు కృష్ణుడు.    


 అది అడడగడానికి  నువ్వెవడివిరా. ఆ కృష్ణుడిని నేనే  అన్నాడు గోపాలుడు.  అందరూ పెద్దగా నవ్వారు. నవ్వనిది ఒక్కరే, అతడే  నిజమైన కృష్ణ భక్తుడు, పూజారి, వేదపండితుడు  కృష్ణ చైనులు.  వీడితో మాటలు అనవసరం ఎవరిదో స్వరం ఉరిమింది కృష్ణుడిని కొట్టడానికి జనులందరూ పరిగెత్తారు. మురారి ఇంతింతై వటుడింతై విధంగా అనూహ్యాయఁగాపెరిగి పోయెను. అతడి  తల మేఘమండలము తాకుచుండ  మెరుపులలో మెరుపువలె ముకుందుడు   వెలుగుచుండెను. జనులంతా  అతడి పాదములవద్ద పిపీలకములవలె చూపడుచుండిరి.

    ఉ.అంబుజు   డంబరా      నకనె     అంకము     వంటిము   కుందరూ పమున్          

       అంబక     చండము    నకనె     ర్కుని        తేజము    సారస   ద్యుతే   

       అంబర     కప్పుర     మువలె    అంతము     కాగధ       రాతలం  బునన్

       జంబర     విగ్రహ       చరణ      ఛాయల      దాగిరి       లోకులం  దరూ    

అంబుజుడంబ రానకనె ( చంద్రుడు ఆకాశములో  చూసెను); అంకము (పర్వతము) వంటి;  ముకుంద  రూపమున్; అంబక (కంటి )చండమున (వెలుగులో) కనె ; అర్కుని(సూర్యుని) తేజము; సారస(చంద్రుని)  ద్యుతే (కాంతే);   అంబర కప్పురము (ఆకాశ కర్పూరము) వలె ; అంతము కాగ  ధరాతలం  బునన్, జంబర విగ్రహ(గంభీర మూర్తి) చరణ ఛాయల(పాదాల నీడలలో) దాగిరి లోకులందరూ.  

 ముకుందుడు పర్వతము వలె పెరిగి అంబరమును తాకు  చుండగా  చంద్రుడు అతడి కన్నుల వెలుగులో  సూర్యుని తేజమును కనెను. చంద్రుని వెన్నెల కర్పూరముతో పోల్చబడినది.    గాలిలో కర్పూరము హరించుకు పోయినట్లు,సూర్యుని వెలుగులో వెన్నెల హరించుకు పోయినది. అప్పుడు భూమి మీద జనులు ముకుందుని పాదముల నీడలో దాగి ఆ కాంతి నుండి రక్షణ పొందిరి.   

 అనిలము చెలరేగుచుండెను, చెట్లన్నియూ ఊగుచుండెను . ప్రక్రుతి ఉన్మత్త రూపము ముకుందుకి కోపమును చూపుచుండెను  ఆకాశము పెళపెళమని ఉరుముచుండగా ఆ మేఘజ్యోతిలో పరమాత్ముని లీల అగుపడుచుండెను.    ఇంతలో ఒక విద్యుల్లత ఆప్రదేశమందు వాలుచుండెను. పరమాత్ముని పరిమాణము ముందు పిడుగు కూడా మిణుగురు పురుగు వలె నుండెను.  పరమాత్ముడు తన నోరు తెరచి విద్యుల్లతను మింగివేసెను. ఆ కరాళ దృశ్యాన్ని చూసి భీతిల్లిన ఊరిజనులందరూ పరుగులు  తీయుచుండిరి. రాధ మూర్ఛిల్లెను. చైనులు పొరపాటున వారికడ్డుపడి వారి పాదములచే మట్టివేయబడి  పంకిలంలోకి దిగబడెను. మురారి ఉరిమి చూడగా నింగిలోకి ఉరుములు మెరుపులు అంతరించి నిశ్శబ్ద అలుముకొనెను.    

  . అంతట       రాధనే       త్రముల   నార్పక    చూచుచు    చీకనే   కనెన్  

అంతయు    స్ఫురణే     గలిగి      నాత్రము      గాచని       లేడివే    గమున్ 

చెంతన        కారునం    దుకన     సేమము  యానము   ఏమిలీ  లలో               

 వింతగ         చూపెనీ      లమణి   మింటిన     విశ్వరూ    పమున్   

అంతట  రాధ  నేత్రముల   నార్పక    చూచుచు    చీకనే   కనెన్ ;  అంతయు   స్ఫురణే   గలిగి   ఆత్రముగా చని,   లేడి వేగమున్ చెంతన  కారు (అడవి)నందు, కన ( చూడగా ) సేమము (భద్రము)  యానము  (రథము )  ఏమిలీ  లలో ; వింతగ  చూపె నీలమణి  ( కృష్ణుడు)  మింటిన విశ్వరూపమున్.  

కొంతసేపటికి రాధకి స్పృహ వచ్చి చూడగా చుట్టూ చిమ్మ చీకటి కానవచ్చెను. మెల్లగా జరిగినది స్ఫురణకు రాగా రాధ తనువెల్ల పులకించెను.  ముకుందా! మురారీ !! గోవిందా!!!  నీదర్శన భాగ్యం కలిగించేవా అనుచూ  పెద్దపెట్టున రోదించుచుండెను. రాధకు ముకుందుని అడిచిన వైనము కళ్ళముందు కదలాడెను. అయ్యూ ముకుందా భక్త మందారా నాచే చెంపదెబ్బతిన్నావా అని వెక్కి వెక్కి ఏడ్చుచూ అకస్మాత్తుగా మత్తు దిగినట్టు ఇంతకీ నాకృష్ణుడు  ఎచ్చటకి పోయెను. 

రాధ దూరముగా ఉన్న రథమును చూచెను  మెల్లగా నేలపై నుండి లేచి రధము వైపు నడవసాగెను. రథము వెనుక భాగములో స్పృహలేక పడియున్న తనకృష్ణుని తాకి చూసెను. కృష్ణుడు ఉలిక్కి పడి లేచి రాధ ను చూచి కంగారు పడి  "కునుకు పట్టినది ఏమియూ అనుకొనరాదు, అని చెంగుమని లేడివలె దుమికి ముందుకుబోయి చక్రమునందుకొనెను. రాధ కూడా ముందుకిపోయి కూర్చొనెను. యంత్రము చలించెను. రథాంతరము ప్రకాశించెను. కృష్ణుని చెంప పై రాధ చేయి ముద్రను చూచి నిన్ను కొట్టిన చెంప దెబ్బ  నాకృష్ణునికి ఇచ్చినావా  అని మనసులో అనుకొనుచూ రాధ ముకుందా , గోవిందా, తండ్రీ  ఉన్నావయ్యా అని ఉర్రూతలూగుచుండ 

ఇప్పుడేకదే  భగవంతుని దర్శనము చేసుకొని వచ్చినావు ఇంతలో ఏమాయెనే అని కృష్ణుడు  అనగా  నీకెట్లు తెలియుననుచూ రాధ నిర్ఘాంత  పోయెను. రధము పరిగెడుచుండెను మెల్లగా గొంతు పెగుల్చుకుని మరల  "నీకెట్లు తెలియును ?" అనెను అదేమి పిచ్చి ప్రశ్న మందిరమునకు పోయి  వచ్చెదనని చెప్పి  పోయినావుకదా , మరచితివా? " ఓహో ఇంకనూ నా వెర్రి విభుడు అచ్చటనే ఉన్నాడన్నమాట.  ఎంతమాయగాడివయ్యా ముకుందా నీవు సారధ్యము చేయుచున్నప్పుడు ఒక్కసారికూడా తలతిప్పి వెనుకకు చూడలేదు. చూచినచో  కృష్ణుడు వెనుకనే పడుకున్నాడని తెలిసెడిది. నీ మాయ ముందు నేననగా ఎంత ఇచ్చటికెట్లు వచ్చినాము మనము గుడివద్దనుండి ఇంటికి పోవు మార్గమిది కాదే. నీవే నడిపి తీసుకువచ్చినావు అని రాధ అనెను. (అనేక తప్పలేదు). అమరదేశమున  అమరగాయకుడు మైకేయుడు  ( మైకేల్ జాక్సన్ ) అను ఒకడుండెడివాడు.  అతడు ప్రమాభరితమగుపిల్ల  గీతము నాలపించెను మొదటిలో   "పెళ్ళను దర్పణ విస్పోట స్వనమును" సృజించెను.  రాధ కృష్ణునికి కేదో సంభవించినది అనుకొను  చుండగా.   నాహృదయము అట్లు పగిలినది  అనెను.  కృష్ణునికి పిచ్చి కోపము వచ్చెను " పిచ్చి పిచ్చిగా యున్నదా అని కృష్ణుడు రధమును నిలిపి వేసెను. రాధకు నవ్వు వచ్చిననూ అదిమిపట్టి " అయ్యా పిచ్చి మారాజా మరదలు నీతో ఆపాటి సరసమాడిన తప్పగునా ! అని అడిగెను. కృష్ణుడు నవ్వుచూ రధమును ఉరికించెను                

  

పూర్ణిమరేయి! అఖండ చంద్రుడు అంబరము నేలుచుండెను. కృష్ణుడు మిద్దెపై నిలిచి పున్నమి చంద్రుని చూచి "ఇందుమతి ప్రద్యోత కోమలాంగి, శుభాంగి రాధ తేజము కౌముది తలపించుచున్నది. ఇప్పుడు ఆమె చట్టబద్దముగా స్వతంత్రుతరాలు. ఈరేయి రాధ నర్తనము చూసి  పరవసించవలెను." కృష్ణుని  కనులలో రాధ, శిరమున స్వర్గము, నరములలో అమృతము  తెలియుచుండెను. కృష్ణుడి ఉల్లము నర్తించుచుండెను.  కానీ మొదటి రేయి ఎట్లు అడగవలెనని అనుకొనుచూ శోభన గృహమున  ప్రవేశించి ఎదురు చూచుచుండెను.  ఇంతలో గదిలో అడుగుగిడి రాధ తలుపు మూసెను.  మల్లె గులాబి దండలు దోబూచులాడుచున్నవి. రాధ చేతిలో గజ్జెలున్నవి. నామనోగతము ఈమెకేట్లు తెలిసినది అనుకొనుచుండగా  రాధ గజ్జెలు కాళ్ళకి కట్టుకొనుచుండెను.   కృష్ణుడు నేలపై కూర్చొని రాధ పాదములను తన తొడపై నుంచుకొని గజ్జెలు కట్టెను.  మొదటి రేయి  వృధా అగునేమో  అని కృష్ణుడు అనుచుండగా  రాధ " మొదటి రేయి అని ఏమున్నది అన్ని రాత్రులు మనవే కదా ." అనెను.  రాధ తన అణువణువూ పులకించుచుండ కృష్ణుడు కోరిన వణుకు నృత్యమును చేసెను. ఆ కృష్ణుని కృపచే వారి శృంగార హేల  జీవనవాహినివలె  అప్రతిహతమై సాగెను.  


7 comments:

 1. బాగుంది. అక్షరమొక ఇటుకగా మార్చి సాహిత్య సౌధమును నిర్మిస్తున్నారు. will wait until tomorrow for continuation

  ReplyDelete
 2. హ!హా! పాపం కృష్ణుడి భాధలు! ఏది ఏమైనా రెండవ భాగం మొదటి భాగాన్ని మించి ఉంది. చాలా... బాగుంది.శ్రీనాథుని మించి రాస్తున్నారు.

  ReplyDelete
 3. Really I am breathless while I am reading this story.

  ReplyDelete
 4. భారత వర్షలో విదిషా,వర్షా కలవనందుకు చాలా బాధ కలిగింది.ఇక్కడ రాధాకృష్ణుల కథ సుఖాంతం చేశారు.ధన్యవాదములు.

  ReplyDelete
 5. Have you connectd to Krishna? If so try to do pooja to Krishna today. How's Lord Krishna's viswaroopa description? Radha has slapped Krishna but Krishna loved her. With Lord Krishna the story become s rich and attains spiritual standards. Do you agree that it is unforgettable?

  ReplyDelete
 6. Description of vishwaroopa of krishna is awesome. Description of romance between Radha and Krishna is superb.Sir Whatever you wrote it touches the hearts of the readers.It is visible forever.

  ReplyDelete
 7. I wish I had more ( peaceful) time to feel the story .

  Meru rasindi chala bagundi andi

  ReplyDelete