Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, June 8, 2019

ఆనందలోకం లో - పద్యకావ్యం -పూలబాల

1.అరుణ వర్ణములంబరము నలమకముందె
నా మనోరధమీడేర్చ  రథమొక్కటి పొందె
రహదారి మార్గమున్, బోలి సన్నాయి స్వరమున్
ఏగె ద్వారక, అర్చింప అనంతుని పాదముల్  

2.బహు దూరము  దేవళము, కడు తీవ్రము గ్రీష్మ ప్రతాపము
 శీతలము  రథాన్తరము,  రథ గమనము మంగళవాద్యము, 
 ఔరఆలుమగలు స్వర యుగళము, దైవ సందానితము ,
 ఔరఔర! ఘనము కాలము.  క్షణమొక  బంగరు నాణెము 


3. కొండొక కీడు శంకించేనోమో!  పరుగులు దీసె మేరు తేరులు,
 రహదారి  జూసి నల్లని కాలసర్పము మని భ్రమసి  భీతిల్లెనో ,
 రై రై రయమున సాగె రథములు మెరుపు వేగమున 
 పీలి , నీలి మేలి రథములెన్నో దాటి వాహన నిర్ఘరమునన్ గూడి                   
 జేరి పట్టణమున్  జలదినందోడ వోలె తేలి సాగె రధము.

4.అయ్యారే! ఏల కలిగెనో  ఈ చురుకు,  చుర్రుమనె డెందము 
ఓర్చు టెట్లు  మందగమనపు సరసిజాక్షుల అందము  
 ఓరచూపుల కలిగె మోదము సాగె  అంతరంగము, 
 సడి సేయక తురగముఆనంద లోకమందు విహరించ.       
               
5.పల్లెలు దాటి , చెరువులు చుట్టి గరువులు మీదుగా
సాగె రధము ప్రకృతి హొయలు కావే ౘక్కిలిగింతలు 
కాడే రథికుడు రసికుడు రథమును నిలిపి  లాగడే
ఒడుపుగ అందముం ఛాయాచిత్రమునం చుంబించడే!

దిగంతాల బుగ్గల సిగ్గులు తట్ట, తీయని తలపులు హృదయమును చుట్టె
అంతఃకరణమున వేదమంత్ర ఘోష స్మృతి నందు నిలిచే క్షణములు అట్టే 
















6. రథ సారథి పద సారధి , పదముల పాదముల నర్చించి                                                                          
బహుళ వాఙ్మయమునకు నీరాజనము నర్పించి
కణికను నగముగా మార్చిన విశ్రమించని ప్రయాణికుడు
బహుబాషాభిలాషకుడు విస్తృత పదప్రయాణికుడు.

7.నవ్వుతూ తుళ్ళుతూ న్న అంతరంగమా, బాహ్యతలమున మౌనమేల
భవ్యమైన భావము లెన్నో మౌనంగాచూపి వర్షముగా, నను తడపనేల
ఇది భాషా ప్రతిష్టంభన వినోద లీలా కేలియా, మౌనభావవిజయ హేలియా
మౌన తరంగములలో దాగిన నీ అంతరంగమును శోధించ నా తరమా ,
నీ సొగసు చూడ తరమా!!

8. పెదవివిప్పిన, పలుకులు సారంగీ తరంగమై చిత్త రంజనము కాగా
పెదవి విప్పక విసిరిన నవ్వులే విరిసి కురిసిన విరజాజులు కాగా,
శతమానము హిమోన్నతము సతతమానందము అనిలము కాగా
తలుపులు మూసిన శీతల రథమున నీ తలపులు ఆపుట నాతరమా
నీ సొగసు చూడ తరమా!!

9. ఎఱ్ఱవేల్పు చుర్రున చూడ వృక్షరాజములు నీరసపడగ
రహదారుల నిండా ఎండమావులు తారసపడగా
మృగ విహగాదులు నీడకొరకై వెదకి నిరాశపడగా
సకల జగత్తులు విలవిల లాడి, జేష్ఠమా నీకు సాష్టాంగ మనగ.

10.జేష్ఠ కీలలన్ జీల్చుకు పోయి పద్మవ్యూహమున్ జొచ్చిన అర్జునినివోలె
ద్వారకా తిరుమల జొచ్చె రధము , రధమో అది రాజహంసో కానీ వాలె
శ్రీహరి పాదముల చెంత, నమో నమో యని ఒదిగెను ఇరు హృదయాలె
జంట పుష్పములు వోలె, చేసిన ప్రమాణము ఋణమే , ఋతువేదైనను
నెరవేర్చుట కదా జీవన ప్రమాణము, నమో నమో !! నమో నమో !!
భారతావనికి నమో నమో !! నమో నమో !!

9 comments:

  1. Very nice sir. Congrats. All the best.

    ReplyDelete
  2. మీ రచనా శైలి ప్రాచీన కవుల రచనా శైలిలా ఉంది. ప్రయాణాన్ని వర్ణించిన విధానం, పదప్రయోగం అద్భుతం.మీ ఊహాలోకంలో ప్రపంచాన్ని చాలా అందంగా వర్ణించారు.ఈ రోజుల్లో ఇలా రాసేవారు చాలా తక్కువ.

    ReplyDelete
  3. Ciao
    Questo poesia molto bello perché molto verbi
    Grazie mille
    l'insegnante

    ReplyDelete
  4. మీ తెలుగు సాహిత్యం అద్బుతం

    ReplyDelete
  5. Makes me wonder that Can a short road trip be described so precisely with every detail. Vicarious narrative indeed!!

    ReplyDelete
  6. పదాల చాటున దాగిన నిగూఢ అర్ధాల నిధులు
    అందాల వర్ణనలు, ఆవేదనల వివరణలు
    మనసుమాటున భావాల గుట్టువిప్పు గూడాచారులు
    కధలకీ కావ్యాలకీ అల్లుకున్న అలంకారాలు.

    .....వడ్డీకాసులు.

    ReplyDelete
  7. అనితరసాధ్యము ఈ శైలి

    ReplyDelete