తెలుగు హీరో కి మంచి మర్యాద..వంటి లక్షణాలు ఉండ కూడదు. ఉండవు. గమనిస్తే విలన్స్ నే హీరోగా చూపిస్తున్నారని అర్థం అవుతుంది. హీరోయిన్ ని కట్టుబానిసలా చూసి ఒసేయ్ అని పిలుస్తూ మాట్లాడతాడు , ఫ్రెండ్స్ ని చాచి లెంపకాయ కొడతాడు, పెద్ద చిన్న లేకుండా ఎవఱినైనా అవమానిస్తాడు. బుద్ధి చెపితే తండ్రిని కూడా వేళాకోళం చేస్తూ హీన పరుస్తుంటాడు.
A Telugu hero should not have good manners. It is true. If you take a serious look , you will understand that villains are portrayed as heroes. A Telugu hero regards the heroine as his slave and calls her ``Osey', He slaps friends and insults anyone. If his father tries to teach him he teaches back deflates his father with his wrong logic.
కథ
క్రైమ్ న్యూస్ , బూతుకథల వెబ్ సైట్లు కంబైన్ చేస్తే తెలుగు సినిమా కథ వచ్చేస్తుంది. పూర్తిగా క్రైమ్ కథలని తిప్పి పాజిటివ్ గ చెప్పేస్తున్నారు. భార్య భర్తలు వేరే సంబంధాలు. పిల్లలముందే సరసాలు పిల్లలకి కూడా కాలేజీ లో ప్రమాదకరమైన ప్రేమలు. ఆప్రేమకి తల్లి మద్దత్తు ఇట్లా ఉంటేనే జనం చూస్తారు అని చదువుకొన్న వాళ్ళు కూడా వత్తాసు.
If crime news and adult story websites are combined a Telugu movie story will emerge. They are showing complete crime stories positively. Husband and wife, both have extra marital relationships. Father flirting before kids, Sons studying in college having is a dangerous love. Mother backing up such love affairs is common. Even educated people say that such movies can entertain people.
హీరోయిన్
ఆత్మాభిమానం లేని ఆకర్షణీయమైన ఒళ్ళు చూబించగలిగే తెలుగురాని పిల్ల. ఎప్పుడూ హీరోగురించే మాట్లాడుతూ , హీరో కోసం కలలు కంటూ , తన జీవితానికి ఏ లక్ష్యం లేకుండా బ్రతికేస్తుంది. ఒక సీన్ లో వామ్ప్ లా గుడ్డ లిప్పేసి తైతెక్క లాడి మరుసటిసీన్లో సంప్రదాయం గురించి మాట్లాడుతుంది. స్త్రీ అనే భావన ఏమీ లేకుండా ఎంత డబ్బు అని లెక్క చూసుకుని నటించి పడేస్తూ దూసుకు పోతుంది.
Mrs. Varalakshmi sending books through courier |
My wife Varalakshmi and I have written books to help children learn languages and to bring awareness about the circumstances in which we are living. She is donating the books for the children of a charity home. Anybody can contact us for free books.
సమాజం / Our society
మన సమాజం హీరో హీరోయిన్లకు పెద్దపీటవేస్తుంది. వాళ్ళని షాప్ ఓపెనింగ్ లకి పిలిచి భక్తి తో పూజిస్తారు. యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన సైనికుడు ఒక పెద్ద కవి, రచయితా ఎవరికీ అక్కరలేదు. (ఎంతమంది సైనికుల విగ్రహాలను చూసారు ఎక్కడచూసినా ఎన్ టీ ఆర్ , రాజశేఖర్ రెడ్డి విగ్రహాలే.)
Our society show great respect to Cinema actors. Even a junior artist in cinema has more respect than a soldier and a scientist. How ever they fail to receive writers and poets. In fact they hate writers and poets. It is boring to see their faces. When I was Interviewed for my World Record Novel Bharatavarsha a lady asked the Interviewer " Why interviewing writers better interview cine actress Sarada".
చిన్నపిల్లలు / Children
మన సమాజం మన కల్చర్ చాలా మంచిది అని చెప్పుకుంటుంది. అంతమంచిదైతే స్త్రీలు వంటరిగా బైటకు వెళ్లగలుగుతున్నారా? మన సమాజంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందొ అంతకంటే దారుణం పిల్ల పరిస్థితి. చిన్న పిల్లలకి కావలిసిన సినిమాలు ఎవరు తీస్తున్నారు? ఈ అడల్ట్ మూవీస్ అనే ఈ విషన్నే పిల్లలకి పెడుతున్నారు. వాళ్ళూ అదే తింటున్నారు. పాపం ఈ సినిమాలు చిన్న పిల్లలని అతి త్వరగా చెడగొట్టేస్తున్నాయి. యువకులు ఇప్పటికే పెడదారిపట్టారు. చిరంజీవి అభిమానులు గరికపాటివారిని ట్రోల్ చేయడం, ఆడవాళ్లు బట్టలు నిండుగా కట్టుకోవాలి అని అన్నందుకు చాగంటి వారిని ట్రోల్ చేయడం తెలుసుసుకదా!
Our society claims that our culture is very good. If it is true why women are unable to able to go out alone? The situation of women in our society is worse and the situation of children is the worst. Do we have children movies? Who is making movies for young children? Our children are watching the adult movies. They are eating the same poison. these movies are spoiling the children very quickly. Young people have already been led astray. Sri. Chaganti was trolled for saying that women should wear full clothes, don't you know? Do you know Chiranjeevi fans trolling Sri. Garikipati?
న్యూస్ /News
టీవీ ఛానెల్స్ లో మొత్తం అస్లీలత అక్రమ సంబంధాలు నేరాలు
న్యూస్ లో న్యూస్ ఉండదు. అది న్యూస్ ఇది చూస్తే షాక్ , అది చూస్తే తట్టుకోలేరు. సమంతకి అది చేయక పొతే రాత్రి నిద్రపట్టదు అంటాడు ఒకడు. తీరా చూస్తే బ్రష్ చేసుకోడం. మహేష్ భార్య కు పెళ్లి ..అంటాడు ఒకడు..అంటే మహేష్ భార్య గా నటించిన ఆమెకు పెళ్లి ..వాళ్ళ ఇల్లు చూస్తే షాక్ అంటాడు ఇంకోడు. టీవీ , న్యూసుపేపర్స్ , యు ట్యూబ్ చానెల్స్ అన్నీ పనికిమాలిన విషయాలని చూపిస్తూ , సెన్సేషన్ అంటూ న్యూస్ ఆన్న పదానికి అర్ధాన్ని మార్చేసారు. సినిమాలు , న్యూస్ రిపోర్టింగ్ తీరు మారిపోయింది నాయినా!
Total obscenity and crime on TV channels
There is no news in the news. All are sensations and shocks. If you see this you get shocked. says somebody. If you watch that you lose mind. says somebody. somebody says " Samantha won't sleep at night if she doesn't do it" He is writing about brushing teeth at night. Mahesh's wife is getting married..says somebody..it means the one who acted as Mahesh's wife is getting married. If you see his house You get shocked" What did she tell the actor in his ear" This is news. TV, Newspapers, You Tube channels are showing useless things by calling it sensation. They have changed the meaning of the word news.
విద్య /Education
అన్నీ మారిపోయినా మారనిది ఒక్క విద్యే. పరిసరాల జ్ఞానం , ప్రపంచజ్ఞానం , భాషాజ్ఞానం స్వల్పమాత్రంగా అందిస్తూ మంచి మంచి మార్కులని అందించే మన విద్య నిజమైన మిధ్య. విద్యార్ధులకి ముఖ్యంగా పిల్లలకి ప్రపంచ జ్ఞానం లేకపోడంతో వాళ్ళు సినీ సర్పద్రష్టులుగా సర్వ భ్రష్టులుగా మిగిలిపోతున్నారు.
I fully understand your anxiety regarding falling standards in society.day by day it is worsening.time to introspect
ReplyDeleteNicely written sir. As a society we need to do a " hard reset " and rethink about the lives we lead and the example we set for the children.
ReplyDeleteMovies do play a very important role in that.
Nevertheless, it's the education system that needs reforms. Studying for marks and ranks should go (atleast till 10th class) later on competitive education is acceptable as it is a costly affair for the govt too. Intellectuals like you should do something about that sir. Or atleast have a parallel curriculum to be followed by parents and kids for general well being and become responsible citizens of the world.
Dr. Ravi Kishore