Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, December 7, 2025

Great luck - Italian

 Questo è un vero e proprio gioco d'azzardo. In questa foto, un giovane indiano seduto nella metropolitana tedesca sembra molto teso, triste e deluso. Accanto a lui è seduta una famosa attrice, di cui non sa nemmeno chi sia. In poco tempo, la foto è diventata virale in tutta la Germania.



La famosa rivista tedesca Der Spiegel ha iniziato a cercare il giovane indiano nella foto. Alla fine, lo ha trovato a Monaco. Poi ha scoperto che il giovane si trova in Germania illegalmente.


Il giornalista ha chiesto:

"Sa una cosa? Quella ragazza dai capelli biondi seduta accanto a lei è #MaisieWilliams... l'eroina della famosa serie #GameOfThrones. Milioni di persone nel mondo sognano di farsi un selfie con lei. Ma lei non ha reagito affatto... perché?"


Ha risposto con calma:

"Se non ha un permesso di soggiorno, non ha un solo euro in tasca e viaggia in treno 'illegalmente' ogni giorno... non ha la possibilità di pensare a chi le sta accanto."


Colpita dalla sua onestà e dalla sua situazione, la rivista gli offrì un lavoro come postino con uno stipendio di 800 euro al mese. Il contratto di lavoro gli garantì immediatamente anche un regolare permesso di soggiorno.


Questa storia ci racconta come funziona la fortuna. Ogni evento è strettamente legato all'altro. La vita scorre come un copione pre-scritto. Nessuno sa cosa sia scritto nel nostro futuro.

Sunday, November 23, 2025

నిదించాల్సింది మీడియాను కాదు

 నిదించాల్సింది మీడియాను కాదు 

నరకాల్సింది చెట్టు కొమ్మలను కాదు వేళ్ళను 



పురుషులు కామపీడితులుగా ఎలా మారారు? 

నేటికి కూడా మనని పీడిస్తున్న ప్రాచీన పాపాలు 

స్త్రీని ఒక  విలాస వస్తువులా చూసే జబ్బు ఎలా చేసింది?

ఒక సబ్బుబిళ్ళ గా చూసే జబ్బు సమాజానికి. ఎలా చేసింది? 


నేడు సోషల్ మీడియాలో  ప్రతి పది పోస్టులలో 8 పోస్టులలో స్త్రీ ల నగ్న చిత్రాలే . శృంగారం అంటే ఏంటి ?  ఆడది మగాడి నుంచి కోరుకునేది ఏంటి ? 

ఆడది మగాడికి ఎందుకు లొంగుతుంది ?   వంటి శీర్షికలతో  ఎదో అవగాహన కలిపిస్తున్నట్టు  శృంగారం , కామం పెనగలిపి స్త్రీల నగ్న చిత్రాల ను జోడించి పోస్టు వండితే   లైకులపంట పండుతోంది.   

చాలా పోస్టులు  స్త్రీలకి సంబంధిచినవి  కాకపోయి నప్పటికీ స్త్రీల నగ్న అర్థ నగ్న చిత్రాలు సర్వసామాన్యం అయిపోయాయి.  ఉదాహరణము చిత్ర కల అంటారు  స్త్రీ నగ్న చిత్రాలు గీస్తారు ఒంటిమీద నూలు పోగు లేకుండా అంగాగాన్ని చూపుతారు ఏమైనా అంటే కళ అంటారు. ఎవరైనా మూసుకు కూర్చో వాల్సిందే.  బూతు,  అస్లీలత అనరు.  ఎన్నో విప్లవావాలొచ్చాయి. ఈ బూతు చిత్రాలకి వ్యతిరేకంగా  ఎందుకు విప్లఅవాలు రావు ? 

ఎందుకంటే ప్రజలు  నగ్న చిత్రాలకి అలవాటు పడిపోయారు. ఇది వ్యసనమే . ఈ వ్యసనం  ప్పటిదికాదు.  తరతరాలుగా నరనరాలలో జీర్ణించుకుపోయింది .   మైఖేలాంజెలో, బెన్వెనుటో సెల్లిని, జియోవన్నీ బెల్లిని, లెనార్దో దా విన్సీ ఇంకా అనేక చిత్రకారులు మనకి తెలుసువీరంతా   కళ  పేరుతొ  ఏంచేశారు?  నగ్న చిత్రాలను అద్భుతంగా గీశారు 

నిత్యం మాధ్యమాల్లో వేలాదిమందికి స్త్రీ నగ్న చిత్రాలు దర్శనమిస్తాయి ప్రజలు ఏంచేస్తారు? లైక్ కొడతారు. అద్భుతం అందం అంటారు. అసభ్యత అని ఎవరైనా అంటారా?  వీరికి వ్యతిరేకంగా ఏ విప్లవమూ రాదు. ఎందుకు? ఎందుకంటే ఇది వ్యసనమే కాదు పురుష బలహీనత.  

కళ ద్వారా నేరుగా మైథునాన్ని చూపిస్తారు. తప్పు అని ఎవరైనా అంటారా? సృష్టికార్యం అంటారు. తప్పేముంది అంటారు.  స్త్రీని ఒక వినిమయ వస్తువు క్రింద ఒక విలాస వస్తువులా చూసే జబ్బు చేసింది. సమాజానికి. ఒక బానిసలా సబ్బుబిళ్ళ గా చూసే జబ్బు చేసింది.

ఈ జబ్బు ప్రపంచమంతా ఉంది. దేశదేశాల్లో, తరతరాలుగా శిల్పులు, చిత్రకారులు, కవులు కామపీడితులై స్త్రీ నగ్న దేహాన్ని చిత్రించడంలో ప్రజ్ఞను చూపించారు. స్పెయిన్ లో వేలాది అందం పేరుతొ కామాన్ని ప్రేరేపించే వివిధ రకరకాల భంగిమల్లో స్త్రీ మానాన్ని సైతం చూపిస్తూ చిత్రాలు గీశారు. 1640 లోనే స్పెయిన్ కోర్ట్ స్త్రీ నగ్న దేహాన్ని చూపించడం ఇల్లీగల్-గాప్రకటించింది. 

ఏంతో మంది ప్రఖ్యాత చిత్రకారులు వేసిన చిత్రాలు కూడా చూసేవాళ్ళని కామ బానిసలుగా చేస్తున్నాయని "ఇన్వెన్షన్స్ అఫ్ డెవిల్"గా ప్రకటించ బడ్డాయి.  చార్లెస్ III "అసభ్యకరమైన చిత్రాలను" సేకరించి వాటిని వెంటనే కాల్చమని ఆదేశించాడు. కానీ ఎక్కువ మంది రాజులు వీటిని ప్రోత్సహించి ఆదరించారు. మొత్తానికి రాజుల పాపాలు ప్రజలకి తగిలి ప్రజలు కామ పీడితులుగా మారిపోయారు. రాజులు నగ్న చిత్రాలు చూడడం వల్ల ప్రజలు కూడా అదేబాటలో నడిచారు.  నడుస్తున్నారు యాధారయాజా తథా ప్రజా అన్నారు కదా! ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని ఈ బూతు బొమ్మల భరతం పట్టాలి. 

Saturday, November 8, 2025

తెలుగువాడు గరించదగ్గ బహుభాషి

 #పూలబాల  — #తెలుగుతనం# ఉట్టిపడే  #బహుభాషి 

.

విదేశీభాషలపై  పట్టు సాధించి వాటిద్వారా బతుకుతున్నా    తెలుగు భాషకు  నిత్యం నీరాజనాలు ఇచ్చే పూలబాల రచనా ప్రతిభతో ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న రచయిత, కవి మరియు భాషా సైనికుడు . ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన  జీవన విధానం ఆదర్శం. 

 .


పూలబాల  భక్తి , శృంగార ,ప్రబంధాలను రాసే అరుదైన రచయిత. ఆయన బ్రతకడానికి మాత్రం సంపాదిస్తూ  విలాసాలు  ఆస్తులపై ఆశలేని సేవాతత్పరుడు .  మీరు రావాలి అని పిలిస్తే ఎంతదూరమైనా ప్రయాణించి  తన శ్రమనంతా ఉపయోగించి మన తెలుగుపిల్లలకి తన ప్రతిభను అందజేయాలనుకునే మంచి మనిషి. 

.

పోలిగ్లాట్  గా  పూలబాల పెద్ద పదవులనలంకరించినా  , ప్రభుత్వం పెద్ద వాహనాల ననుమతించినా  నిరాడంబరంగా తన టు వీలర్ పైనే తిరిగి ప్రభుత్వానికి డబ్బు ఆదా అవ్వాలని కోరుకునేవారు   రచయితగా    అద్భుతమైన ‘#భారతవర్ష వంటి ప్రబంధ కావ్యం రాసినా ‘#ఇండియన్ సోనెటీర్ వంటి  ఇంగిలీషు పద్య కావ్యాలు  రాసినా  ‘#మహాకవి  వంటి విప్లవ రచనలు చేసిన అన్నింటి వెనుక ఉన్నది దేశభక్తి , భాషనురక్తి మాత్రమే! 

లైకులు కోసం దిగజారి రచనలు చేయని, డబ్బులకోసం పుస్తకాలు రాయని  నిజమైన రచయిత పూలబాల  .తెలుగునేలకు తన ప్రతిభను అంకితం చేస్తున్న పిల్లలకు కొత్త నైపుణ్యాలతో దేశభక్తితో చైతన్య పరుస్తున్న పూలబాల నవయుగ వైతాళికుడు 

Friday, November 7, 2025

తెలుగు మనసుకు తెల్లని పంచె...

నాకుసూట్లు నప్పవు- నాకు అంటే నాదేహానికి అని కాదు నామనసుకి. నేను ఎక్కువ గా పంచలే  కడుతుంటాను. ఆత్మానందం కలిగించేది వస్త్ర బంధం. సంప్రదాయ వస్త్రాలు ధరించేది ఎవరినో మెప్పించడానికి కాదు. నన్ను మెప్పించు కోడం కోసం. నా ఆనందం కోసమే.

 పూర్తిగా పంచలనే కట్టుకుంటే అది మన  సంస్కృతిని పూర్తిగా ఇష్టపడడమే  పేంట్స్ తొడుక్కో పంచెలను దూరం పెడితే...?మన యువకులుఇంట్లో నైనా పంచెలు కట్టే రోజు వస్తుందా ?

3 రోజుల్లో ఆరుభాషలు - నిజమేనా?

అపోహలను తొలగించిన సామర్ల కోట  ప్రతిభ  విద్యార్దుల బహుబాషా ప్రదర్శన..

సామర్లకోట ప్రతిభా విద్యానికేతన్  పూలబాలను ఆభాషల శిక్షణ నిమిత్తం ఆహ్వానించగా  3 రోజులు సార్లకోటలో  ఉండి ఆభాషల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు.భాష సాహిత్యం చరిత్ర విద్యార్థుల భవిష్యత్తుకు దేశ భవిష్యత్తుకు చాలా అవసరం అని ఆయన అన్నారు.

ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లీష్ భాషలలో బేసిక్స్  వాక్యనిర్మాణం నేర్చుకుని  బేసిక్స్ అన్నీ పాటల్లా  పాడి 3 రోజుల్లో 6భాషలు వాక్య నిర్మాణం దాకా నేర్చుకోడం సాధ్యం అని నిరూపించారు. ప్రతిభా విద్యానికేతన్ పిల్లలు అభాషలను చాలా చక్కగా నేర్చుకున్నారని పూలబాల చెప్పారు.  . ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ జపనీస్ భాషలను  నేర్చుకున్న విద్యార్దులు భాషల ప్రకారం గ్రూప్స్ గా ప్లకార్డ్స్ పట్టుకొని కూర్చోని ఒకొక్క గ్రూప్ గా కెమెరా ముందుకు వచ్చి వేదికపై తమ భాషలను తడువుకో కుండా  ప్రదర్శించారు.  

.

 ప్రతిభా విద్యా సంస్థల అధినేత  ప్రకాష్  మరియు ఉపాద్యాయులు పిల్లల ప్రతిభను  అభినందించి పోలిగ్లోట్  పూలబాలను ఘనంగా సత్కరించారు.

మానవ సేవ Vs మాధవ సేవ- పూలబాల

 నాది మానవ సేవ ఆవిడది మాధవ సేవ- పూలబాల



చిత్రం లో కనిపిస్తున్న దంపతులు సినిమా స్టార్స్ కాదు

సార్లకోట ప్రతిభా విద్యానికేతన్ ఆహ్వానంఅందుకుని

3 రోజుల విదేశీ భాషా శిక్షణ నిమిత్తం ఇక్కడికివిచ్చేన పూలబాల తాను విద్యార్దులకి సేవచేయ డానికి వస్తే తన భార్య దేవాలయాల సందర్శ నార్ధం తనతో వచ్చినట్టు చెప్పారునేను పాఠ శాలల చుట్టూ తిరిగు తాను ఆవిడ దేవాలయాల చుట్టూ తిరుగుతుంది అన్నారు పూలబాల.

చిత్రం లో కనిపిస్తున్న దంపతులు సినిమా స్టార్స్ కాదు . సమాజానికి రచనలు ద్వారా రోడ్లు గుంతలు పూడ్చడం ద్వారా సేవ చేస్తున్న రచయిత పూలబాల ఆయన భార్య . వివిధ స్కూల్స్లో వర్క్షాప్ ద్వారా ఫారిన్ లాంగ్వేజెస్ భోదిస్తూ ఈయన డబ్బులు తీసుకోరు. పోలీగ్లోట్ రచయితగా సుపరి చితులైన పూలబాల రచనలు చేసి పుస్తకాలు ముద్రించి వాటిని కూడా ఉచితంగా ఇస్తారు.

 

Elite Multilinguagal Program in Pratibha

సామర్లకోట ప్రతిభ విద్యానికేతన్ లో  Multi lingual Workshop  అసలు విషయం తెలిస్తే షాక్ 

భాషా బోధన అస్సలు జరగలేదు  -  వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి గౌరి 

.   

                                                            

ప్రతిభ విద్యానికేతన్ లో నవంబర్ 3 -4–5 తేదీ బహుళ భాషా కార్యక్రమం  జరిగింది. స్కూల్ యాజమాన్యం ఆహ్వానంపై  బహుభాషా కోవిదుడు పూలబాల విజయవాడ నుంచి ఇక్కడకు చేరుకొన్నారు. ప్రతిభా విద్య సంస్థల చైర్మన్ శ్రీ ప్రకాష్ , ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. 

 అయితే  ఇందులో బాషా బోధన  ఏమీ జరగలేదని కార్యక్రమా న్ని  తుదిదాకా ఆటపాటలతో అలరించి  క్లాస్ రూం ను ఆ స్తలంగా మార్చి పిల్లలను ఆటలలో ముంచెత్తి  ఫ్రెంచ్ ,స్పానిష్ , జర్మన్,  జపానీస్  లో  పాటలు పాడుతూ  నాట్యం చేస్తూ పూలబాల పిల్లలకి  బేసిక్స్ నుంచి బర్త్ డే  సాంగ్స్ దాకా నేర్పారని ఆమె అన్నారు..

ఫన్ లెర్నింగ్ ద్వారా పిల్లలకు మరియు  కార్యక్రమం ఆశయానికి  న్యాయం చేసారని శ్రీమతి గౌరి అన్నారు.  ELITE కార్యక్రమం భాషా సౌందర్యాన్ని పిల్లలకి రుచి చూపాలని చేసిన ప్రయత్నం గా  పేర్కొన్నారు. 

ప్రతిభా  విద్యా సంస్థల ఛైర్మెన్ శ్రీ ప్రకాష్   ఈ   బహుళ భాషా శిక్షణ  పిల్లల్లో నూతన చైతన్యాన్ని  నింపిందని 3 రోజుల్లో ఆరుభాషలు విజయవంతం అయ్యింది. అన్నారు

Welcome scene at Vasavi World School

 

Three day Multilingual Communication Banner at the Entrance of the Vasavi World School


Reception by School Management



Second day School Assembly with the Principal




Second day School Assembly Children 


Poolabala addressing Children on the Second day



Felicitation on the 3rd day








నవయుగ వైతాళికుడు" పూలబాలకు ఘనంగా సన్మానం

 తాను పట్టు సాధించిన 6 విదేశీభాషలను శ్రమ, సమయం వెచ్చించి రాష్ట్ర నలుమూలల పర్యటిస్తూ చిన్నపిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్న నిత్య పర్యాట కుడు "నవయుగ వైతాళికుడు" పూలబాల.

 పాటలు పాడుతూ రాజుని మేలుకొలిపే  గాయకుడుని వైతాళికుడు అనేవారు  నవయుగ వైతాళికుడు అంటే కొత్త యుగాన్ని మేలుకొలిపేవాడని అర్థం. 

అక్టోబర్ 27 28 29 తేదీల్లో మూడురోజులపాటు సాగిన గ్లోబల్ కమ్యూనికేషన్ వర్క్ షాప్ లో విజయవాడ కు చెందిన పోలీగ్లాట్  రచయిత, రెండు ప్రపంచ రికార్డుల విజేత  పూలబాల వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్, ఇటాలియన్ , జాపనీస్ , ఇంగ్లిష్ -  6 విదేశీ భాషలలో శిక్షణ ఇచ్చారు.   

ఆటపాటలతో విద్యార్థులకి  వారి భవిష్యత్ కి అవసరమయ్యే  విదేశీ భాషలలో ఆటపాటలతో శిక్షణ ఇచ్చి నేర్పించగా  వారు నేర్చుకున్న భాషల్ని పిల్లలు చక్కగా ప్రదర్శించారు.   ఉపాధ్యాయులు వాటిని వీడియోలు తీసిన ఉపాధ్యాయులు ఇదంతా నమ్మ సఖ్యంగాలేదు అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.   

మూడో రోజు జరిగిన వీడ్కోలు సభలో వాసవి వరల్డ్ స్కూల్ ( నిర్మల్ ) యాజమాన్యం మరియు ఉపాధ్యాయులచే నవయుగ వైతాళికుడు  పూలబాలకు ఘనంగా జరిగింది.  

ఆ సభలో మాట్లాడుతూ "అందరూ ట్రెండ్ ని అనుసరిస్తారు . కొంతమంది రాబోయే ట్రెండ్ ని ముందుగా గుర్తించి అగ్రగామిగా నిలుస్తారుఫారిన్ లాంగ్వేజెస్ అవసరాన్ని గుర్తించిన వాసవి వరల్డ్ స్కూల్ ని ఇలా ముందు చూపు కలిగి విషనరీ."  అన్నారు . పిల్లలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని కోరుకునే తల్లితండ్రులు ఉండడం సహజం. స్కూల్స్ అలా కోరుకోడం అరుదు. అలాటి అరుదైన స్కూల్స్ లో వాసవి వరల్డ్ స్కూల్ ప్రథమంగా నిలుస్తుంది. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.

.

వాసవి వరల్డ్ స్కూల్ లో ప్రతివారిలోనూ,ముఖ్యంగా టీచర్లలో నేర్చుకోవాలనే తపన కనిపించింది. టీచర్ల నన్ను వెన్నంటి ఉండి పిల్లలను కంట్రలో చేస్తూ నేను చెపుతున్న అన్ని విషయాలనూ అర్ధం చేసుకుంటూ వాళ్ళు కూడా నోట్స్ రాసుకు నేవారు. వాసవి వరల్డ్ స్కూల్ నాకు ఆనందాన్ని సంతృప్తిని మిగిల్చింది మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.