Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, August 29, 2025

తెలుగు కోసం ఏంచేసాడు ? 1265 పేజీల భారతవర్ష కావ్యం

 తెలుగు కోసం ఏంచేసాడు ?

 1265 పేజీల భారతవర్ష  కావ్యం,1265 పేజీల కాపీ ఒక్కటీ  2000 చొప్పున్న  100 కాపీలు అంటే రూ 2,00,000 ఖర్చు చేసి  ముద్రించి ఉచితంగా పంచాడు . దేశ భక్తి గురించే. భారతవర్ష అంటేనే భారతదేశం. ఉచితంగా ఇస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నది దేశ భక్తి సత్పవర్తన మాతృభాష గురించే.

.
భారతవర్ష కావ్యం చెప్పే కథ, భాష, మనసుకి. గొప్ప అనుభూతిని కలిగిస్తాయి పుస్తకం చదవలేము అంటారు. సినిమా తీయలేను అంటాను నేను.
.
చాలా మంది రెండూ చెప్పేది కథలే కదా! అంటారు. సినిమా చూడగలిగి చదవలేని తరానికి ఇలాటి కావ్యాన్ని ' అందించడానికి ప్రయాస పడుతున్నాను. వారు కనీసం ఈ వ్యాసం చదివగలరని ఆశిస్తున్నాను.
.

చాలామంది అభిమానంతో సినిమా తీస్తే బాగుం టుంది కదా అని అడుగుతుంటారు. వారికి ఒకటే చెప్తాను ఇప్పుడు చౌకబారు నవలలు మాత్రమే సినిమాలుగా తీస్తున్నారు కావ్యాలని సినిమాగా తీయడం లేదు. ఉత్తమ వ్యక్తులు ఉత్తమ భాష బదులు చెత్తభాష , చెత్త హీరోలు ఇవే నేటి సినిమా లు. డబ్బిచ్చి తలనొప్పి కొనుక్కుని ఏడుస్తున్నారు.
.
వంద ఉత్తమ చలన చిత్రాలకు సమానం ఒక కావ్యం. కావ్యం ప్రభావం జీవిత కాలం ఉంటుంది సినిమాకి కావ్యానికి వెలయాలికి ఇల్లాలికి ఉన్నత తేడా ఉంది.
.
సభ్యమైన భాషని వదిలి, సవ్యమైన ఆలోచనలని వదిలి, పెడదారి పట్టిన సినిమాకి తెలియదు. శాంతికి, సభ్య ప్రవర్తనకి మంచి భాష మంచి సాహిత్యమే నాందని. ఈ విషయమ డబ్బులున్న వాడి బుర్రకి ఎక్కలేదు. ఎక్కి ఉంటే చిత్తశుద్ధితో కళాదృష్టితో సినిమా సృష్టి జరిగేది. ధన వృష్టి కొరకు కామదృష్టి తో కమర్షియల్ సినిమాలు తీసి ప్రజల బలహీనతలతో, మతంలో పురాణాలతో చరిత్రతో ఆడుకుంటున్నారు. తలకి హృదయానికి బంధం తెంచుకొని బరితెగించి బతుకుతున్నారు.



.
అశ్లీల భాష అసభ్య ప్రవర్తన సినిమాకి రెండు కళ్ళు. అశ్లీల బాష, అసభ్య ప్రవర్తనను పట్టించుకోకుండా దుస్తులు నాగరికంగా ఉంటే చాలని చూపిస్తుంది సినిమా. ఆధునిక సినిమా ప్రజలని క్షోభపెట్టినట్టుగా మరేదీ క్షోభ పెట్టదు.
.
సినిమా నటులకు తెర మీద డ్రామా నే అలవాటై పోయి వారి నిత్య జీవితంలో కూడా అసభ్య వాగుడు పిచ్చి ప్రవర్తన ప్రభలిపోతున్నాయి.
.
పుట్టగొడుగు ల్లా మొలిచిన తెలుగు వెబ్ వార్తల పోర్టల్స్ వార్తల పేరుతో దొంగల్లా మన మొబైల్స్ లో, కంప్యూటర్స్ లో జొరబడి మనుషుల మనసులని అశాంతితో రగులు స్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే భారతవర్ష పుస్తకంగా ఉంటేనే బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు.
.
మనసుకి హత్తుకునే శాస్త్రీయమైన అందమైన తెలుగు భాషలో వ్రాసిన భారతవర్ష మీ మనసు మైదానం పై వర్షమై కురుస్తుంది. మీ మనసులో ఆనందం పచ్చని పంటై పండుతుంది. భారతవర్ష చదివేదాకా కావ్యం చదవడానికి నవల చదవడానికి ఉన్న తేడా తెలియదు,
తెలుగులో నిజమైన మాధుర్యం తెలియదు. ఆనందం ఆకుపచ్చగా ఉంటుందని అసలే తెలియదు. చదవగలను అనే వారందరికీ ఉచితంగా ఇస్తునే ఉన్నాను.

Thursday, August 28, 2025

8 వ తరగతి లోనే పీజీ క్లాసులా?

8వ తరగతి విద్యార్ధులకు పీజీ క్లాసులు నిర్వహిస్తున్న పూలబాలను చిత్రం లో చూడవచ్చు.


కాలం వేగంగా పరిగెడుతోంది కాలంకంటే ముందు పరిగెడు తున్నారు నేటితరం విద్యార్ధులు ఇది నిజం .
లేకుంటే 8 వ తరగతి విద్యార్దులకు పిజీ క్లాసు లేంటి? అని ఆశ్చర్య పోతున్నారు కొంతమంది. ఇంత చిన్నవయస్సులో తప్పు అంటున్నారు. పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? అంటున్నారు మరి కొంత మంది. ఇంతకీ విషయం ఏంటంటే పీ.జీ అంటే Polyglot [ P.G]

నరసారావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆరు విదేశీ భాషల్లో [French, German, Spanish, Italian, English, Japanese] శిక్షణ పాఠశాలకు ఒక ప్రత్యేక ఆకర్షణ, విద్యార్దులకు గొప్ప అవకా శము. భాషా నైపుణ్యాల శిక్షణ విషయంలో వేలాది అంతర్జాతీయ పాఠశాలల కంటే మిన్నగా ప్రపంచ స్థాయి గుర్తింపుకి అర్హమైన కృషి చేస్తున్నది.'

మనసున్న మారాజులు

 పిల్లల పుస్తకాలతో మొదలుపెట్టిన ప్రయాణం ప్రపంచ రికార్డులతో ఆగిపోక పీ హెచ్ డీ దాకా...

పూలబాల రచనలు పీ హెచ్ డీ విద్యార్థుల రీసెర్చ్ కి ఉపయోగపడుతున్నాయి అంటే కారణం వీరే

ఎన్ టీ యార్ అకాడెమీ అధ్యక్షులు అట్లూరి కృష్ణసతీష్ గారు, తెలుగు సాహిత్య ప్రాధాన్యతను గ్రహించి పూలబాల భారతవర్ష నవలకి ఆర్ధిక సాయంచేయడమే కాక పూలబాల రచించిన కాళహస్తీశ్వర శార్ధూల శతకాన్ని విని ఆస్వాదించి, మెచ్చి అట్లూరి మీడియాలో మరియు 360 డిగ్రీస్ ఛానల్ లో అవకాశం వచ్చేట్టు చేశారు. "అదే ప్రోత్సాహంతో నేను సరస్వతీ శతకం రాశాన" ని రచయిత పూలబాల అట్లూరి కృష్ణ సతీష్ గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.

రచయితలని ఆరోజుల్లో రాజులు. ఈరోజుల్లో మనసున్న మారాజులు ప్రోత్సహిస్తున్నారని అందరికి వందనాలని పూలబాల తెలిపారు. భక్తి , శృంగార, విప్లవ, మరియు (విదేశీ భాషల నుంచి)అనువాద సాహిత్య రచయిత ఫాస్ట్ న్యూస్ పాఠకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసారు.


ఎంత గొప్ప రచయితైనా, రాజైనా నిలబడడానికి భూమి కావాలి. భూమి అంటే ఆధారం. రాజుకి సైన్యం రచయితకి అభిమానం కరువైననాడు, రాజు రాజు కాడు , రచయిత రచయితా కాడు. మిలిలేది వల్లకాడు.

సమాజం ఒక వనం రచయితలూ కవులు, మొక్కలు తోటలు. తోటలు పూతోటలుగా మొక్కలు వృక్షాలుగా ఎదిగితే మంచిదే. "ఈ మొక్క వృక్షంగా ఎదిగితే నాకేంటి ?" అనుకోకూడదు. వనాలు వృక్షాలు అందరికీ పుష్పాలని ఫలాలని అందించి నట్టుగా అనేక రచతలు కూడా అందిస్తారు. వారందరికీ వందనాలు. ముఖ్యంగా పుస్తాకాలని ఎన్నడూ అమ్ముకొని రచయిత పూలబాల నిజమైన సాహితీ సేవకుడని సాహిత్య వృక్షం అని చెప్పచ్చు.

ఒక రచనా ప్రాణాన్ని ఒక మొక్క తో పోల్చాడు పూలబాల. ఒక మొక్క ఎదగడానికి సాయం చేయడం చాలా మంచి పని. మొక్కలని తుంచడం వృక్షాలని నరకడం పాప కార్యం.
చాలామంది దృష్టిలో సినిమాలకి రాసినవారు గొప్పకవులు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్టు సినిమాలకి రాస్తేనే గొప్పకవి కాదు. నేడు పూలబాల అనువాద రచన ఏదేశమేగినా ( 1881 లో ఏచే గరే రాసిన నోబెల్ బహుమతి పొందిన ఎల్ గ్రాన్ గాలెయేతో అనే నవల పీ హెచ్ డీ విద్యార్థులకు రీసర్చ్ కి ఉపకరిస్తోందని చెప్పారు. మరిన్ని నోబెల్ సాహిత్య బహుమతిని పొందిన నవలలను పూలబాల తెలుగులోకి అనువదించాలని కోరుకుందాం. మరోసారి నోబెల్ ప్రైజ్ భారతదేశానికి రావాలని మంచి మనసుతో కోరుకోండి.

చక్రాంగమై చక్రి మానస సరోవరమునన్

శ్రీ పల్లి నాగేశ్వరరావు శ్రీమతి కనకదుర్గ పుణ్య దంపతుల పుత్రుడు గురుభక్తి తో భక్తి సాహిత్యం వర్ధిల్లాలని కోరి అక్షరాలా పదివేలు ఇచ్చాడు. ఆ చిరంజీవి శతాయువై వర్ధిల్లాలని తన స్టైల్ లో కవితా నీరాజనం ఇచ్చాడు పూలబాల.

ధనచక్ర విషవలయ బంధంబులన్ జిక్కి విషయవాంచా బద్ధులై, సంసారబద్ధులై , భీతచేస్కులై , మందచేతస్కులై, క్రూరచేతస్కులై, ప్రజాకోటి పరంబె రుగక పాపఘ్న పాపకార్యంబులన్ బరిభ్రామ్యమాణాత్ములై, నెరుపగా, మృక్కటి జనులన్ విడివడి ఉద్దాములై నీ జననీ జనకుల్ దానధర్మంబుల్ పుణ్యకార్యంబుల్ జరిపి యంబుజోదరున్ అగ్గించి వేడంగ ఆ నైర్మల్య యాగమంబులన్ దానధర్మంబులన్ పుణ్యకార్యంబులన్ ప్రాప్తించి దదంతర్గతజ్యోతి వై, యస్వంతువై, యస్వంతు భక్తుండవై వర్ధిల్ల యా జస్వంతుడే నీకొసగె గురుభక్తి విద్యాశక్తి సత్కర్మలన్ జేయు యుక్తి , మాతృవర్గ పితృవర్గ సంస్కారముల్, ఆచార్య దీవెనల్ బడసి కమలాక్షు చక్షువులంబడి విజ్ఞానచక్షుండవై విలసిల్ల వే, జ్ఞాన తరంగమై యున్నతిన్ బొందవే , వేదం శబ్దంబువై విఖ్యాపనే జెంది జగద్గీతకీర్తీ నొందేవే యస్వంత యోగీశ వైరాగ్య జ్ఞాన విజ్ఞాన ముల్ , పూర్ణంబుగా గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి యోగీశ్వర సత్తమ సవిత్తు శ్రేణికిన్ సహకారి వై మెలిగి, చక్రి మానస సరోవరమునన్ చక్రాంగమై మెదలవే, వెలుగవే యా చక్రి బింబితంబై.


VC of KrU releasing Poolabala's Book

Hon’ble VC of KrU Prof. K. Ramji, releasing Poolabala's Book. BoS chairman Dr. Koteswarrao says that it will be used for the research to help Ph.D students.  Poolabala 's services will be soon used for the Versity students.

కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గారి చేతిలో పూలబాల అనువాద (నోబెల్ ప్రైజ్ పొందిన స్పానిష్ నాటిక ) రచన ఏదేశమేగినా (ఎల్ గ్రాన్ గాలెయేతో) కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష గారు , ఇంగ్లీష్ ప్రొఫెసర్ దిలీప్ గారు , BoS చైర్మన్ ప్రొఫెసర్ కోటేశ్వర్రావుగారు తదితరులను చిత్రంలో చూడవచ్చు.


Tuesday, July 29, 2025

Best solution for Foreign language Practice

 


Es ist leicht, eine Fremdsprache zu lernen, aber es ist schwierig, täglich zu üben. Der Mensch muss dem Lernen hinterherlaufen. Jeder rennt seinem Job hinterher. Daher kann nicht jeder Lernende täglich üben. Die Leute üben unregelmäßig für einen kurzen Zeitraum.  Nur wenige üben, aber sie üben die gleichen Grundlagen und sie finden es zu schewer, die Flutzone der Satzbauregeln zu überwinden.

t is easy to learn a foreign language but it is difficult to practice everyday.  Man must run behind learning everyday.  Every man runs behind his own job. So every learner can not practice everyday. People practice irregularly for a small period of time.   very few people practice but they practice the same basics and find it difficult to cross the tidal zone of rules sentence construction. 

Nur ein Lehrer kann täglich üben, denn sein Job ist das Lehren, was auch Lernen beinhaltet. Aber nicht alle Lehrer lernen täglich Neues. Sie können das weitergeben, was sie einmal gelernt haben. Sie tun sich schwer, ihre Sprachkenntnisse ab einem bestimmten Niveau zu verbessern. Sie finden keine geeigneten Ressourcen. Welche Ressourcen gibt es, um die Sprache zu verbessern? 
Zeitung ist die beste Idee.

only a teacher can practice everyday. because his job is teaching which includes learning. But not all teachers  learn new things everyday. they can teach what they have once learnt.  They find it difficult to improve their language skills after a certain level. They don't find proper resources.  What recourses are available to improve language?  Newspaper is the best idea.

                                                                      -0-

It is easy to learn a foreign language but it is difficult to practice everyday.  Man must run behind learning everyday.  Every man runs behind his own job. So every learner can not practice everyday. People practice irregularly for a small period of time.   very few people practice but they practice the same basics and find it difficult to cross the tidal zone of rules sentence construction. 

only a teacher can practice everyday. because his job is teaching which includes learning. But not all teachers  learn new things everyday. they can teach what they have once learnt.  They find it difficult to improve their language skills after a certain level. They don't find proper resources.  What recourses are available to improve language? 

Newspaper is the best idea. 



Apprendre une langue étrangère est facile, mais la pratiquer au quotidien est difficile. Chacun doit courir  après son apprentissage. mais Chacun court après son travail. Ainsi, chaque apprenant ne peut pas s'entraîner tous les jours. Rares sont ceux qui pratiquent, mais ils practiquent les mêmes fondamentaux et ils ont du mal à traverser la zone de marée des règles de construction de phrases. 

It is easy to learn a foreign language but it is difficult to practice everyday.  man has to run behind learning.  every man runs behind his own job. so every learner can not practice everyday.   very few people practice but they practice the same basics and find it difficult to cross the tidal zone of rules sentence construction

Seul un enseignant peut s'entraîner tous les jours, car son métier est d'enseigner, ce qui implique d'apprendre. Mais tous les enseignants n'apprennent pas de nouvelles choses tous les jours. Ils peuvent transmettre ce qu'ils ont appris auparavant. Ils ont du mal à améliorer leurs compétences linguistiques après un certain niveau. Ils ne trouvent pas les ressources adéquates. Quels sont les moyens d'améliorer sa langue ? Le journal est la meilleure solution

only a teacher can practice everyday. because his job is teaching which includes learning. But not all teachers  learn new things everyday. they can teach what they have once learnt.  They find it difficult to improve their language skills after a certain level. They don't find proper resources.  What recourses are available to improve language?  Newspaper is the solution. 


.


Sunday, July 13, 2025

What is the use of poesy?

à quoi sert la poésie? 

 what is the use of poetry? 



Lorsque l'explication scientifique et la termi nologie scientifique n'atteignent pas le cerveau, nous avons besoin de dramati sation. Les histoires et les comparaisons rendent le sujet complexe facile à comprendre.

 when scientific explanation and scientific terminology do not reach the brain we need dramatization. stories and comparisons make the complex subject easy to understand

Example :*లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?

మన శరీరం ఒక చిన్న పట్టణం అని ఊహించుకోండి. 

ఈ పట్టణంలో అతిపెద్ద సమస్య సృష్టించేది - *కొలెస్ట్రాల్* అతనికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. నేరంలో అతని ప్రధాన భాగస్వామి - *ట్రైగ్లిజరైడ్* 

వీధుల్లో తిరగడం, గందరగోళం సృష్టించడం మరియు రోడ్లను అడ్డుకోవడం వారి పని. 

*హృదయం* ఈ పట్టణం యొక్క నగర కేంద్రం. అన్ని రోడ్లు హృదయానికి దారి తీస్తాయి. ఈ సమస్య సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు, ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు. వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మన శరీర పట్టణంలో కూడా ఒక పోలీసు దళం మోహరించబడింది - అదే *HDL* మంచి పోలీసు ఈ సమస్య సృష్టించేవారిని పట్టుకుని జైలులో పెడతాడు 

*(కాలేయం)*. అప్పుడు కాలేయం వారిని శరీరం నుండి తొలగిస్తుంది - మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా. కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న ఒక చెడ్డ పోలీసు - *LDL* కూడా ఉన్నాడు. 

LDL ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్లి తిరిగి వీధుల్లోకి పంపుతుంది. 

మంచి పోలీసు *HDL* (తగ్గిన ) పడిపోయినప్పుడు, మొత్తం పట్టణం అల్లకల్లోలంగా మారుతుంది. 

అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు? 

మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా? *నడక* ప్రారంభించండి! ప్రతి అడుగుతో *HDL* పెరుగుతుంది మరియు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్* మరియు *LDL* వంటి దుర్మార్గులు తగ్గుతాయి. 

మీ శరీరం (పట్టణం) లో మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మీ గుండె - నగర కేంద్రం - దుండగుల అడ్డంకి *(హార్ట్ బ్లాక్)* నుండి రక్షించబడుతుంది. మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా - ప్రారంభించండి

*ఆరోగ్యంగా ఉండండి...* మరియు *మీకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను* *ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచడానికి మరియు LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించడానికి ఉత్తమ మార్గాన్ని మీకు చెబుతుంది, అంటే నడక.* ప్రతి అడుగు HDL ను పెంచుతుంది.