Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, December 13, 2020

Bharatavarsha 91

తూర్పుతీర మెల్లయు  వెలుగు రేఖలు ప్రసరించుచుండెను.  తీరరేఖ వెంబడున్న పాథోరాశి ఎల్లయూ తళతళ మెరియుచుండెను.  "విశాఖపట్నము తూర్పుతీర రత్నమను పేరు సార్ధకం చేసుకొనెను " అని ఫెర్రారీ నడుపుచున్న అగస్త్యడు బసవడితో అనెను. మువ్వవాని పాలెమందు బసవడింటివద్ద బయలుదేరిన  ఫెర్రారీ వాయువేగమున పోవుచున్నది. మద్దిలపాలెము, అక్కయ్య పాలెము , తాటిచెట్ల పాలెము, మర్రిపాలెము  దాటి కొత్తరోడ్డు వైపు దూసుకు పోవుచున్నది. "అగస్త్య నీవు నిన్ననే విదిష వద్దకు పోయినావు కదా మరల నేడేల వచ్చుచుంటివి?" బసవడు అడగగా  "నీవు పార్వతి గూర్చి అడుగుటకు పోవుచుంటివి కదా,  నాకునూ లకుమగూర్చి అడుగవలెనని ఆలోచన కలిగినది, నిన్న కేవలము మా నాన్న ఆరోగ్యము ఆస్తి గూర్చి అడిగితిని గాని లకమగూర్చి అడుగుట మరిచితిని. తల్లి లేకుండుట ఎంత భాధాకరమో మనని ప్రేమించువారొక్కరూ  లేకుండుట ఎంత దుర్భరమో కదా అని అగస్త్యుడు అనుచుండగా,  "లకుమ తో గడిపినపుడు అమ్మ గుర్తుకు రాలేదు కానీ  ఆమె బొంబాయి పోయిన పిదప నేడు నీకమ్మ గుర్తుకువచ్చుచున్నది. సిగ్గులేని  మొగమన్న నీదేకదా!అని అనుచూ  అయిననూ నీకు చిన్నమ్మ ఉన్నది కదా అని బసవడు  వెటకారపు మాట నొకటి తగిలించెను. అదివిన్న అగస్త్యునకు కారము రాసినట్లయ్యెను. ఈమెను అమ్మ అని మరొక సారనినచో మర్యాద దక్కదుఅని అగస్త్యుడు మొఖం మాడ్చుకొని ఆక్రోశించుచూ  "తల్లి అనిన నా తల్లి మీనాక్షి" అని అగస్త్యుడు గర్వంగా  చెప్పెను. ఎంతకాదన్ననూ మీ నాన్న చేపట్టిన  గ్రేస్ కూడా నీకు తల్లే కదా , కాకున్నచో సవతి తల్లి .. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అని ఆశుకవితాలతో ఆట పట్టించు చుండగా   ఫెరారీ కొత్తరోడ్డు చేరినది. బసవడు “కారాపిన అల్పాహారం తిని పోయెదము. ఇచ్చట దేవీవిలాస్నందు దోసెలు బాగుండును. బుచ్చిరాజు పాలెమందు తోపుడుబండి పై అమ్ము గారెలు అమ్మ చేతి వంటవలె కమ్మగా యుండును.” 

అని చెప్పుచుండగా, కారాపి  , తిండి గూర్చి వర్ణించుకున్నచో నీకు పుణ్యముండును.  మెక్కిరమ్ము అని హోటల్ముందు కారాపగా బసవడు లోపలకి పోయెను.   అచ్చటనున్న వారు ఆ కారు చుట్టూ చేరినారు. అందిద్దరు ఆంగ్లవార్తా పత్రిక పాత్రి కేయులు కలరు. " 1962 తయారీ ఫెరారీ ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కారు. గత కొద్దీ కాలంగా మీరీ ఫెరారీ వాడుచూ నగరమందు  పెను సంచలనమగు చున్నారు, మాపాత్రికేయులకు చిక్కక తుర్రు మనుచున్నారు " అని అగస్త్యని వాహనంతో  ఛాయాచిత్రములను గ్రహించి, కొన్ని  వివరములడిగి తెలుసుకొని వెడలిరి. 

బసవడు బయటకు వచ్చి వాహనమెక్కెను. "విదిష ధ్యానములోకి పోయినచో పడ్డ శ్రమ అంతయూ వృధా అగును.   కావున నేరుగా సబ్బవరం పోవలెను."  అని వాహనమును నడప సాగెను. ఫెరారీ వాయువేగమున నైరుతి దిక్కుగా సాగి కొలది సేపటిలో సబ్బవరం చేరెను.

                                                                    ***

నంది నాటకోత్సవాల్లో పాల్గొని భానోదయ కళాబృందము కర్నూలు నుండి హైద్రాబాద్ వేనులో వెనుతిరుగుచుండెను.  కేశవుడు, రంజిని కాక నక్క నాగేశ్వరరావు , పిల్లి పాపాయమ్మ , కొత్త సుబ్బారావు ముగ్గురే వాహనమందుండిరి. వాహన చాలకుడు మస్తాన్ వాహనమును నిదానముగా నడుపుచు “భా ఆ ఆ నోజీగారు కూడా వచ్చిన బా ఆ ఆ గుండెడిది.” “భానోజీరావు గారు నిన్ననే హైద్రాబాదునందు కొంత మంది మన కళాకారులతో కలిసి రంగసాయి థియేటర్ ఫెస్టివల్ లోపాల్గొని అలసినారు.” అని రంజిని చెప్పెను.  “ఆ ఉత్సవము కూడా నందిఉత్సవము వలే నుండునా? నా ఆ ఆ  కు నూ నటించ వలెననున్నది.” మస్తాన్ నత్తిగా మాట్లాడుచూ వాహనమందున్న కళా కారులందరికి వినోదమందిచుచున్నాడు. 

“నీవు నటించెదవా?” అని పాపాయమ్మ అడుగగా సుబ్బారావు "రంగస్థలమున ఎవరి సంభాషణలు వారే చెప్పుకొన వలెను. నీవు చలచిత్ర రంగమందు ప్రయత్నించవచ్చు.” అనెను వాహనమందు ముసిముసి నవ్వులు నెలకొన్నవి. 

“కేశవా నీవునూ రంగసాయి థియేటర్ ఫెస్టివల్ లోపాల్గొని కదా, మరి నీవు విశ్రాంతి  తీసుకొనకపోతివా? నీవునూ అలిసితివేమో? నేను ఒక మాసమునుండి రంగుకు రంగస్థలముకూ దూరముగా యున్నాను, మరల ఇదిగో నంది ఉత్సవములతో..  ” అని నక్క  అనెను.

కళాభారతి ఆడిటోరియం నందు విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖతో కలిసి నిర్వహించినది.   ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహిం చిరి.  మధ్యాహ్నం 3. 00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరిగినవి. అని అడిగిన ప్రశ్నతో పొంతనలేని సమాధానమునిచ్చెను.

ప్రశ్న కార్యక్రమము గూర్చికాదు. నీవునూ అలిసితివేమో? మరి నీవు విశ్రాంతి తీసుకొనకపోతివా? అని కొత్త సుబ్బా రావు కేశవునకు నక్క నాగేశ్వరావు అడిగిన ప్రశ్నను గుర్తు చేసెను. "రంజని గారిని నీడవలె కేశవుడు అంటిపెట్టుకొని యుండును, ఆమె ఎచ్చటున్న కేశవుడచ్చ టే యుండును. అని పాపాయమ్మ అనుచూ నీవు ఇంకనూ కొత్త సుబ్బా రావు అనుకొనుచున్నావా   పాత సుబ్బారావు ! " సుబ్బారావు ఆమెను పాపి పాపాయమ్మ అని అనుటతో ఇద్దరి మధ్య కీచులాట మొదలయినది. 

“అబ్బబ్బ ఎప్పుడూ వాదులాటలేనా, కేశవుడు నిద్రించుచున్నాడు.  మస్తాన్ని చూచి మౌనము నేర్చుకొనుడు” అని రంజిని అనగా వారందరూ నవ్వుకొనిరి. ఇంతలో రంజిని గారి ప్రక్కనే కూర్చొని యున్న కేశవుడు ఆమె భుజము పై సోలి నిద్రించ సాగెను.

“కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల రంగస్థల కళాకారులతో పోటీపడి తన నటప్రావీణ్య మును పౌరాణిక పద్యము లను ప్రదర్శించి కేశవ బ్రహ్మ (రావణ బ్రహ్మ వలె)పేగులు చించుకొనెను.” అని కొత్త సుబ్బారావు చమత్కరించెను. ఆసియాబుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పవలెనని తాను ప్రదర్శించు కళ వివరములను తెలుపుచూ కేశవుడు న్యాయ మూర్తులకు అభ్యర్ధన పంపగా, వారి వద్దనుండి స్పందన లభించెను. అని రంజిని గారు చెప్పగా నాగేశ్వరరావు "ఎందుకొచ్చిన ఆరాటమిది"అని నవ్వుచుండగా,   పాపాయమ్మ "కేశవుడు  కళాపిపాసి అతనికి కళాతృష్ణ యున్నదినీకు భోగలాలసత స్వార్ధము తప్ప కళాతృష్ణ  లేదు .  ఇతరుల కళాతృష్ణను అల్పముగా చేసి మాట్లాడుట నీకు తగదు. అయినా భోగలాలస పెచ్చరిల్లి స్వార్ధ పరుల ప్రాబల్యము ప్రపంచమున నానాటికీ పెరుగుచున్నది. ఇట్టివారు క్షణమాలోచించక , కించిత్తు  వెనుదీయక సద్భుద్ది ని భంజించుచున్నారు.  అని గీత శ్లోకము నాలపించెను.  

       “యజన్తే సాత్వికా దేవాన్యక్ష, రక్షాంసి రాజసాః | ప్రేతాన్భూత గణాంశ్చాన్యే  యజన్తే తామసా జనాః ||”

 సత్వ గుణము గలవారు  దేవతలను , రజోగుణము గలవారు యక్షులను రాక్షసులను , తమో గుణము గలవారు భూతప్రేతములను ఆరాధించెదరు అని దీని భావము. అని ముగించెను. రంజని ఆమెను ఆశ్చర్యముగా చూచుచుండెను.  

అందరినీ వినోదపరుచుటకు మన పేగులు చించుకొనుచున్నాము, మరల పోటీలు రికార్డులు నెలకొల్పుట బ్రద్దలుగొట్టుట అని జెప్పి మన బుర్రలు బ్రద్దలు గొట్టుకొనుచున్నాము.రంజిని గారు మీవలె శ్రీ మంతుడినైనచో నేనీ నాటకమును పండించుట గాక నాజీవితమును పండించుకొందును. అని నక్క అనుచుండెను.

ఇంతలో ఒక పెద్ద సరుకులను కొనిపోవుచున్న పెద్ద లారీ మీదకు వచ్చుట గమనించి మస్తాన్ వేన్ ను రహదారి పై నుండి పక్కకు  దింపి మరల ఎక్కించెను  అందువల్ల   వేన్ పెద్ద కుదుపు పొంది ఆసనములపై కూర్చున్నవారు    క్రిందకు విసిరివేయబడిరి . కేశవుడు చేతిపై ఆనుకొనగా చేతికి దెబ్బ తగిలెను, రంజిని కాలు సీటు క్రింద చిక్కుకొని మెలితిరిగి నొప్పిచేసెను. మరల ఏట్లో రెక్కుకొని సర్దుకొని కూర్చొనిరి. మస్తాన్ ని అందరూ నిందిచుచుండగా రంజని "మీచేతిలో చక్రమున్న మీరంతకంటే ఏమిచేతురో ఆలోచించవలె"నని అందరినీ మందలించెను.

మృత్యువు తృటిలో తప్పిన పిదప వాహనమందు ఆధ్యాత్మిక మేఘములలుముకొన్నవి. "మానవ జీవితమూ క్షణ భంగురము అందుచే మనము జీవితమునాస్వాదించవలెను" అని సుబ్బారావు అనగా నక్క " నేను చక్కటి తిండి  తీర్థముతో  నాజీవితమును ఆనందించెదను, మరి నీవెట్లు ఆనందించుచున్నావు అని  సుబ్బారావుని  అడగగా " నేను నా ఫ్రెండ్ తో ..... అని కొత్త చెప్పెను. కేశవుడు నవ్వి నిద్రలోకి జారుకొనెను. 

                                                                      ***

సబ్బవరం చేరిన మిత్రు లిద్దరూ ఊరంతయూ జన సమ్మర్దమును చూచినారు. ఏదో రాజకీయ సభ ఉన్నదేమో వాహన సమ్మర్దము జనసమ్మర్దము హెచ్చుగా యున్నవి. ప్రముఖల వాహనములు రోడ్లపై తిరిగాడు చున్నవి. అనుకొనుచూ కొత్తగా శేషాచలము నిర్మించిన ఆశ్రమము ప్రారంభోత్సవమని గుడ్డ పతాకములపైన వ్రాసి, తోరణములు కట్టియుండుటచే చూచి వారచ్చటికి   పోయిరి. కొండల మధ్య నున్న ఇరువది ఎకరముల  స్థలమందు ఆశ్రమము నిర్మించబడినది.  పెద్ద ప్రహరీ గోడ, చక్రములపై దొర్లు  ఇనుపగేటు,  దాటి లోపలకు పోయిన పూలమొక్కలతో  ఉద్యానవనము, మధ్య జలాశయము,  దాటిన పిదప  పెద్దచెట్లతో తపోవనము,   కూర్చొనుటకు పాలరాతి బల్లలు,  ఇంకనూ లోపలి పోగా  శివాలయము  దాటిన పిదప పెద్ద భవనము. సాధు, బైరాగి భక్త జనముతో , సందర్శకులతో ఆశ్రమమంతయూ కోలాహలంగా నుండెను.  ఇంతలో డగ డగ డగ డగ మనుచు ఆకాశమందు పెద్ద రెక్కల చప్పుడు అగుచుండెను. బసవ కేశవులు తల ఎత్తి  చూసి ఉదగ్ర వాహన ( హెలి కాఫ్టర్ ) మొకటి  నేరుగా పోయి ఆశ్రమమునందు వాలెను.   ముఖ్య మంత్రి గారు .. ముఖ్యమంత్రి గారు అని మాటలు వినబడినవి. బసవడు అగస్త్యతో “ఆమె మనతో చదువుకొన్న విదిషేనా అని పించుచున్నది , ముఖ్యమంత్రే  వచ్చి చూచుచుండగా మనము వేచి చూచుటకూడా దండగ మననెవరు పట్టించుకొందురు.”అనెను. “ చూచుచున్నాము కదా ముఖ్యమంత్రులు ఇట్లు తయారయినారేమి!  సన్యాసులు అమ్మలచుట్టూ తిరుగుట తప్ప  వీరికేమి పనిలేకుండెను.” ఆగస్త్యు డనెను .

అనేకమంది జనులు తిరిగి  వెడలుచుండిరి.  కొంతమంది స్త్రీలు శివాలయములో కూర్చొని "ఈ శివాలయము పాతది వలే నున్నది, అని ఒక స్త్రీ అనగా  పాతదే ఒకప్పుడు అమ్మ ( విదిష) తన ఇంటినుంచి ఇచ్చటికి వచ్చి దర్శనము చేసుకొనెడిది, నేడాస్థలమును చలము గారు పొంది ఆశ్రమ నిర్మాణము చేసినా రు." అని మరొక యువతి అనెను.

ఒక చోట అన్న దానకార్యక్రమము జరుగుచున్నది. బసవడు అగస్త్య ఆ ప్రక్కగా ఒక చిన్న సమూహము కనిపించెను . శేషాచలం చుట్టూ పలువురు చేరి మాట్లాడు చుండిరి. పెంచలయ్య కూడా అందులో కలడు. వారిరువురూ వెనుదిరిగ నిశ్చయించుకొని గేటు వద్దకు చేరు సమయమునకు  ఉదగ్ర వాహన మెగిరిపోయెను  వెనుతిరిగి చూడగా విదిష వారి వెనుకనుండెను. భోజనములు కొనిపోయి విదిష వడ్డన గావించెను, అచ్చట వలతి కూడా వడ్డన చేయుచుండెను. భోజనములైన పిదప. ఆశ్రమమంతయూ ఖాళీ అగుచుండెను వారందరూ తపో వనమునకు చేరి ఒక చెట్టు క్రింద పాలరాతి బల్లపై కూర్చొనిరి .  

                                                                 ***

వేను  రంజిని గారిల్లు చేరెను. రంజిని గారు కాలు నొప్పిచే నడవలేక మెక్కుచుండగా కేశవుడు తన భుజము పై ఆమె చేతిని వేసుకొని ఊతమిచ్చి లోపలి గొనిపోయెను.   వాహనము   కళాకారులను తీసుకొని పోవుచుండెను  నక్క " కేశవుడు నక్క తోకను తొక్కినాడు ఐశ్వర్యవంతురాలైన స్త్రీ  " అను చుండగా  కొత్త " మొదట మనుషులను మనుషులుగా చూచుట నేర్చుకొనుము  నీకు ఆరోగ్యము చెడి నెలకాలము పని చేయకున్ననూ  జీతమిచ్చి ఆదరణ చూపినది. డబ్బున్నచో  విలాసజీవితమును గడిపవలెనని నీవు కోరుకొనుచున్నావు. అదే డబ్బు ఆమె వద్ద ఉన్ననూ నీవంటి అనేక పేద కళాకారు లను ఆదుకొనుచున్నది. మనిషి వలె ఆలోచింపుము."అని సుబ్బారావు హితవు పలికెను.  

రంజిని కేశవులు ఇంటిలోకి ప్రవేశించిరి. స్నానములయిన పిదప  రంజిని,  చేతి నొప్పితో భాధ పడుచున్న  కేశవునకు తానే  స్వయముగా తినిపించెను. కేశవుడు ఆమెను గదిలో మంచమువరకూ నడిపించుకునిపోయి మంచము పై పరుండబెట్టి బెణికిన ఆమె పాదమునకు మందు పూసి సేవచేసి ,  నొప్పి తగ్గకున్న   రేపు సాయంత్రము ఢిల్లీ లో జరుగు సభకు పోవలదు . అని చెప్పి కేశవుడు  వెను దిరగగా కేశవా ఇటు రమ్ము అని పిలచి నుదుటిపై ముద్దాడెను.

                                                                     ***

కొలది సమయము తరువాత బసవడు " నావిషమెట్లున్నదో జూడుము నోటివరకు వచ్చిన కూడు తినుటకు లేకుండెను ,నిన్నటివరకూ పార్వతినిచ్చెదనని చెప్పిన చంద్రమతి నేడు కుదరదు పొమ్మనుచున్నది అనెను. పార్వతి కిష్టమైన ఆమెట్లు ఆపగలదు. అనగా గౌడ సోదరుల విషయము చెప్పగా విదిష  నవ్వసాగెను. " పార్వతి ఇచ్చటికి వచ్చును నీవు చింతించవలదు అని చెప్పగా అగస్త్యుడు " నాకు  లకుమ దక్కు మార్గమేదైననూ కలదా  యని చాలావిచారముగాయున్నది అని చెప్పుచుండగా విదిష మొఖము నందు నవ్వు మాయమయ్యెను , మెల్లగా మొఖం బిగుసుకొనెను , కనులు ఎరుపెక్కేను వలతి విషయము గ్రహించి ' రేపు మేము ఢిల్లీ పోవలెను వర్షునకు పురస్కారము  కలదు ' అని మాట మార్చి అగస్త్యుని పొమ్మని సైగ చేసెను .

 అగస్త్యుడు అర్థము జేసుకొనక " లకుమ మనసు మార్చమని వేడుకొనుచుండగా ఎరుపెక్కిన విదిష కనులు విశాలమ గుచుండగా  ఒక్క సారిగా ఆమె లేచి నిలిచెను. పదడుగుల ఎత్తు విగ్రహము కనిపించుచుండ   అగస్త్యునికి దిక్దిగంతముల చీకట్లలిమి కనులు కానకుండెను.  అగస్త్యుడు పైకి చూడగా విదిష  తల చెట్టు శిఖర మంత ఎత్తులో కానవచ్చెను. అగస్త్యుడు చేష్టలుడిగి ఆమె పాదములపైన బడెను. బసవడు దుర్గా స్తోత్రమును చదివి ఆమెను శాంతింప  అగస్త్యుని బైటకు తీసుకువచ్చెను. పిదప అగస్త్యుడు ఇల్లు చేరువరకూ ఏమియూ మాట్లాడక రాయివలె కూర్చొనగా బసవడే  కారు నడిపెను. 

Friday, December 11, 2020

Bharatavarsha -90

బసవడు బల్లిపాడులో బస్సు దిగి చేతి గడియారమందుసమయము చూచుకొనగా మధ్యానము మూడు గంటలు కావచ్చుచుండెను.   భుజాన సంచితో, నల్లని అద్దము లతో హనుమంతుని విగ్రహము దాటి, గ్రామములోనికి పోవుచుండగా గ్రామస్తులు కొత్త మనిషని  వింతగా చూచుచుండిరి వారి చూపులు దాటి  కోనేరు దాటి లోపలి సాగుచుండెను.  కొలది దూరము సాగిన పిదప జనసంచార మంతరించెను.  బసవడి బూట్ల చప్పుడు వినిపించు చుండెను గులక రాళ్ళ బాటలో ఆటలాడుచున్న పాలపిట్టల పరిగెడుచున్నవి. బసవడు తలతిప్పి చూడగా చుట్టూ సాలములల్లిన క్షేత్రములు. ఆ శాఖలందు దాగిన గువ్వలు బసవని చూచి నవ్వినవి. అతడు సమీపించుచుండగానే గులక రాళ్ళ బాటలో ఆటలాడుచున్న పాలపిట్టలు తుర్రుమన్నవి. లజ్జావతి కాలికి తగిలి సిగ్గుతో ముడుచుకొన్నది.

లజ్జావతి యందు పార్వతి లజ్జాముకులిత వదనము కనిపించెను.  చంద్రమతి వాలకతనము స్ఫురించెను. కనిపెంచ కున్ననూ కన్నె పిల్ల మనసును శాసించుచున్నది. ఈమె మనసు కఠిన కాచకము ఎట్లు సహింతుమీ అరాచకము. ఇట్లు చింతాక్రాంతుడైన బసవని 

కర్ణము నేదో అవ్యక్త మధుర ధ్వని తాకి అతడి బిగిసిన స్వాంతమును సాంత్వన పరుచుచున్నది. చిక్కని  శాలముల వాలి చూపుకి చిక్కక కలకణ్ఠ కూయుచున్నది. కొలది దూరములో మదనగోపాలుని దేవాలయము కనిపించెను. బసవని మది పులకించెను. అతడియందు ఆసుకవి ఉదయించెను.

 “ఏమీ ప్రకృతి అందము ఏమీ శృంగనాదము తాక డెందము గలుగు మోదము

  ఏమీ చిత్రవాలము ఏమీ మాపటికాలము చూపె చిత్రవిచిత్ర జాలము  

  ఏమీ శుభ సూచకము ఏమీ మధుర వాచకము ఏమో మదన ప్రేరితము”                                             

ముందుకి సాగుచున్న బసవడి మదిలో ఆలోచనలు సుడులు తిరుగుచుండెను. “తల్లి తండ్రులతో పోయి కలిసి నప్పుడు కుదిరదు పొమ్మన్నది ఇప్పుడేది దారి” యని యోచించి తికమక పడుచూ మొదట మదన గోపాలుని ఆలయమునకేగి ఆ స్వామి దర్శనము జేసుకొని “పార్వతిని బడయు మార్గము చూపమ” ని వేడఎదో శక్తి పుట్టి నేరుగా పార్వతి ఇంటికి పోయెను. కానీ నేరుగా లోపలికి పోక ప్రాంగణ మందున్నమొక్కల చాటున నక్కి పిల్లివలె మెల్లగా కదులు కిటికీ వద్ద నక్క వలె నక్కి వినుచుండెను. ఇంతలో పార్వతి ఏడుపు వినిపించెను. తలయెత్తి కిటికీ నుండి లోపలి చూచెను

విశాలమైన గదియందు పార్వతి, చంద్రమతి, అరుణతార, ఆమె ప్రక్కన తుమ్మ మొద్దువలెనున్న ఒక పురుషుడు కనిపించగా అరుణతార ఇచ్చటమిచేయుచుండెనో అనుకొనెను కానీ పరికించి చూడగా చూచుటకు అరుణ తారవలెనున్ననూ  ఈమె అరుణతార కాదు,   పిన్న వయస్కురాలు. కొంత సేపటికి ఆమె చంద్రమతి కూతురు సుకన్యఅని, ఆమె ప్రక్కనున్న వ్యక్తి చంద్రమతి అల్లుడు చక్రవంతుడు అని, వారు అమెరికానుండి వచ్చినారని అర్థమయ్యెను. 

చక్రవంతుడు : పార్వతి , నీవు బసవని మరచిపోవలెను 

చంద్రమతి : ఇంకాతని ఊసేంతమాత్రము ఎత్తవలదు 

సుకన్య :  అతడిని మార్చుటయే కాక గౌడను వివాహమాడవలెను. 

పార్వతి :  అందరిముందు బసవని కిచ్చిచేయుట కొప్పుకొని ఇప్పుడు వలదనుచున్నావు . నేనతడినే చేసికొందును. 

చక్రవంతుడు :   పార్వతి!  మూర్ఖము వహించవలదు. పర్యావశానములూహించిన ఇట్లు మాట్లాడవు. నీ పై కట్ట గౌడ మనసు పడెను.  వాడికి తరగని ఆస్తి ఉన్నది. నిన్ను పువ్వులలో పెట్టుకొని చూచుకొనును. వాడిని కాదన్నచో కోట్ల  విలువ చేయు మా  పొలములు మాకు దక్కనివ్వడు. అది తెలిసికొని మాట్లాడవలెను. 

డబ్బు  కొరకు నామనసును ఎట్లు  చంపుకొందును ?

కోట్లనిన  ఖాతరు లేకుండెను చూడెట్లు మాట్లాడుచున్నదో. అని చక్రవంతుడు సుకన్యతో అనగా సుకన్య పార్వతినొక్క బుగ్గ పోటుపొడిచెను. అది చూచి బసవడి  ప్రాణము విలవిల లాడెను. " ఒరేయ్ జాంబవంతుని వలె నున్నావు  నీవు చక్రవంతుడివి కాదురా, జాంబవంతుడివి, అల్పబుద్ధి." అని బసవడు తన మనసులో అనుకొనెను.

పార్వతి: ఆ పొలములు మా అమ్మ చారుమతి ఆస్తి అవి మా పొలములు   

చంద్రమతి పార్వతినురిమి చూచి. “డబ్బు అన్నచో లేక లేకుండెను, డబ్బుకొరకు మనసును చంపుకోకున్న, ఆ గౌడ మనుషులను చంపును. భాగవతార్ నేమిజేసినాడో ఎరుగవా? బసవని చేసుకొన్న అందరికి ముప్పువాటిల్లును” అనెను.

ఇంతలో సుకన్య  " చక్రీ , కిటివద్ద ఎవడో  తచ్చాడుచున్నాడు " అని తెలపగా  చక్రి బిగ్గరగా కేకలు వేయసాగెను. పార్వతి కూడా బసవని చూచి " వీరు మూర్ఖులు  నీవు పారిపొమ్ము " అనెను. కానీ బసవడు లోపలిప్రవేశించి  " నేనంతయూ వింటిని " అని చంద్రమతితో పలికెను.  అప్పుడు చంద్రమతి " అంతయూ వింటివి కదా , మరొక సారి ఈ ఛాయలకు  రావలదు అని హెచ్చరించెను. బసవడు ఊరుకొనువాడు కాదు , మాటకు మాట జెప్పెను. చక్రి రెచ్చెను. బసవని రెండు గుద్దులు గుద్దెను పిమ్మట  "మూడవగుడ్డు గుద్దినచో నేలకొరిగె దవు.  పొమ్ము" అనెను. 

బసవడు ఓర్చుకొని నిలబడి చక్రిని ఒక్క గుద్దు గుద్దగా అతడు నెలకొరిగెను. " మీరు పార్వతిని హింసించుచున్నారని బలవంతపు పెళ్ళికి పాల్పడుచున్నారని నేను పోలీసులకు తెలిపెదను. అని పార్వతికి "నీవు ధైర్యముగా నుండుమ"ని జెప్పి వెడలిపోవుచుండెను.   సుకన్య చక్రిని లేవనెత్తెను.  పోలీసులకు తెలిపిననూ  గౌడకేమీ కాదురా.   నేను గౌడకు తెలిపినచో   నీవీ వూరు దాటగలవేమో చూడుము. అని గౌడకు దూరవాణి యందు విషయమునెఱిగించి  "క్షేమమముగా  నీ వీ వూరు దాటి  నాకు ఫోను చేసిన నేను నీవున్నచోటు కి  పిల్లని తెచ్చి నీకప్పగింతు"ననెను.  

                                                                      ***
బసవడు మరల ఆలయమునకు పోయి చాలాసేపు అక్కడ కూర్చొనెను.  ఇంతలో చీకటి పడెను. బసవడు గోపాలుని ప్రార్ధించి బస్సెక్కుటకు పోవుచుండగా రౌడీలవలె నున్న ఇద్దరు వ్యక్తులు అతడిననుసరించు చుండిరి . బసవడది గమనించిననూ గమనించనట్లు ముందుకు సాగు చుండెను. గులకరాళ్ల బాటపై అతడి బూట్లు చప్పుడు తప్ప ఏమీ వినరాకుండెను. అతడి అడుగుల లయయందే వారు అడుగులు వేయుచున్నారు. వారు గౌడసోదరులని అతడి మనసు దృఢముగా చెప్పుచున్నది. బసవడు ఆగెను. వెంక అడుగుల చప్పుడు ఆగినది. బసవడు తన సంచి నుండి ఒక పెద్ద వత్తిగల  శక్తి వంతమైన  దీపావళి బాంబును, సిగరెట్టును ఒకేసారి వెలిగించి వెనుక కొన్ని అడుగుల దూరములోనున్న గౌడసోదరులపై విసిరెను. ఆపేలుడుకి వారి కళ్ళు బైరులు క్రమ్మి ప్రక్కనున్న నీటి గుంటలో పడిరి. బసవడు ముందుకి సాగిపోయెను.

                                                                     ***

అగస్త్యుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచెను. "ఇదంతయూ స్వప్నమా?" ఇంకనూ నిజమనుకొంటిని. అయిననూ తెల్లవారుఝామున వచ్చు కళలు నిజమగునని ఒక నమ్మకము కలదు అనుకోని బసవడికి దూరవాణి కలిపెను. బసవడికి విషమునెఱిగించగా అతడు " నీవేమి చూచినావో ఖచ్చితముగా  అదే జరిగెను. ఏమి జరిగేనా ఖచ్చితముగా అదియే చూచితివి " అని చెప్పగా బసవడు ఖంగు తినెను. 

" నిన్న నీగూర్చి ,  నా సమస్య పరిష్కారము గూర్చి విదిష వద్దకు పోయితిని. నా భవిష్యత్తును తెలిపమని  కన్నీరు పెట్టుకొనగా, నీకే  తెలియును అని మాటఇచ్చి పంపెను. ఇది ఖచ్చితముగా ఆమె పనే అని ఇప్పుడు తెలియుచున్నది. " అనగా బసవడి పై ఉల్కాపాతము కురిసెను. విదిషా విదిషా నాకు నీవే దిక్కని విదిష వద్దకు బయలు దేరెను.  

Thursday, December 10, 2020

Bharatavarsha 89

నిగనిగ లాడు పసిమి దేహము, నవనవ లాడు పూరేకుల పెదవులు, దంతములు మిలమిల మెరియు ముత్యాల సరులు, గలగల పారు సెలయేరు నగవులు, మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని చిట్టిచేఁతలు మేని మెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది. 

ఘనస్తనముల జంబునేత్రి మీనాక్షి దీర్ఘ కుంతలములను సడలించ కీకారణ్యమును తలపించు యా నిబిడ కేశములు సైకత పిరుదులపై బడి నర్తించుచుండగా ఆ గజయాన మంద గమనమున మిద్దెపై హిరణ్య సమయమున సంచ రించు చుండెను. 

 స్వతంత్ర మంత్ర తంత్ర సంగీత ప్రపంచ రాజు, ఇందిరమందిర సున్దరాకారుడు విపుల మానస శతానందుడు, జనమా నస చోరుడు ప్రఫుల్ల నామధేయుడు వెనక నుంచి మీనాక్షిని సమీపించి ఉఫ్ అని చెవిలో గాలి ఊదగా మీనాక్షి అదిరి పడి ప్రఫుల్లపై త్రుళ్ళి పడి  సిగ్గుతో " ఈ చిన్న పిల్లవాడి చేష్టలు ఇంకెంతకాలం చేసెదవు ?" అనుచున్న ఆమె చేతిలో ఒక ఖంఠ హారమునుంచెను. “ఇట్టి బహుమతులు వలదని మీ కు పలుమార్లు చెప్పిననూ వినరు కదా!”

అని త్రిప్పి ఇచ్చుచుండగా “అదిగో మరల నన్ను మీరు అనుచున్నావు మనమిద్దరమూ ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా ము, ఎన్ని గంటలు కలిసి సాధన చేసి, ఎన్ని గంటలు ప్రయాణము చేసినాము ఇంకనూ మనమధ్య మీరు అవసరమా? ఈ చిరు కానుక స్వీకరింపుము.

ఉమ్ , సరే , ఇంతకీ ఇప్పుడు ఈబహుమ తెందుకు తెచ్చినావు ?

మన సంస్థ  ప్రతినిధి కార్యక్రమ నిర్వాహకుడు  మీనన్ మన విదేశీ కార్యక్రమ పరంపరను ఏర్పాటు చేయుటలో సఫల తనొందెను. ఇకపై మన విదేశ కార్యక్రమములు మొదలు కాబోవుచున్నవి.  కువైట్ , బెహ్రెయిన్ , దుబాయ్ , లండన్ , మారిషస్ , సిషెల్ల్స్ బ్రుక్లిన్ నందు కూడా మనము   ప్రదర్శనలివ్వబోవుచున్నాము. మన ఆఖరి దేశీ ప్రదర్శన రేపు ముంబై పాటిల్ స్టేడియం నందు కలదు ఒక సారి మన స్థూడియోకి పోయి రావలెను.

ఇందు నేను చేసినది ఏమున్నది ? నా పియానో వాదనము నేను చేసినాను.

 సంగీత తిలకమై మన మ్యూజిక్ బ్యాండ్ కి తలమాణికమై వెలుగొందు కంపోసర్ పియానిస్ట్ వి,మన మ్యూజిక్ బ్యాండ్ ఇట్లు వెలుగొందుచున్నదన్న దానికి కారణము నీవే. నీకుగాక ఇంకెవరికి ఇవ్వవలెను బహుమతులు!

ఏ పట్టణము ప్రదర్శనకి పోయిననూ  అచ్చట వస్త్రములు కొని ఇచ్చుచున్నావు , మొన్న భోపాల్ ప్రదర్శనకు నేను రాకున్ననూ నాకు ఈ వెండి వెలుగు చీరను ఎర్ర రవికను కొని ఇచ్చినావు

ఒక కర్మాగారమందు బహిరంగ రంగస్థలమును  ఏర్పాటుచేసి నారు. అది చిన్న రంగస్థలం నీవంటి వనితకు నప్పునది కాదు. 

వట్టి మొద్దు బుర్ర నీవు ఇచ్చిన  చీర రవికను ధరించినాను ఎట్లున్నది ?

సంధ్య కాంతులందు సేదతీరుచున్న పడుచందములను మించు మీనాక్షి ప్రౌఢ అందములు కాంచిన గుండెలు గండెలు పడుచుండెను.   

మీనా ఇట్లు మాట్లాడిన నీ చెవులు మెలి పెట్టెదను నీవు మా అగస్త్య వంటి వాడవు అని ప్రఫుల్ల చెవి అందుకొనెను. 

 ఒక వారము నుండి అహోరాత్రములు శ్రమించి కొత్త పాటలుకు స్వర కల్పన జేసి అలసి  చిక్కిననూ నీ చక్కదన మెచ్చటికి పోవును ఈ చీరయందు అప్సరస వలే నున్నావు.

  కానీ ఇప్పుడు మనము స్టూడియోకి వెళ్లవలెను . మన కొత్తగా ఆల్బమ్ విడుదల కార్యక్రమమున్నది. కానీ నిన్ను రమ్మనుటకు మనసొప్పకున్నది. 

స్టూడియో చెంతనే యున్నది కదా, ఈ కార్యక్రమము లేకున్ననూ ఇప్పుడు సంద్యాసమయము కావున నిద్రించ తగదు. పదపోయెదము అనుచూ మీనాక్షి మిద్దె దిగుచుండగా ప్రఫుల్ల ఆమె వెంట నడిచెను. కదులుచున్న ఆమె జఘన లయ యందు చిక్కిన కనులు సోపానములను గమనించకుండుటవల్ల నడక లయ తప్పి జారిపడెను. 

మీనాక్షి అతడిని లేవనెత్తి మెల్లగా తన భుజముపై అతడి చేతినుంచి క్రిందకు తీసుకుపోవు చుండెను. " నీవిట్లు హత్తుకు తీసుకుపోయినచో  ఎన్నిసార్లయినా పరవశమే " యని వినిపించినట్లు మెల్లగా అనెను. ఇద్దరూ క్రిందకు మీనాక్షి ఇంటిలోనికేగినారు.

 ప్రఫుల్లని మీనాక్షి సోఫాలో కూర్చొండబెట్టెను. ప్రఫుల్ల తలయెత్తి చూడగా ఎదురుగా చదువుకొనుబల్లవద్ద  యమున ఒక డజను పుస్తకములను పెట్టుకొని చదువు కొనుచున్నది.

ప్రఫుల్ల ఆమెను చూచి నవ్వెను యమున  అతడిని చూచి పళ్ళికిలించి " హ హ హ .. చూసుకొని నడుచుట చేతకాదా ఎత్తుకొని మెట్లు దింపవలెనా ?" అనెను . లేడి  డిటెక్టివ్ వలే నున్నావే  నాప్రాణమునకు ఇదెక్కడ దాపురించెనో అని ప్రఫుల్ల అనుచుండగా” సమయమున్న కేరళ పోరాదా మీఅమ్మ వద్ద గడపరాదా, ఆమె మాటి మాటికీ ఇక్కడికి ఫోను చేయుచున్నది మీనాక్షిగారి  వెంట పడుచున్నావని  ఆవిడకి కూడా తెలియవలెనా?

ఆవిడకెప్పుడో తెలిసెను. ఇక మీనాని తీసుకెళ్లి ఆమెకు చూపవలెను.  నీవు ఎప్పుడూ ఇక్కడే గబ్బిలమువలె చూరు పట్టుకొని వెళ్లడుచున్నావెందుకు మీ ఇల్లు పక్కనే కదా పోరాదూ.

నన్ను గబ్బిలమందువా నీవే గబ్బిలము, నీవే జాగిలము అని యమున ప్రఫుల్లను దూషించ సాగెను “అవును నేను జాగిలము నీవు బిడాలము అందులకే నీకూ నాకూ ఈ వాదులాట” టులిద్దరిమధ్య వాదముపెరిగి తారాస్థాయికి పోయినది.

“అబ్బబ్బ ఎప్పుడు చూచినా కుక్క పిల్లిలా ఈ కొట్లాటలు,  ప్రపుల్లకి వేడి నీరు   కాపడము పెట్టవలెను.” అని మీనాక్షి అనగా “ఇట్లు ఇచ్చిన నేను పెట్టెదను” అని యమున మీనాక్షి చేతినుండి గిన్నె అందుకొని సోఫావద్ద నున్న బల్లపై పెట్టి కాపడము పెట్టసాగెను. 

మీనాక్షి బల్లపై నున్న పుస్తకములను చూచుచూ కూర్చుండెను. అవన్నియూ భారతవర్ష వ్రాసిన పుస్తకములు ఇన్ని పుస్తకములు వ్రాసెనా?  తెలుగు ఇంగ్లిష్  పద్యముల సంకలనములు , పౌరాణిక నాటకములు , హాస్య కథలు , మూన్ లైట్ స్టోరీస్ - ఇంగ్లీష్ చిన్న కథలు , తెలుగు  చిన్న పిల్ల కథలు , సేవ్ ఎర్త్  , సైన్స్ ఫిక్షన్   జానపదములు , బుర్రకథలు ,వ్యాసములు , వ్యాకరణము  చివరిగా  ప్రౌఢ శృంగార కథలు, అవన్నీ చూచుచూ మీనాక్షి" మావర్షుడు  ఇటువంటి కథలు కూడా వ్రాయనా ?  అనుచూ ప్రౌఢ శృంగార కథల పుస్తకమును తరువాత చదువుటకు కొంగు క్రింద దాచి యుంచెను. వెంటనే యమున " ఆ పుస్తకము అడుగుటకు సిగ్గుగానున్నదా?" అని వెనుకకి తిరగకనే అనగా “ఇది మనిషా లేక కర్ణ పిశాచమా అని సందేహము కలుగుచున్నది” అని ప్రఫుల్ల అనెను. “ ఛీ ఛీ   నాకే మీ వలదమ్మా” అని మీనా ఆపుస్తకమును బల్లపై పెట్టి వంటగదిలోకి పోయెను.

ఆ పుస్తకమును పట్టుకుని వంటగదిలోకి వెళ్లిన యమున మీనాక్షి తో " శృంగారమనిన విషము కాదు చదివిన వారు వెలయాళ్లు కారు ఏల ఇప్పటికే మీరు వివాహము చేసుకొని యుండవలసినది , మీకున్న ఆస్తి అందము చూసి వలచి వచ్చువారు అనేకులుందురు. ప్రఫుల్ల ఇచ్చటికి ఎందుకు వచ్చుచున్నాడో తెలియునా?

మందమతిని కాదు లేవమ్మా , అతడి మనసు ఈ మధ్యనే గ్రహించితిని. కానీ 

 మీ భర్త కు మీకు విడాకులయినవి, మీ భర్త కానీ  కొడుకు కానీ   మీగురించి  పట్టించుకొనక ఎవరి దారి వారు చూచుకొనుచున్నారు, మీరు సంస్కృతి సంప్రదాయములని మీన మేషములు లెక్కించుచున్నారు. 

 అది  కాదమ్మా ఒకనాడు స్టూడియో లో అతడి కంప్యూటర్ నందు అతడి కుటుంబ చిత్రములు రెండు  బైటపడినవి. 

మొదటిచిత్రమందు   మాకు అత్యంత ఆప్తులైన అరుణతార నల్ల చొక్కా వేసుకున్నఒక వ్యక్తి తో బహుశా తన భర్తతో దిగిన ఫోటో కావచ్చు. రెండవ చిత్రమందు అదే నల్ల చొక్కా వ్యక్తి  వేరొక యువతితో కనిపించెను. ఆ రెండవ యువతిని ప్రఫుల్ల మా అమ్మ అని అనుచున్నాడు

యమున “ఆమె భర్త రెండవ వివాహము చేసుకొని యుండవచ్చు. అతడు    ఏమి చేయుచుండివారు?” 

మీనాక్షి “ఒకప్పుడు చిత్ర సీమయందు  దర్శకత్వము చేయుచుండివారు.”

వెంటనే యమున “ప్రఫుల్ల మీ  నాన్నగారు ఏమి చేయుచున్నారు? అని వంటగది లోంచి అరిచెను. “పోలీసు శాఖ యందు పనిచేయవలసినదానవు”   అని మీనా మెచ్చుకొనెను.

“ప్రస్తుతము ఇంటిలో వంట చేయుచున్నారు. ఒకప్పుడు చిత్ర సీమయందు డైరక్షన్ చేయుచుండివారు.” అని ప్రఫుల్ల బదులు పలికెను. కొలది సేపటికి వారు ముగ్గురు  నీలి ఆడి వాహనమందు స్టూడియోకి పోవుచున్నారు " రామే శ్వరము పోయిన శనేశ్వరం తప్పదన్నట్టు "అని ప్రఫుల్ల తన ప్రక్కన కూర్చొన్న యమునను చూచుచూ అనెను " హి హి హి అని యమున పండ్లు ఇకిలించెను.

Wednesday, December 9, 2020

Bharatavarsha - 88

 రాఘవ సందీపులు క్షేత్ర గృహమునందు తామర కొలను వద్ద చెట్ల క్రింద కూర్చొని యుండిరి . సూర్యుడు నడి నెత్తికి చేరుచుండెను. చెరువులో తామరాలన్నీ ఎర్రని కాంతులీనుచున్నవి. చెరువు లో నీరు తెమ్మెర తాకిడికి అల్లన కదులుచూ సూర్య ప్రభావమును పరావర్తించుచూ  మిరిమిట్లు గొలుపుచున్నది. రాఘవుఁడడిగిన ప్రశ్నకు సాందీపుని కి మెదడు స్థంభించెను, గాలి కూడా స్థంభించెను. నిశ్శబ్ధమావరించెను.  రాఘవుని మొఖము చూడలేక  సందీపుడు  ప్రక్కకు  చూచుచుండెను. అచ్చటి పచ్చిక బైలునందు కేకిలి యొకటి మందగమనమున తిరుగుచూ వారివద్దకొచ్చెను.

 రాఘవుడు “ ఆహా ఈ నీలగ్రీవము (నెమలి) ఎంత ముచ్చట గొలుపుచున్నది. నీ క్షేత్ర గృహము మైమరపు కలిగించు చున్నది.” సందీపుడు  “ఈ నెమలి నా చెల్లి నెచ్చెలి. ఆమెకు నెమలి యన్న నెమలి పించదారి యన్న ప్రాణము. ఈ ప్రాణమునొదిలి నందినెచ్చటికి పోయెనో తెలుసా! మంజూష వద్దకి , ఆమె ఇప్పుడు వదినను విడిచి ఉండుటలేదు. రాఘవుడు “ఇంతకూ నేనడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చినావు కాదు.” సందీపుడింకనూ సిగ్గు పడుచుండగా  “ఇప్పుడు పెండ్లి కుదిరినది కదా ఇంక బెరుకేలా?” అనెను.

నీవు సోలార్ పేనల్స్ ఉతిపాదన గూర్చి అడిగినావు కదా దాని పోజెక్ట్ రిపోర్ట్ తయారు చేయుచున్నాను. భారత దేశము నందు సోలార్ పేనల్స్ వ్యాపారము 163 బిలియన్ డాలర్స్  వరకు విస్తరించింది. కానీ పేనల్స్  కంటే సోలార్ పత్రములు  , (ఫోల్డబుల్ సోలార్ పేనల్స్)  భవిష్యత్తులో ఊపందుకొనును 

 నేనడిగినది నీవు మంజూషనెట్లు వశపరుచుకొంటివి? మీరెక్కడకలిసినారని నీవు తెలివిగా మాటమార్చి వ్యాపారము గూర్చి చెప్పుచున్నావు.   బెంగళూరు నందుండి వ్యాపారవిషయములతో బుర్రపిచ్చెక్కించుకొనుటయే తప్ప నాకింకొ కటి తెలియదు. ఈ ప్రశాంత వాతావరణము నందైననూ కొలదీసేపు వ్యాపారవిషయములు ప్రక్కనపెట్టి జీవితము నకు శోభగూర్చు ప్రణయ శృంగారముల గూర్చి మాట్లాడుము.

అట్లయిన నీవు నీ ప్రేయసి గూర్చి చెప్పినచో నీవడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పెదను. అని సందీపుడనెను. నా ప్రేయసి ఎవరూ లేరని రాఘవుడు మొదట బుకాయించిననూ పిదప "నన్ను యమున అనొక యువతి ప్రేమించు చున్నది కానీ నేనామెను ప్రేమనుంచుటలేదు. దానికి కూడా రెండు కారణములున్నవి. అందు పెద్ద రహస్యము దాగియున్నది. కానీ  ఆరహస్యము చెప్పవలెనన్న నేనడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పుము అనెను.

నీ క్షేత్ర గృహము ఈ ప్రశాంత వాతావరణము మైమరపు కలిగించుచున్నదంటివి కదా, ఇచ్చటనే నేను మంజూష కలిసి నాము. “ఇది నందినికి తెలిసిన ప్రమాదమే” అని రాఘవుడనుచుండగా ఇదొక చిదంబర రహస్యము కలదు అని సందీపు డనెను. 

“నీకునూ రహస్యము కలదా అది ఏదో త్వరగా చెప్పుము” అని రాఘవుడనెను

ఇందు నందిని హస్తము కలదు అనగా ఆమె నాకు ప్రోత్సాహము తో పాటు సహకారము కూడా లభించినది. “కానీ మంజూష కు నేనన్నచో పిచ్చి మోజు కలదు అందు నందిని పాత్ర ఏమియునూ లేదు.” 

అది నిన్న పెళ్లి చూపులయందే తెలిసెను. కానీ పెళ్ళికి ముందే సంగమమందు ఎవరి పాత్ర కలదు ? మంజూష పూర్తిగా నీవశమైనది ఏ మంత్రము వేసినావో! 

నీవా మంత్రమునిప్పుడు బెంగుళూరు నందెవరిపై ప్రయోగించవలెను? ప్రకృతి ప్రేరణ తప్ప మంత్రమేదియునూ లేదు. ఒకరి ఒడిలో ఒకరు ఒదిగి ఇచ్చటనే  వెచ్చని ముచ్చటలాడుకొను చుండగా స్త్రీ ప్రేరణను కాదను శక్తి ఎవరికుండును!

అట్లయిన మంజూషయే మంత్రము వేసెనన్నమాట,  

మంత్రము సంగతటుండనిమ్ము ముందు నీ  సంగతి చెప్పుము. 

యమున నేను ప్రయోజకుడినని సంస్థను వృద్ధిలోకి తీసుకు వచ్చెదనని ముచ్చటపడుచున్నది. అనగా నాకంటే నా నైపుణ్యమందు ఆమెకు ఆసక్తి ఎక్కువ.  సంస్థ  వ్యాపారము తగ్గుచున్నదన్నమాట వాస్తవము. అందుకు కారణముకంపెనీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేకుండుటయే. నాకు నీపై నమ్మకమున్నది. నీవొచ్చిన ఆ సమస్య అధిగమించవచ్చు. ఆమెకు నాయందు ఎంత ఆసక్తి యున్నదో తెలుసుకొనుటకు సంస్థ పతనము సమీపించుచున్నది అని చెప్పితిని. నేను ఇచ్చటికి వచ్చుటకు ముందు యమున తన ఇంటికి పిలచి ఆమె అత్తకు పరిచయము చేసెను, ఆమెఅత్త అంద చందములు చూచినపిమ్మట నాకు మతి పోయినది. ఈ సారి బెంగుళూరు పోయిన పిదప ఆమెను పెండ్లి యాడుటకు అడిగెదను.  

ఆమె వయసులో సగముండునా నీకు, ఆమెను వలచినావు ! పైగా పెండ్లి ఆడె దనానుచున్నావు.  

ఆమెకు సుమారు ఒక నలభై ఐదు యాబది సంవత్సరము లుండవచ్చును. ఆమె అందము నన్ను కట్టి పడవేచినది , నావిషయమందు నీవన్నదే - స్త్రీ ప్రేరణ - అధికముగా నున్నది. అమెరికాలో నేనున్నప్పుడు లేత ప్రాయమునున్న యువకులు పెక్కురు పెద్ద స్త్రీలను పెండ్లి యాడుట చూచితిని.  మన మిచ్చట ఈ పురుషాధిక్య ప్రపంచమందు ముసలి హీరోలు లేత హీరోయిన్లను ప్రేమించుట చూచి  ఇచ్చట మనకది వింతగా తోచుచుండును.

నీవామెనొ దులున్నట్లు లేవు. నీ ప్రేమయందు రాజీ పడునట్లు లేవు.

ప్రేమయందు నీవు రాజీ పడినావా?  బసవడు పార్వతి కొరకు బల్లిపాడు పరిగెత్తలేదా? వాడు రాజీ పడినాడా? నేనేల రాజీ పడవలెను? ఆమె గూర్చి యమునా ద్వారా నేనంతయూ విచారించితిని. ఆమె భర్తనుండి విడాకులు పొంది చాలా ఏండ్ల నుండి వంటిరి జీవితమును గడుపుచున్నది. ఆమె అందము ఎంత గొప్పదో మనసంత కంటే గొప్పది.

 అది నీకెట్లు తెలియును? ఆమె మనసును బూతద్దమందు చూచితివా?  ఇంకనూ  ఆమెకు కోరికలే ముండును? 

నందిని నాగూర్చి ఆమెకంతయూ తెలిపెను.  ఆమె నాకు పెద్దమొత్తములో ధన సాయము చేసెను. ఆమె మనసు వెన్న అని తెలుపుటకింకేమి కావలెను? ఆమె మనసును బూతద్దమందు చూచితివా అని అడిగినావు, ఆమెకు కోరికలింకే ముండుననుచున్నావు ఆమె కోరికలను నీవు బూతద్దమందు చూచితివా ? రాఘవుడు ముఖము ఖండించుకుని అట్లు చెప్పుచుండగా సందీపుడు వాడి ఉక్రోషమును చూచి పడి పడి నవ్వుచుండెను.

అప్పుడు రాఘవుడు " అవునురా నీకు లడ్డు లాంటి పిల్ల దొరికెను  సమ్మందం కుదిరెను. ఇతరులను చూచి నవ్వకేమి చేసెదవు. సందీపుని నవ్వింకనూ పెరిగెను. " హ హ హ్హ హ్హ ఇంతకీ బసవడు రేపు మరలివచ్చునా బల్లిపాడునందే స్థిరపడునా? వెడలి పోవుచున్న రాఘవుని " విమానములో పోరా , నీవు రెక్కలు కట్టుకొని ఎగిరెదవేమో?" నా పెండ్లికి తప్పక రావలెను "   అనుచూ రాఘవుని ఆట పట్టించి  అతడిని కారులో వదిలి పెట్టుటకు విశాఖ పట్టణము  విమానాశ్రయము తీసికొనిపోయెను. మార్గమద్యములో ఎన్  ఏ డీ  కూడలి వద్ద ఇద్దరూ కలసి భోజనము చేసిన పిదప విమానము వచ్చువరకూ సందీపుడు రాఘవునితో గడిపి రాఘవుడు విమానమెక్కుటకు బోవుచుండగా " రేపు ఢిల్లీ పోవు పనియున్నది,  అచ్చట రవీంద్ర భవన్ లో బావగారికి సాహిత్య అకాడమీ పురస్కారం కలదు.   లేనిచో నీతో బెంగళూరు  వచ్చెడి వాడనే.  రెండురోజులలో బెంగుళూరు నందు వాలెదను. కంపెనీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగును. అందుకు ఎంత శ్రమ ధనాదు లైననూ వెచ్చింతును అని అతడికి భరోసా ఇచ్చి " ఇంతకూ నీవు వలచిన ఆమె పేరేమి ?" " మీనాక్షి " అనిచెప్పి రాఘవుడు వెడలెను  

Sunday, December 6, 2020

Bharatavarsha - 87

సంజ కెంజాయలింకనూ మడక ముందే జి ఎం హెక్టార్ వచ్చి ఆనందనిలయం ముంగిట నిలిచెను. బసవ రాఘవులు దామిని రాధాకృష్ణులు అందునుండి దిగగా భారతవర్ష వారికి  నమస్కరించి స్వాగతించెను. పక్కనే ఉన్న తళుకులీను వస్త్రములందు నిలచిన  నీలోత్పల దేహి కేశిని, పొడవాటి వాల్జెడ  పిరుదులపై బడి యాడుచుండ, ఆ నితంబి  కూడా  ఇంటి కోడలివలె అతిధులను ఆహ్వానించుటయందు పాలుపంచుకొనుచుండెను. మధ్యాన్నమే వచ్చి తనకు  మాలినిగారిచ్చిన వీణ నిరుపయోగముగా యున్నదని వచ్చునప్పుడు  తెచ్చిఇచ్చి అత్తతో ముచ్చటలాడి  పిదప వర్షుని కూడి ఇప్పుడు ప్రవేశ ద్వారమువద్ద ప్రియ సేవనము  మొదలు బెట్టెను. మాలినిగారు వచ్చి దామినిని తోడ్కొని పోయినారు.  వారు లోని కేగుచుండగా మెర్సిడెస్ వాహనమొచ్చి ఆనందనిలయం ముంగిట నిలిచెను.  

పైడమ్మ పెంచలయ్యలను కూడివచ్చిన సందీపుడు నందిని లకు భారతవర్ష నమస్కరించి స్వాగతించుచుండగా పెంచలయ్య పైడమ్మ వర్షుని పలకరించి ముందుకు సాగుచుండగా మాలినిగారు వారిని లోనికి తోడ్కొని పోయిరి  సందీపుడు వారితో వెడలి పోయిననూ నందినిని మాత్రము లోనికి పోక “బావగారు మీరు మాకు ఆంగ్లమును భోదించునపుడు పంచెలు ధరించలేదు. కానీ మీరు పంచెగట్టిన తెలుగు భాషకు రూపమువలె నుందురు అని  నేను మీ ఆంగ్ల విద్యార్థినిని కావున నాకాభాగ్యము దక్కలేదు. కానీ నుదుట బొట్టు పెట్టిన మీ మూర్తికి  మరింత   శోభనిచ్చును పెట్టమందురా అని ఆట పట్టించుచుండెను.

 అది చూచిన  విదిష   మిరపకాయల ధూపము వేసినట్టు ధుమ ధుమలాడుచూ ఆడిన మాటలు చాలును లోపాలకి వెళ్ళవమ్మా నీ తల్లి తండ్రులు వెళ్ళినారు కదా." అనగా నందిని వర్షునితో " ఈమె ఎవరు బావగారు ?" సహాయకురాలి వలె నున్నది అన్యులకు ఇంత చనువివ్వరాదు అని వర్షుడి చెవిలో చెప్పు చుండగా  ఉక్రోషము పట్టలేని విదిష ఆమె జబ్బపై చరిచి పరపురుషులపై పడుట ఏమది ఇంకనూ వచ్చుచువారిని మేముస్వాగతించవలెను నీవు లోపాలకి పో అమ్మా  అని  అనగా  "ఆపని  వర్షుని కూడి నేను చేసెదను."  అని నందిని బదులు పలికెను.

"ఇదిగో అమ్మాయి పెద్ద చిన్న లేక  గురువు అని చూడక పేరు పెట్టి పిలుచుచున్నావా " అని గద్దించుచూ  వర్షుడు మిన్న కుండుట   చూచి విదిష కు అరికాలి మంట నెత్తికెక్కెను. భారతవర్ష వైపు మిర్రి మిర్రి చూచుచూ "నీకు చెప్పుట చేతకాని వారుండుటచే నీవిట్లు రేగుచున్నావు” అనెను.  “నన్ను పొమ్మనుటకు నీవెవరివే నేనిచ్చటనే  ఉండెదను” అని నందిని విదిష పక్కనే నిలిచెను. వర్షుడు మెల్లగా ఇంటిలోకి జారుకొనెను. చల్లగా చంద్రోదయము అగుచుండెను, మసకచీకట్లలుముచుండగా రాధామనోహర పుష్పములు పిల్లగాలికి తలలు ఊపుచూ  పిళ్ళారిగీతమేదియో  పాడుచుండెను. 

 చ. సితక   రకాంతు లందల రుజోడు  హయమ్ము లవోలె ముంగిటన్

        అతివ    లునిల్వ  గాజల   రుహమ్ము  లబోలి   నమేని   కాంతులే 

        మతుల  నుచిక్క  బట్టమ   రిపెళ్ళి  కళొ చ్చె  నుచూడ  సందడే   

        రతుల   ను పోలి  భామలు పురిప్పి  చలించ   మయూర  శోభలన్.


       సితకర   కాంతు లందలరు  జోడు  హయమ్ములవోలె ముంగిటన్

        అతివలు  నిల్వగా  జలరుహమ్ము లబోలిన  మేని   కాంతులే 

       మతులను   చిక్కబట్టమ   రిపెళ్ళి  కళొ చ్చెను  చూడ  సందడే   

        రతులను   పోలి  భామలు పురిప్పి  చలించ   మయూర  శోభలన్.

చంద్రు కాంతిలో జోడు గుఱ్ఱములవలె ఇంటి ముంగిట  ఇరువరు అతివలు (నందిని విదిషలు) నిలువగా జలరు హ మ్ముల (కలువపువ్వుల)ను పోలి వారి మేని కాంతులు మెరియుచుండగా   వారి అందము మతులు పోగొట్టు చుండగా ఆ ఇంటికి పెళ్లి కళ వచ్చెను. రతులను పోలిన ఆ ఇంటి కోడళ్ళు పురిప్పి చలించు చుండగా చూడ సందడే కదా. 

కొలది సమయము తరువాత వారునూ ఇంటిలోకి ప్రవేశించిరి. వారందరి సందడితో ఆ మండువా లోగిలి పెండ్లి పందిరి వలె నగుపించసాగెను. పురుషు లందరు తెల్లని పంచెలుగట్టి  తారలల్లె   తళ తళ మెరియుచుండ  సందీపుడొక్కడే  నీలి సూటు లో చుక్కలందు చంద్రుడి వలె వెలుగుచుండెను.సోఫాల పై వరుని తల్లి తండ్రులు సందీపుడు నందిని కూర్చొని యుండగా మంజూష వారికెదురుగా తివాచీపై కూర్చొని యుండెను.  మాలిని  దామిని విదిష నిలుచొని యుండిరి.  రాఘవ రాధాకృష్ణ  కుర్చీలపై కూర్చొనిరి,  బసవ కేశవులు  మంజూష వద్ద నిలుచుని యుండిరి.   సందీపుని మనసున రణము జరుగుచున్న చిత్ర మింకనూ తిరుగుచుండుటచే  భారతవర్ష కళ్ళలోకి సూటిగా చూడలేకుండెను.

 “సందమామ లాటి  పిల్ల కాసి సూడకుంట దిక్కులు సూత్తావేటిరా!” అని పైడమ్మ అనెను. రాఘవుడు " సందీపు నిలో  ఎందుకో ఆందోళన కనిపించుచున్నది, అని వర్షుని వైపు చూచెను .  వర్షుడు విషయము అర్ధము చేసుకొని  బావగారు  అని సాందీపుని సంబోధించి " మా చెల్లిని చూచినచో మీ ఆందోళన తగ్గును." అని సాందీపుని  దగ్గరికి పోయి  భుజముపై చేయి వేసి చెప్పెను .  పిల్ల కూడా అట్లే యున్నది  ఇదంతయూ మా ఆయన పనే , ఈ పెండ్లి చూపుల తతంగమేలనో మనసులు కలిసినవి మాటలు ఇచ్చి పుచ్చుకొనినారుకదా నేరుగా ముహూర్తము పెట్టుకొనిన పిల్లలకీ శ్రమ తగ్గునుకదా అని దామిని అనెను, విదిష  కూడా  అట్లు చేసిన బాగుండెడిదని  అనెను. 

స్త్రీలే అన్ని విషయములూ నిర్ణయించినచో పురుషులము మేమెందులకు అని రాకి అనుచుండగా కేశవుడు "పెట్టెలు మోయుటకు" అని చమత్కరించెను. అందరూ ఘొల్లుమని నవ్వినారు. ఎట్టకేలకు వాతావరణము తేలిక పడినది. ప్రేమించుకొనుట , తదుపరి ఘర్షణలు  ఎట్లో  జరిగి పోయినవి. వాటి ప్రభావమింకనూ పసి మనసులపైనున్నది. ఈ పెండ్లి అంతయూ  పెండ్లి చూపులనుండి అన్ని యదా విధిగా   సజావుగా జరిపించిన యెడల పిల్లల మనసులతో పాటూ పెద్దల మనసులు కూడా కుదుట పడును. అని చెప్పి విదిషవైపు చూచి నీవింకనూ చిన్నపిల్లవేకదా ఎన్నిపెళ్లిలు చేయించినావు నీవిట్లు మాట్లాడతగదమ్మా అని చెప్పెను.

విదిష  జింకపిల్ల వలె బెదురుకళ్ల  నాడించుచూ మాలినిగారివద్దకు పోయి ఆమె భుజము పై వాలెను . మాలినిగారు ఆమె తలనిమిరి ఓదార్చుచుండగా సోఫా పై నుండి నందిని కూడా లేచి మాలిని గారివద్దకు పోయి మరొక భుజముపై తలపెట్టుకొనెను. మాలినిగారు ఆమె తలను కూడా ప్రేమగా నిమిరి. మీరిద్దరూ నాకు రెండు కళ్లు అని ముద్దాడిరి. విదిష వెంటనే విసవిసా పోయి మంజూష ప్రక్కనే కూర్చొనెను , నందినికూడా మంజూషవద్దకే పోయి మరొక ప్రక్క కూర్చొనెను. ఒకరినొకరు కొరకొరా చూచుకొనుచుండగా కేశవుడు “వారిమురిపెములు చూచుటకింకనూ సమయము కలదు ముందు చెల్లాయి (మంజూష) సంగతి చూడవలెను.” అనెను. హాస్యము వెల్లివిరిసెను.

 మంజూష విదిషకంటే ఎక్కువ సన్నిహితముగా మాట్లాడుచూ  నందినితోనే మెలగ  సాగెను. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములువాడి కదా. వెంటనే విదిష వర్షునివద్దకుపోయి కొలది దూరములో నిలిచి తన పుష్పాలంకృత   ద్రాష్టిగ కేశములను పొడవాటి పూల జెడను చేతపూని నిలవగా నందిని కూడా తన నాజూకు కౌనును త్రిప్పుకొనుచూ పోయి అతడికి మరొకప్రక్క నిలిచెను. పెళ్లి చూపులు మంజూషకి  వలే కాక వీరిద్దరికి (పెళ్లి చూపులు) వలే తోచుచున్నవి  అని దామిని అనగా పెంచలయ్య సందీపుని  మంజూషను ఏమైనా మాట్లాడుకొనవలసినదేమైననూ ఉన్నదా లేనిచో పెద్దలము  మాట్లాడుకొనవలసినవి ఇంకనూ యున్నవి అనెను. 

పైడమ్మ “మా కోడలు వీణ వాగించుతాది అని ఇన్నాను , ఒక ఈన పాట అనుచుండగా సందీపుడు తల్లివైపు " ఇప్పు డెందుకు పెండ్లి అయినా పిదప వాయించునులే " అని అనగా అందరూ నవ్వు చుండిరి .  అబ్బో కాబోవు పెళ్లా మనిన ఎంత అపురూపమో  అని రాఘవువుడనగా , మా ముంగీస కూడా ఎంత బుద్ధిమంతురాలయిపోయెనో అని రాకి అనెను. " మాలినిగారు " పిల్లకి వీణావాదనము బాగుగా రాదు ఈ ఇంట వీణ వాయించునది మా పిల్లవాడు " అని చెప్పగా   బాగుగా రావలసిన పనియేమున్నది పిల్ల వాయించవలెను కానీ పిల్లవాడు వాయించుటకు సందర్భము కాదుకదా అని రాఘవుడనెను .

వీణావాదనముతో పని ఏమున్నది మంజూష పాడిననూ చాలునని   బసవడు ఒక ఆసు  కవితను దొర్లించెను.   

వంటి మెరుపులోనే వేయి రాగాలు, కంటి కొసలలోనే వెలుగు దీపాలు 

తీగవంటి పిల్ల తీగమీటనేలా సాహితీ వరపుత్రుని సరస గిరసము

వీడి వరుసకూడి సరసముగా పాటపాడ విన్నవారి వీనుల తేనె కురియు. 

అన్నింటికీ సందర్భమున్నది కానీ నీ ఆసుకవితలకు సందర్భము లేకుండెను అని అగస్త్యుడు చమత్కరించెను. మరల నవ్వులు విరుపూచి వాకిటనున్న విరులనల్లుకొన్నవి.  మంజూష ముందు వీణ యుంచబడినది. మంజూష బేలగా వర్షుని వైపుచూచి పిదప సందీపుని వైపు చూడగా అతడి  మనసు ద్రవించి "పాటపాడిన చాలుకదా వీణా వాదనమెందులక"ని కాబోవు ఇల్లాలికి ఇక్కట్లు తప్పించుటకు ప్రయత్నించుచుండగా రాఘవుడు "  అత్తగారు కోరినారు కోడలు ఆమె కోరిక తీర్చవలెను మధ్యలో నీవెందులకు గింజుకొనుచున్నావు?” అని తీక్షణముగా అడిగెను.  "మంజూష నీవు పాట పాడుచూ వీణా వాదనము చేయవలెను. పాట నీకిష్టము" అని రాకి అనగా దామిని రాకివైపు తీవ్రముగా చూచెను. నందిని  "ఎదో ఒక పాట  అయినా ఎట్లు కుదురును మా కులదైవం గోపాలుని కీర్తించుచూ గానము చేయవలెను" అని నిబంధనను జేర్చెను.

కేశవుడు " చెల్లికి కంగారుగానున్నది కావున గోపాలుని పై పాట నేను పాడెదన"ని ముందుకు వచ్చుచుండగా " పోవయ్యా నీ డ్రామా గానములిచ్చట కుదరవు ఇవి పెండ్లి చూపుల"ని నందిని  కొట్టి పారవేసెను నందిని పాడుట   మొదలు పెట్టు చుండగా ఏసు ప్రబువు పై గానము చేయరాదా యని పెంచలయ్య అడిగెను.   పైడమ్మ సివంగివలె లేచి " ఆల్ల కాడ నీ మతం  ఊసెత్తనని,  ఆల్ల పద్దతి పకారంగా (హిందూ వివాహము ) పెల్లి సేత్తానని మాటిచ్చినావా , నాను కూడా ఆవిసయం ఒట్టేయించుకొన్నానా ?  ఒట్టేసి సెప్పేవా నేదా?  అవిటవిటికి సెప్పాలేటి ? మడిసివికాదేటి ?? " అనగా కొలది సేపు నిశ్శబ్ధమావరించెను.  

ఆ నిశ్శబ్దమును చీల్చుకొని వీణానాదము గంగా ప్రవాహము వలె అందరి చెవులను తాకినది. మంజూష గానము లేకనే వీణ  వాయించు చుండగా ఆమె ప్రక్కనే కూర్చొని నందిని తాను వ్రాసిన సంస్కృత గీతము నాలపించెను    

ప్రాతః కాలే  నంద నందనే పూజా సమయే వందిత గురుః 

విద్యాసమయే ముకుంద మురారీ సంధ్యా సమయే నంద నంద 

క్రీడాసమయే గోపికా ప్రియా మానసచోరా గోపాల గోపాల

ఉత్తిష్ఠ యావత్ శయన పర్యంతం సతతము తవ నామస్మరణే కృష్ణా

గానము , వాదనమూ ముగిసిన పిదప అందరూ నందినిని కొనియాడిరి. పైడమ్మకీ విషయము తెలిసిననూ భర్త ఎప్పుడూ కుమార్తె సంస్కృత రచనా ప్రతిభను వినియుండ కపోవుటచే సంబ్రమాశ్చర్యములకు లోనయ్యేను.

పిదప తన బిడ్డలు గొప్పవారని చెప్పుకొనుచు మురిసి పిదప పెంచలయ్య కట్నము విషయమై నసిగి నసిగి పలు పలు సంభందములు లక్షల కట్నము ఇవ్వజూపినారని చెప్పెను. పరోక్షంగా అతడికి పెద్ద కట్నము పై మనసున్నదని ఎరిగించెను . మాలినిగారు పైడమ్మతో " ఎంతనుకునుచున్నారో తెలిపిన ఒక మాటనుకొనవచ్చునని తన కొడుకు  పది లక్షలు వరకు సర్దుబాటు చేయున"ని చెప్పగా పెంచలయ్య " కోట్లలో సంపాదించువానికి ఇంటివ్వవలెనో నేను చెప్పవలెనా " అని సాగ దీసెను . వర్షుడు "ఒక యాబది లక్షలు  ఇచ్చెదనని"  చెప్పగా " కోటి యని పెంచలుడు బిగించెను. అందరూ  మిక్కిలి ఆశ్చర్యమునొంది పెంచలయ్య తెంపరితనమును  గర్హించుచుండగా భారతవర్ష తల్లి వైపు చూచెను. సందీపుడు నందిని వారించిననూ ప్రయోజనము లేకుండెను. అందుచేత కొంత విలంబ మగుచుండెను. ఇంతలో సిద్దాంతిగారు విచ్చేసినారు. విషయము తెలిసి పెంచలయ్యకు హితము చెప్పుచుండగా  మంజూష కళ్ళలో నీళ్లు తిరిగినవి " మంజూష  మూతిముడిచి మొఖం మాడ్చెను . ' పెంచలయ్య కన్నీరు పెట్టుకొని "మా కోడలుచే  కంట నీరు పెట్టించుచున్నారు , నాకంట నీరు పెట్టించుచున్నారు. వాడిపై నేను పెట్టుకొనిన ఆశలడియాసలయినచో నాజీవితమంతయూ దుఃఖింతును." అని మర్యాద భాషలో మన్ననగా అడుగుచుండగా భారతవర్ష ఒక కోటి కట్నమిచ్చి చెల్లి పెళ్లి చేయుటకు సమ్మతించి  చెక్కు వ్రాసి ఇచ్చెను. మరుసటినెలలో మూర్తము  నిర్ణయించబడెను. సిద్ధాంతి గారు పంచాంగం చూసి ముహుర్తమును నిర్ణయించి శుభలేఖ వ్రాసి ఇచ్చినారు అది వర్షుని చదవమనగా " స్వస్తిశ్రీ చాంద్రమానేనా విళంబినామ సంవత్సర మాఘ మాస బహుళ దశిమి బుధవారం రాత్రి 7. 40 నిమిషాలకు హస్తా  నక్షత్ర యుక్త మిధున లగ్నమందు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మంజూషను  .." చదువుచుండగా మంజూష మొఖం కళ్యాణ కాంతులతో  వెలిగెను.  వారి ఇరుహృదయములలో  భజంత్రీలు మ్రోగుచుండెను   అట్లు మంజూష వివాహము నిశ్చయమయ్యెను 

Friday, December 4, 2020

Bharatavarsha - 86

కైలాసగిరి పై పరమేశ్వుడు పార్వతిని కూడి కొలువు తీరి చూచుచుండ ఆదిదంపతుల ప్రమోదమంద ఇనుడు చిరునగవులు చిందించుచుండె. నిహారస్నాన మాచరించిన ప్రకృతి  కాంత  లోకచక్షు పసిడి మయూఖ రేఖలందు తన అందముల నారబెట్టుకొని  నిగనిగలాడు మెరియుచున్నవి. "ఆర్యాణికల్యాణి, కాత్యాయణి,నీహారమే, నిహారమై, ప్రకృతికిహారమైజీవులకు ఆహారమై నొప్పుచున్నదికదా!అని బసవడు మిద్దె పైనుండి కైలాసగిరి కొండను చూచుచూ ప్రకృతిని వర్ణించ విఫల యత్నము చేయుచున్నఅగస్త్యునికి చెప్పగా అతడి మది పులకించెను.  చందన మేడపైకి వచ్చి " అమ్మ పిలుచుచున్నది " అని క్రిందకు వెడలెను. 

“అబ్బా! చందన ఎంత పొడవు ఎదిగిపోయెను. కుందనపు బొమ్మవలె యున్నది.” అని రాఘవుడనెను  "అవును అదిప్పుడు డిగ్రీ చదువుచున్నది"  అని బసవడనెను.  క్రిందకు దిగిన అగస్త్య బసవ రాఘవలతో బుచ్చెమ్మగారు " అల్పాహారం సిద్దము గానున్నది స్నానములు ముగించి రావలెన”ని చెప్పగా “ఇంత తొందరగా అల్పాహారమెందులకని అగస్త్యుడనెను. బసవడు "స్నానము ముగియుసరికి ఆలస్యమగును పండ్లు తోముకొని వెంటనే ఉదర పూజ గావించవలెన"ని తొందరపడుచుండగా బుచ్చెమ్మగారు " చూడునాయినా ఎట్లు వేపుకు తినుచున్నాడో రేపు పండ్లు తోముకొనక ముందే తినుటకు పెట్టమనునేమో !" అని తల  పట్టుకొనిరి.  

ఓరి తిండి బోతా రాత్రి అమ్మచేతి వంట  ఇద్దరమూ బాగానే మెక్కితిమిగదరా. “అవునురా నేను తిండి  బోతువు నీవు నిద్ర  బోతువు కాదన్నదెవరు!” అని ఆగమేగాలమీఁద పండ్లు తోముకొని వచ్చి తిండికి కూర్చొనెను . అగస్త్యుడి కూడా వానికి తోడుగా కూర్చుని తినసాగెను  బుచ్చమ్మగారు ఇడ్లీలు చేసి కొబ్బరి చెట్నీ కూడా  చేసినారు. "రాత్రి చేసిన రవ్వపులుసు లేదా?" అని  బసవడు  ఆగం చేయుచుండగా చందన నవ్వు చుండెను.  “ఎట్లు భరించుచున్నావమ్మా ఈ బిడ్డని?” అని అగస్త్యుడు అనగా “నాకేమినాయనా పడ్డంతకాలము పడక్కరలేదు ఆ వచ్చునది వీడితో ఎట్లు వేగునో అన్నదే నా విచారము” అని బుచ్చెమ్మగారు అనగా అగస్త్యుడు బసవడి  కళ్ళలోకి బుచ్చెమ్మగారి కళ్ళలోకి మార్చి మార్చి చూచి అడగలేక నసుగుచుండగా " పార్వతి గురించి వారికి తెలియును" అని బసవడు అగస్త్యునితో మెల్లగా అనెను. అట్లు మెల్లగా అను టే ల గట్టిగానే చెప్పరాదూ అని బుచ్చమ్మగారు “తల్లి తండ్రుల అంగీకారము కావలెనని అరుణతారగారు అనుకున్న మా మాసన్నాసి అక్కడే తాళి కట్టి ఇదిగో నీకోడలని ఆపిల్లని ఇంటికి తెచ్చెడివాడే, ఆయన (సర్రాజుగారు) ఎప్పుడూ ఊహించలేదు ఇట్లు జరుగునని తల్లడిల్లిపోయినారు. 

“మెల్లగా మాట్లాడమ్మా నాన్నఇప్పుడే నిద్ర లేచినట్లున్నది అని చందన అనుచుండగా సర్రాజుగారు. బయటకువచ్చి "మాకు దగ్గర సమ్మందములున్ననూ కాదని వీడికొరకు ఆ పిల్ల ఇంటికి పోయినాము. బల్లిపాడు పోయిన తరువాత ఆ చంద్రమ్మ పిల్లని ఇచ్చుటకు వీలు పడదని చెప్పినది ఛీ ఛీ వీడివల్ల మరల కాళ్ళీడ్చు కొని వచ్చినాము.” చందన " చంద్రమ్మ కాదు నాన్నగారు చంద్రమతి" అని కిసకిస నవ్వ సాగెను. బుచ్చెమ్మగారు చందన పళ్ళెములో చెట్నీ వేయుచూ ఆమె నెత్తిన  గరిటె తో  ఒక్కటి మొట్టినారు అయిననూ ఆమె నవ్వు ఆపకుండెను. నాకిటువంటి కుటుంబముండిన ఎంతబాగుండునని అగస్త్యుడు మనసులో అనుకొనెను.

ఆమె ఇవ్వనన్నా మనమూరుకొందుమా అరుణతారాగారితో మాటలాడించకుందుమా ఈ సారి అగస్త్యుడు కూడా పెట్టున నవ్వెను. అందరూ నవ్వుచుండగా బసవడి మొఖమెర్రబారెను. అల్పాహారం పిదప అగస్త్యుడు బసవడుఫెరారీ నెక్కి కాలనీ దాటి ఘంటా పథమున సాగుచుండిరి. వారు పాత డైరీ ఫారం ప్రదేశమును దాటుచుండగా ఎవరో   చేతిని వూపుచుండ అగస్త్యుడు వాహనమును నిలిపెను. రాఘవా, నీవా డైరీఫారము వద్ద ఇచ్చటమిచేయుచున్నావు? “బర్రెలు కాయుచున్నాను!( ముగ్గురూ నవ్వుకొనిరి ) మా ఇల్లు ఇచ్చటనే! నేను సబ్బవరం పోవుచున్నాను. నిన్న సందీపుని కలిసినాను నేడు సందీపునకు  మంజూషకు  పెళ్లి చూపులు.   మీరు తప్పక రావలెను అని జరిగిన విషయమునెఱిగించగా వారు నిర్ఘాంత పోయినారు “సాయింత్రము ఐదు గంటలకు వర్షుని ఇంటికి  రావలెనని” తెలిపి రాఘవుడు వెడలెను.

అగస్త్య ఫెరారీ గరిష్ట వేగమెంతో  తెలియునా ?  "280 కి. మీ . ఐదు గేరులు  కలవు." 

దీనికొరకు ఇన్ని కోట్లేలపోయవలెను ? ఈ మాదిరి కార్లు వారు మొత్తము 36 మాత్రమే చేసినారు అన్నీ ఇంకనూ అద్భుతముగా తిరుగుచున్నవి.  ఫెరారీ గమ్యమును చేరెను. 

కలుఉప్పాడ: ఇది ఇల్లా పర్వతమా ఏమీ అందము ఏమీ రాజసము, సర్దారు పటేలు   విగ్రహమంత ఎత్తున్నదే. అనుచూ ఆ భవనంపై ఒక ఆసుకవితా శరమును ప్రయోగించెను. "శిరము మబ్బులందు సరము మిద్దెనందు గల రాజగృహము ను కాంచిన ఈ రాజహంస ఏల నేల వాలె నని చూచుచుండ   చుట్టె  శిశిరము,  ఏమో! మన మేనమామ,  చందమామ ముక్కొకటి  తెగిపడెనేమో!  ఏమో! కలేమో!! అని కవితా లతలు జల్లి ముందు అగస్త్యని లోనికి పొమ్మని కొలది సేపాగి   బసవడువచ్చెను. 

మయ నిర్మితమువలె నున్న ఆ భవంతి ఐదవ అంతస్తు లో అడిగిడి  అగస్త్య తండ్రి  దక్షిణామూర్తి గారి గదిలోకి ప్రవేశించుచుండగానే బసవడు అగస్త్య ఎదురెళ్లి బసవని కలుసుకొనగా ఆ అంతస్తులోగల  నలుగురు పనివారిని నాలుగు అత్యవసరమైన  పనులపై బైటికి పంపెను. ఆ గదిలో గల కెమెరాను  ఆపుజేసెను. నాన్నగారు , నా బాల్య స్నేహితుడు బసవడని  చెప్పుచూ మంచము పైనున్న దక్షిణ మూర్తిని బసవని కి  పరిచయం చేయగా బసవడు నమస్కరించెను. "కొద్దినెలలుగా గుండెపోటు వచ్చి ఆరోగ్యము చెడుటవల్ల  మంచము పట్టినానని దక్షిణామూర్తి చెప్పుచుండగా, అగస్త్యుడు "గ్రెస్ ఏదని ఆడిగెను. "ఆమె కార్యాలయమునకేగెను, ఆమిప్పుడు భాగస్వామి మరియు డైరెక్టరుకూడా.  రేపు వార్షిక  జనరల్ బాడీ మీటింగ్ సమావేశముకలదు. ఆ ఏర్పాట్లు చేయుచున్నది” అని దక్షిణ మూర్తి చెప్పెను.  ఇంత  కాలమూ  లేనిది ఇప్పుడు ప్రత్యేకముగా  ఈ మీటింగు లేల   అని అగస్త్యుడు అడగగా "ఇప్పుడు మన సంస్థ ప్రయివేట్ లిమిటెడ్ కాదు పబ్లిక్ లిమిటెడ్ గా మారినది ,పోయి చూచి రమ్ము  రెండు వారములనుండి చెప్పుచున్నాను  సంస్థ వంకకు పోలేదు సరికదా కనీసము కన్నెత్తి నామ ఫలకమైననూ చూడలేదు  మన సంస్థ కు నలుగురు భాగస్తులు గ్రేస్ , శ్యామ్ , సుందర్ అని చెప్పగా  ఇంతకూ ఆ నాల్గవ భాగస్తుడు ఎవరు? అని అగస్త్యుడు అడిగెను.  బసవడు "తెలివి తక్కువ సన్నాసి , మీ నాన్నారా అని బసవడు అనెను.  అప్పుడు అగస్త్యుడు “నాన్నా! ఏమది సంస్థనే భాగస్తుల పణము చేసినావా! ఎంత చేటు తెచ్చినారు. ఆమె పై మీకెంత నమ్మకము”  దక్షిణామూర్తి " పోరా ఇదంతయూ నీ నిర్వాకమే!" అనుచుండగా వారు  కర్మాగారమునకు  బయలు దేరినారు. 

                                          ***

"పని వారందరూ మారిపోయినారు గేటు వద్ద రక్షణ సిబ్బంది కి కూడా నేనెవరో చెప్పుకొన  వలసి వచ్చెను."  "నీవిట్లు ప్రతి విషయమునకు వగచినచో ఇక మన పని అయినట్లే. రక్షణ సిబ్బంది ఎప్పుడూ మారుచునే యుందురు." అగస్త్యుడు ఫెర్రారీను కార్యాలయ భావన ముంగిట ఉన్న వసారాలో ఆపుచుండగా వాహన శాల యజమాని వచ్చి " మీరు వాహనము నిచ్చట నిలపరాదు సిబ్బందికి అధికారులకు వాహన ములు నిలుపుటకు వేర్వేరు గా వాహన శాలలున్నవి." అని చెప్పెను. నేనెన్నడూ  వాహనమును అచ్చట నిలపలేదు , నేనెవరో మీకు తెలియదు " అని అగస్త్యుడు అనుచుండగా వాహన శాల యజమాని " ఇచ్చట అమ్మగారు తప్ప మరెవరూ వాహనములు నిలపరాదు . " అని గట్టిగా చెప్పెను. వాదన మొదలవుచుండగా బసవడు " అగస్త్య వాహనమును పోనిమ్ము , వాహనశాలకే పోయెదము " అని మిత్రుని ముందుకి పొమ్మనెను. 

 వాహనమును నిలిపి కార్యాలయములో అడుగుపెట్టిన అగస్త్యకి  తెలిసిన ఒక్క మొఖం కూడా కనిపించక పోవుటచే సంభ్రమము కలిగినది. బసవడికి అన్ని విభాగములు చూపవలెనని అగస్త్యుడు భావించిననూ ప్రతి విభాగము వద్ద నిలిచి చెప్పుకొనుట కష్టముగా నే కాక అవమానముగా  కూడా  తోచెను.  బసవడు " ఓరీ  మొద్దూ , నీ కొక గుర్తింపు కార్డు లేకపోయెను ఇచ్ఛట  అంతా కొత్తవారివలె నున్నారు . మీ నాన్నని ఇచ్చట నిర్వహణాధికారి ని కలిసి నీ వెవరో  తెలుపుము వలసినచో  మీనాన్నగారితో మాట్లాడించిన ఈ కష్టములు తొలగును. అగస్త్యుడు విసవిసా నిర్వహణాధికారి గది వైపు దూసుకుపోయెను  కానీ అచ్చట కుర్చీ ఖాళీ గా ఉన్నది  చివరిగా అగస్త్యుడు తండ్రితో  దూరవాణి యందు సంభాషిచుటకు ప్రయత్నించు చుండగా " హలో ఇచ్చట  రాకి అచ్చట ఎవరు ?" అని అడగగా అగస్త్యునికి అరికాలిమంట నెట్టి కెక్కెను. " ఏమయ్యా నీ ముద్దుపేర్లు చెప్పక అసలుపేరు చెప్పవయ్యా !" అని అనగా నీ పేరు చెప్పక నన్ను దబాయించుచున్నావు. వలసినచో నీవునూ ముద్దు పేరే చెప్పవు " 

ఏవయ్య నాపేరు అగస్త్య నేను మానాన్నతో మాట్లాడవలెను. మానాన్న పేరు దక్షిణామూర్తి, నీవెవరు మాఇంట ఏమిచేయుచున్నావు. నాపేరు రాధాకిష్ణ  నేను    హృదయాలజిస్ట్ ను మీనాన్నకి  డాక్టరును . " తిక్కవాని వలె ఉన్నావే , నేనటువంటి డాక్టరుండునని ఎచ్చట వినలేదే అనుచుండగా సైకాలజిస్ట్ దూరవాణి సాధన మందుకొని  చూడుబాబు  మీ నాన్నగారికి ఇప్పుడే సూదిమందిచ్చినారు. మరల ఛాతిలో నొప్పి వచ్చినది.  ఆయనకు  విశ్రాంతి  అవసరము  ఇప్పుడు  మాట్లాడించకున్న  మంచిది."  

విధిలేక అగస్త్యుడు సంభాషణ ముగించి ప్రక్కకు చూచినంతనే పేకింగ్ విభాగము నుండి గ్రేస్   అధ్యక్షుని గదిలోకి పోయి కూర్చొనెను. అది చూసి అగస్త్యుడు ఖంగు తినెను. బసవడికి ఏమీ అర్ధము కాకుండెను " ఇది మానాన్న గది.   నేను మొదటిసారిచ్చటికి  వచ్చినప్పుడు   అనుమతిలేనిదిదే ఆయన  గది లోపలికి ఎవ్వరినీ పోనిచ్చెడివారు కాదు. ఆమెను కూడా ఇప్పుడంతాయో మారి పోయెను.  అనుచుండగా సూట్ వేసుకున్న ఒక పొడుగాటి వ్యక్తి లోపలకి పోయెను. అగస్త్యుడు లోపలి వెళ్ళుటకు ప్రయత్నించగా  గది బైట నున్న కావలి అడ్డుకొనెను.  

బసవడు " ఇప్పుడు ఇచ్ఛట మనము చేయవలసిన పని ముగిసినది పద ఇంటికి పోవలెను. " అని ఇంటికి బయలుదేరినారు. ఇల్లే అనుకొంటిని, సంస్థ మొత్తమూ నీ తల్లి గుప్పిటలో నున్నది  ఇదంతయూ   నీ సవతి తల్లి ఆడించుచున్న నాటకము. చూచుచుండగా ఆమె గురి నీపైనే ఉన్నది. అని బసవడు అనగా అగస్త్యుడులికి పడెను. "మీ  సంస్థలో ఈ మధ్య కాలములో ఎవరైనా ఉన్నతాధికారి తొలగింపబడెనా ?" 

 "తొలగించబడుటయా మా నాన్నను అడగవలెను" అని అగస్త్యుడు అనుచుండగా  బసవడు "అందుకే నిన్ను నిద్రపోతు  అన్నది, నిర్వహణాధికారి జాన్ స్థానము ఖాళీ అయ్యెను. అతడి స్థానమందు మొరొక కొత్త అధికారి త్వరలో వచ్చును , అందుకే అతడి కుర్చీ ఖాళీ అయ్యెను.  "అతడు చాలా మంచివాడు అతడిని ఎందుకు తొలగించవలసి వచ్చెనో!"   అది కూడా చెప్పవలెనా యజమానికి ఎవరు విస్వాస పాత్రుడో వాడు వీరికి శత్రువు. కనుక జాన్ ని కలుసుకొనుట మన తదుపరి  కర్తవ్యము  అని బసవడనగా " మరి మన తక్షణ కర్తవ్యము అని అగస్త్యుడనెను "మార్గమధ్యమములో ఆగి రెండట్లు తిని పోవుట , మీ ఇంటివద్ద (భోజనమునకు ) ఎట్లుండునో యని బసవడు అనగా అగస్త్యుడు ఏడవలేక నవ్వెను. బసవడు  ఒక దోస  కట్టించుకొన్న తరువాత ఇరువురు ఇంటికి బయలుదేరిరి.  

ఫెర్రారీ ఆకాశహర్మ్యము ముందాగెను. బసవడు దిగి   అచ్చట మరొక ఫోక్స్ వాగన్ ఆగియుండుట  గమనించి అగస్త్యుని దగ్గరకి పిలిచి " ఇప్పుడు చిన్న తమాషా చేసెదను చూడుమని ఆ వాహనమువద్ద  వేచి యున్నసారధి తో " మీ యజమాని సుందర్ గారు నిన్ను పైకి తీసుకురమ్మని చెప్పినారు " అనెను  " అందుకు ఆ వాహన సారధి  " సుందరు గారు ఎవరండీ , మా యజమాని శ్యాం గారు అనెను. అగస్త్యుడు బసవడు ఇద్దరూ భవనము ఐదవ అంతస్తు చేరుచుండగా బసవడు పిల్లివలె నడుచుచు దక్షిణామూర్తి గదివద్దకుచేరి  నక్క వలే నక్కి  గోడకు చెవులు ఆయనించి వినుచుండెను.   అగస్త్యుడు " ఏమిరా ఇట్లు గూఢ చారివలె ప్రవర్తించుచూ  పోలీసు అధికారివలె చాకచక్యము చూపుచున్నావు." అనెను. ఉష్ .. నిశ్శబ్దము.... ఈ చిన్న చిన్న కిటుకులతో పెద్ద ఫలితములు సాధించవచ్చు. వారేమి మాట్లాడుకొను చున్నారో వినవలెను. 

 నీకొడుకు వచ్చునప్పుడల్లా లక్షలు లక్షలు దోచిపెట్టి ఆ డబ్బుతో వాడేమి చేయుచున్నాడో ఎన్నడైనా అడిగినారా ? నేడు నేను  ... పై సంతకములు పెట్టమన్నచో  ..  చేయుచున్నారు. ఈ సంస్థ  1000 కోట్ల సంస్థగా  ఎదుగుటకు గ్రేస్ గారి కృషి మీరెరుగనిది కాదు. దక్షిణామూర్తి ఏదో మెల్లగా మాట్లాడు చున్నాడు ఓవర్ సబ్ స్క్రిప్షన్ మొత్తమును  మూడు నెలలలో  తిప్పి ఇవ్వనిచో న్యాయపరమైన చిక్కులలో... 

కొత్త పేక్టరీ కోరకెందుకు  తొందర పడుచున్నావు , జిలేబీ  నేనాడిటరుతో మాట్లాడవలెను. 

 "హు! నన్ను నమ్మలేనివాడు  మంచము మీదనుంచి దిగలేనివాడు నన్ను జిలేబీ అనుచున్నాడు."   

ఆడిటరుతో మాట్లాడి మీరు చేసెడిది ఏమియునూ లేదు , ఆడిటర్ మీకు లెక్కలు వివరించిననూ మామ్మాపలేడు మేము డైరక్టర్స్ అని తెలుసుకొనిన్న మంచిది 

 శ్యామ్ నాకే మంచి చెడ్డలు చెప్పుచున్నావా!  అదియునూ చూచెదను, నేను సి ఈ ఓ  మరియు బోర్డు ఆఫ్ డైరక్టర్స్ కు చైర్మన్ అని మరిచినారా? నేను రోగినైననూ  నాకొక కొడుకున్నాడు వాడిక్కడే యుండి ఈ వ్యవహారము చెక్కబెట్టి యే పోవును.  అని దక్షిణామూర్తి గది  దద్దరిల్లునట్లు అరిచెను.   గ్రేస్ ఇద్దరూ పగలబడి నవ్వి బయలు దేరినారు. బసవడు  అగస్త్యుడు వారు లిఫ్ట్ లో ప్రవేశించు వరకూ నక్కి వారి కారు బయలుదేరుట మెడపైనుండి చూచి లోపలకి  ప్రవేశించారు. దక్షిణామూర్తికి మరల ఛాతిలో నొప్పి పెరిగెను. బసవడు వెంటనే ఆంబులెన్స్ ను రప్పించి ఆసుపత్రికి తరలించగా అచ్చట హృదయాలజిస్ట్ దక్షిణామూర్తికి వైద్యము చేసి.  అతడు విశ్రాంతి  తీసుకొనుచుండగా బయటకు వచ్చి   బసవడిని చూచి వీణావాయించు న్నట్లు గాలిలో చేతులు మీటుచూ  మదన గోపాలా యని పాడుచూ పార్వతివలె   నటించుచుండగా బసవడు అగస్త్యు లకు వేయి ఏనుగుల బలము వచ్చెను. దామినితో సహా అందరూ కలసి వర్షుని ఇంటికి మంజూష పెళ్లి చూపులకు బయలుదేరిరి. 


Wednesday, December 2, 2020

Bharatavarsha 85

 మీనంబాకం విమానాశ్రయము: ప్రాతః కాలము 6. 00 గంటలు;  కామరాజ్ టెర్మినల్ ఇండిగో విమాన ప్రయాణీకులతో నిండి యున్నది. బసవడు సోఫాపై వాలి పార్వతి చిత్రములను చూచుచూ మైమరచి ఆమె వీణావాదనమును తన చరవాణి స్వరముగా ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము పలుమార్లు వినుచున్ననూ చాలకున్నందున మరల ఆమె బల్లిపాడులో చేసిన వీణావాదన సంక్షిప్త చలన చిత్రమను కాంచుచూ ఆమె కన్నుల సోయగమునందు కరగుచుండెను. ఇంతలో 

“This is the final boarding call for passenger Basava booked on flight 372A to Visakha City.  Please proceed to gate 3 immediately. The final checks are being completed and the captain will order for the doors of the aircraft to close in approximately five minutes time. I repeat. This is the final boarding call for Basava Thank you. ప్రకటన ముగియుచుండగానే బసవడు విమానము వద్దకు పరిగెత్తెను.

కిటికీవద్ద తన ఆసనమును కనుగొని సుఖాఆసీనుడై విమాన సేవకురాలు, ఆతిథ్యదాత అతడిని చూచి నవ్వగా అతడు కూడా మందహాసము చేసెను. ప్రయాణీకులందరూ సర్దుకు కూర్చొని బాతాకానీ చెప్పుకొనుచుండిరి. ఇంతలో విమాన ద్వారము మూతబడి బిగించబడెను.

Ladies and gentlemen, welcome onboard Flight from Chennai to Visakha. We are currently third in line for take-off and are expected to be in the air in approximately seven minutes time. We ask that you please fasten your seat belts at this time and secure all baggage underneath your seat or in the overhead compartments.  Please turn off all personal electronic devices, including laptops and cell phones. Smoking is prohibited for the duration of the flight. Thank you for choosing indigo Airlines. Enjoy your flight.

బసవడు రెండు వరసల ముందు నున్న స్థానమందు కూర్చొని తననే చూచుచున్న యువకుని చూచి " ఓరీ రాఘవా ! అని అరిచి తన నడుము బిగింపు సడలించుకొని అతడి కడకేగెను. ఏరా దున్నపోతా ఎంతసేపు చూడవలెను ఏ లోక మందుంటివిరా ? రాఘవ పక్కనున్న ప్రయాణీకుని బుజ్జగించి వెనుక నున్న బసవడి స్థానమున కంపి బసవని చెంత 

చేర్చుకొనెను. బసవడు బల్లిపాడు విషయములను తెలుపుచుండగా “There are six emergency exits on this aircraft. Take a minute to locate the exit closest to you. Note that the nearest exit may be behind you అనుచూ ఒక సేవకి రక్షణ సూచనలిచ్చుచుండగా మరొక సేవకి వాటిని చేసి చూపుచుండెను

Oxygen masks will drop down from above your seat. Place the mask over your mouth and nose, like this. Pull the strap to tighten it. వీరికి పైలెట్లతో సంభందములుండునుకదా అని రాఘవుఁడడగగా “చాలావరకు ఉండునని వారు కలసి పడుకొందురని విన్నాను”  “వీరు ఐదు నక్షత్రముల హోటల్స్ లో బసచేసెదరని అనుచుందురు నిజమేనా?” “నిజమే సంస్థ డైరెక్టరుకు కూడా లేని ఈ సదుపాయము వీరికి కలదు, ఖర్చంతయూ సంస్థేభరించును”   

క్రూ ఆన్ బోర్డ్  కెప్టెన్ విక్రమ్ సింగ్ , కెప్టెన్ సుందరి ఫ్లైట్ అటెండంట్స్  రీనా , రీతూ అని చెప్పి ముగించెను. సుందరి పేరు వినగానే బసడి కళ్ళు వెలిగెను. విమానము పరుగు మొదలిడెను.  ఒక చీటి వ్రాసి అటునిటు తిరుగుచున్న యువతిని బ్రతిమాలి చీటి లోపలికంపను. కాస్సేపటికి సుందరి వచ్చి అతడిని కాకిపిట్ లోనికి కొనిపోయెను. 

సుందరిని ఆ యూనిఫామ్  నందు చూసి బసవడు సంతోషించెను కెప్టెన్ సింగ్ కూడా మితముగా నైననూచక్కగామాట్లాడెను. అప్పుడప్పుడూప్రకటనలు చేయుచూ “ఫ్లైట్ అనౌన్సమెంట్స్ ను ఫ్లైట్ డెక్ అందురు” అని తెలిపెను. బసవడు “వివాహమైనదా?” అని సింగ్ ని అడగగా ఎయిడ్స్ కారణముగా డివోర్స్ నడుచుచున్నదని తెలిపెను. బసవడులిక్కి పడెను.    పైలెట్స్ లో AIDS – Aviation Induced Divorce Syndrome అని వ్యవహరించెదరు. అని సుందరి తెలపగా నవ్వులు విరిసినవి. మా ఉద్యోగ సమయములకు వెగటుబట్టి 30 శాతము భార్యలు విడాకులు కోరుచున్నారు అని కెప్టెన్ సింగ్ అనెను.

   Good afternoon passengers. This is your captain Sundari speaking. First I'd like to welcome everyone on Rightwing Flight 372 A. We are currently cruising at an altitude of 33,000 feet at airspeed of 400 miles per hour. The time is 7:15 am. The weather looks good and with the tailwind on our side we are expecting to land in Visakha approximately in fifteen minutes. We are ahead of schedule. The weather is sunny and the temperature is 25 degrees. If the weather cooperates we should get a great view of the city as we descend. I'll talk to you again before we reach our destination. Until then, sit back, relax and enjoy the rest of the flight. కాక్ పిట్ నుండి బయల్వెడలి బసవడు రాఘవ ప్రక్కన చేరెను.

                                               ***

విశాఖపట్నం విమానాశ్రయము: ఆశాకమునుండి బంతివలె బసవాడూడిపడుట, వానిని ఆటస్థలమందు బంతిని పట్టినట్టు అగస్త్యుడు ఒడిసిపట్టుట, జరిగిన పిమ్మట ముగ్గురు మిత్రులూవిమానాశ్రయమందే ముచ్చటలాడుకొని మురియుచుండగా బసవడు సుందరి గూర్చి తెలిపి ఆమెతో  విమానమందు దిగిన చిత్రమును చూపెను. "ఎంత ఆదరణ కాకిపిట్ నందుకు కొనిపోయి తన చెంత కూర్చొండబెట్టుకొనెను. సొంత అన్న వలె భావించి ఆప్యాయతను కురిపించెనని చెప్పుచూ బసవడు భావావేశమునకు లోనయ్యి ఆశుకవితాధారామృ తమును కురిపించెను. 

సుందరాభిదే చారుగుహే చారుశీలే అసమ వైమానికే ఆకాశ గమనే 

మిత్రప్రియే మనోరమే అతిథి సత్కార పండితే దండువుడుపు మండితే 

చారు సంవాదాభిరామే జితకాశి నే, జీమూత వాసినే, నమస్తే నమః 

"అని బసవడు అనగా అగస్త్యుడు "నీ ఆసు కవితకు సంస్కృత చంద మబ్బేనే, బాగుగానే ఎదుగుచున్నావు!"  అని మెచ్చుకొని "అటువంటి పిల్ల జీవితమున ఉండిన జన్మ ధన్యమగును కదా" అని అనెను. ముగ్గురూ అగస్త్యుడి వాహనమువద్దకు పోయిరి, "వాహనము పాతదివలే నున్నది" "అవును 1962 నాటిది" ముగ్గురూ లోపల కూర్చొనగా కారు కదిలెను. 

బసవడు “అగస్త్య ఇక చెప్పుము, ఏమా నిన్ను వేదించుచున్న అంతుచిక్కని రహస్యము?”

ఒక్క ముక్కలో చెప్పునది కాదు నేను విశాఖ వచ్చి రెండు వారములుగా గమనించుచున్ననూ అంతుచిక్కకున్నది. మానాన్నగారి ఆరోగ్యము క్షీణించుచున్నది . గఆయన భార్య తో విభేదించి గుండెపోటు కొని తెచ్చుకొనెను. వ్యాపారము కూడా దిక్కుతోచని పరిస్థితిలో నున్నది. 

నీ వీ పాత కారు వాడుట చూసినప్పుడే అనుకొంటిని 1962 వ సంవత్సరపు కారు వాడుచున్నావంటే చాలా బాధ కలిగినది. అని రాఘవుడనెను 

అగస్త్యకి తాప  క్రోధ హాసములు ముప్పిరిగొన్నవి " నేనుచెప్పిననూ నీకర్థము కాదు గానీ ఒకసారి  62 వ సంవత్సపు  ఫెర్రారీ  ధర చూసి చెప్పా గలవా ?

రాఘవుడు గూగుల్ తెరచి ఫెర్రారీ 1962 తయారీ ధర అని అన్వేషించగా 48 మిలియన్ డాలర్లు అని చూపగా , కంగారు పడి మరల మరల సరి చూచుకొని 48 మిలియన్ డాలర్లు అనగా ఎన్నిరూపాయలని మార్చి చూడగా 3,53,86,82,400.00 సంఖ్యను చూపెను , మొట్టమొదట వారు 35 కొట్లాయని గుడ్లు తెల్లవేసి పిమ్మట 340 కోట్లని తెలుసుకొని గుండె చిక్కబట్టుకొనిరి. అగస్త్యుడు కారాపగా దిగి కారుని తడిమిచూచి ముద్దాడి ఛాయాచిత్రములు గ్రహించి మరల కారులో కూర్చొనిరి. వ్యాపారము పది రేట్లు పెరిగెను కానీ భాగస్వామ్య వ్యాపారము గా మారిపోయెను. ఎదో కుట్ర  జరుగుచున్నది. మా నాన్న గారి అనారోగ్యము వెనుకకూడా అంతుచిక్కని రహస్యమున్నది. ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి రాజ్యమేలుచున్నది ఇప్పుడు నమ్మకస్తులు కావలెను అందుచే నీ సహాయము కోరి నిన్ను పిలిచితిని. మీ సంస్థ వ్యాపారము ఎన్ని కోట్లుండును. నాలుగు కోట్లనుండి నేనెరుగుదును , నేడు వంద కోట్లు దాటినది.  వంద కోట్ల సంస్థ యజమానికి  300 కోట్ల కారు ఏలనో ?  అప్పు చూపుటకు కొన్నట్లు ఆమె చెప్పుచున్నది.

 రాఘవుడు  “ఈ లెక్కన నీవు విశాఖ పట్టణమున అత్యంత ధనికుడవు వలె నున్నావు” 

అది నాకు తెలియకున్ననూ అత్యంత దరిద్రుడను నేనే , ఒక వైపు తల్లి కనిపించదు , ఒక వైపు తండ్రి ఇట్లాయెను , అతడి కళ్ళలో నీళ్లు తిరిగుచున్నవి , మరొక వైపు .. చెప్పలేక రోధించుచుండెను. నాకు పట్టెడన్నము పెట్టువారు లేరురా! 

 కారు మాఇంటికి పోనీయకున్న మర్యాద దక్కదు, బసవడు ఖంఠము అగ్గిపిడుగువలె ధ్వనించెను. కారు బసవడింటి మార్గము పట్టెను. “నీ సమస్యకి పరిష్కారము  నేను చూపలేకున్ననూ , సమస్యకు మూలమెవరో తేల్చెదను. అని బసవడు హామీ ఇచ్చెను.”         

“రాఘవా!చెన్నపట్నమెందులకేగినావు విశాఖపట్నమెందుకొచ్చినావు "నాసమస్య ఏమని చెప్పవలెను జీవన మరణ సమస్యగా నున్నది నా ఎలక్ట్రానిక్స్ సంస్థకు డబ్బు ముడి సరుకు తో పాటు అన్నీ సమస్యలే, సాంకేతికజ్ఞానమున్న మనిషి తక్షణము కావలెను. చెన్న పట్టణమునకు పోయి అచ్చట నున్న ఒక ఎలక్ట్రానిక్స్ సంస్థను సందర్శించితిని వారి పద్దతి పరిజ్ఞానము నవలంభించి ఉత్పత్తి చేసినచో ఖర్చు సగము కలిసి వచ్చును. సందీపు ని వద్ద సృజనాత్మకత కలదు కానీ వాడు చిల్లరగాతిరుగుచూ ఇవేమియూ పట్టించుకొనకుండెను. సందీపుడున్న ఈ కష్టము గట్టెక్కును కానీ వాడు ఒక వారము రోజులుగా దూరవాణికి కూడా దొరకుండెను. సంస్థకు రోజులు దగ్గర పడినవి. ఇంటికి పోయి అమ్మను నాన్నను చూడవలెను, ఆపిమ్మట సందిగాడి విషయమేమో చూడవలెను అందుకే విశాఖ వచ్చితిని” 

“అయ్యో నేను సాఫ్ట్ వేర్ కాకున్నచో నీకు సాయము చేసెడివాడిని.” “బసవా నీ తెలివితేటలు నే తట్టుకొనేజాలను, అని రాఘవుడనగా ముగ్గురూ నవ్వుకొనిరి. “ఇదియునూ ఒక కష్టమేనా!” అని బసవడనెను. అటుపిమ్మట   “నీ సమస్య ఏమి?” అని బసవని రాఘవుడుడిగెను. “పార్వతి నిచ్చుటకు ఆమె తల్లి చంద్రమతి అప్పుడు అంగీకరించెను కానీ నేడు పార్వతి నాతొ మాటలాడుటకు కూడా అనుమతించకుండెను.” అగస్త్య, రాఘవ పడీపడీ నవ్విరి.