Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, June 20, 2020

Anveshana 2020 -Scene 14

జేమ్స్ కి రెడ్ జీప్ ఆఫర్ చేసింది రెజీనా. వద్దని డిపార్ట్మెంట్ జీపులో పోదాం అన్నాడు.  జేమ్స్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చుంది రెజీనా, అసలు వెనకాల కూర్చుందామనుకుంది కానీ బాగోదు కదా. జేమ్స్ గురించి పూర్తిగా మంచి అభిప్రాయం లేదు. కానీ చెప్పుడు మాటలు విని ఒక నిర్ణయానికి రాకూడదు కదా అనుకుంది. జీప్ అడవిలోకి దూసుకు పోతోంది. రెజీనా కార్తీక్  గురించి ఆలోచిస్తున్నాది.  "రెండురోజుల్లో నిన్ను కలుస్తాడు" అన్నాడు జగపతి. అవేమాటలు చెవుల్లో మరల మరల మారుమోగుతున్నాయి.  కార్తీక్  ప్రేమ చలికాలం సూర్యుడులాగా వెచ్చగా ఉంటుంది. వేసవికాలం వెన్నెలలా చల్లగా ఉంటుంది. బాటసారికి చెట్టు నీడలా హాయిగా ఉంటుంది.కార్తీక్ ని చివరిసారి కలిసింది అడవిలోనే. మళ్ళీ  అడవిలోనే కలుస్తున్నాను.  అసలు కార్తీక్ని ప్రేమించి, ప్రేమించిన వ్యక్తి మాట నమ్మలేక  వదులుకున్నానేమో. ఈసారి కలిసినప్పుడు ఎలా ఉంటాడో ? రెజీనా  ఆలోచనలలో ములిగి పోయిన సంగతి కనిపెట్టిన జేమ్స్ " ఓ మేడమ్ ఎక్కడికెళ్ళిపోయారు?"  అన్నాడు చిటికేస్తూ. రెజీనా నవ్వింది. జేమ్స్ కూడా నవ్వాడు. 
 అడవికి  ఎవరో వస్తున్నారు అన్నాడు జగపతి ఎవరు అది ? అన్నాడు జేమ్స్. ఎవరో ఆర్నిథాలజిస్ట్ అట. " ఓహో ఇక  మీద అడవిలో ఇద్దరు అమ్మాయిలు తిరుగుతారన్నమాట "  అమ్మాయి కాదండి అబ్బాయి"అంది రెజీనా. అబ్బాయా ? "దెబ్బయిపోయాడు  జేమ్స్ మొఖం మాడిపోయింది. తనతో పనిచేయబోయేది అబ్బాయి అని తెలిసి.తనలో అనుకుంది రెజీనా .  జేమ్స్ రోడ్  చూస్తూ నడుపుతున్నాడు. రెజీనా జేమ్స్ మొఖంలోకి చూసింది ,  జేమ్స్ అందగాడు, హుందాగా గాడు. హి ఐస్ అ జెంటిల్మన్ విత్ ఆ వీక్నెస్అ నిపించింది. అది అవునా కాదా అనేది     తెలుసుకోడానికే  ఈరోజు అడవికి బయలుదేరింది.

జేమ్స్ , మేము కొన్ని  స్పాట్స్ చూసాము, అవిమీకు తెలుసా అంటూ ఎదో చెప్పబోయింది రెజీనా. " చూడండి    నేను అంత కన్నా మంచి స్పాట్స్ చూబించగలను అన్నాడు జేమ్స్. "నేను అదే అంటున్నాను , వేరే ఎక్కడికైనా ,  కానీ  చెరువు వాటర్ ఫాల్ మాత్రం చూద్దాం" అంది రెజీనా. "చెరువు ఓకే , కానీ వాటర్ఫాల్స్ వైపు వంటరిగా రావద్దు."అన్నాడు జేమ్స్.  "కానీ ఇప్పుడు మీరున్నారు కదా ? " అంది రెజీనా. "నేనుంటే పర్వాలేదు  ఈ ఫారెస్ట్ లో నాకు తెలియకుండా చీమ చిటుక్కు మనదు."  అన్నాడు.

జీప్ ఆపండి ఆపండి అంది రెజీనా. అక్కడ చుట్టూ కొండలు వాటి మధ్య లోతైన ప్రదేశం , కొండలని తాకుతున్నట్టు మేఘాలు. సమ్మోహనంగా ఉంది సీనరీ. జేమ్స్ జీప్ ఆపాడు. రెజీనా చిన్నపిల్లాడు తిరునాళ్ల కెళ్ళినట్టు వింతలన్నీ ఆస్వాదిస్తూ ఫోటో లు తీసుకుంటున్నది. కానీ జేమ్స్ మాత్రం ఆమె అందాలని ఆస్వాదిస్తున్నాడు.
ఈ కొండ వెనక ఏముందో తెలుసా అని అడిగాడు జేమ్స్ ఫోటోలు తీసుకుంటున్న రెజీనా దగ్గరకొచ్చి.  తెలీదు అంది. వాటర్ఫాల్స్  మీరు నిన్న  చూసిన వాటర్ఫాల్స్ ఈ కొండల వెనక ఉన్నాయి. వ్వావ్ , రియల్లీ ! మనం ఇంకోతోవలోంచి వచ్చాము , అంటే వెనక నుంచి వచ్చాము. అలా వాటర్ఫాల్స్ , చెరువు రెండు చూసారు  ఆమె రికార్డింగ్ పూర్తి చేసుకుంది. ఆమె రికార్డింగ్ చేస్తున్నంతసేపు జేమ్స్ ఆమెనే చూస్తున్నాడు. రెజీనా కూడా గమనించింది.  అలా కొన్ని ప్లేసెస్ తిరిగారు , ఒక చోట రాలిన  ఆకుల  గలగలలు , మరొక చోట సెలయేటి గలగలలు, కొన్నిచోట్ల ఫారెస్ట్ గెస్ట్ హౌసులు కూడా ఉన్నాయి. ఇక్కడికి పక్షులు వస్తాయా అంది రెజీనా? వస్తాయి కానీ వేరే రకమైన పక్షులు అన్నాడు జేమ్స్.  అంటే అంది రెజినా అర్ధం కానట్టు మొఖం పెట్టి. " అదేనండీ ప్రేమ పక్షులు " అంటూ సిగరెట్ వెలిగించి, జీప్ వైపు నడిచాడు. ఇద్దరు జీప్ ఎక్కారు. జీప్ బయలు దేరింది  " ఈ రోజు రికార్డింగ్ బాగా అయ్యింది. ఈరోజు చాలా నడిచాం కూడా  షిన్రిన్  యోకు  అంటే  ఫారెస్ట్ బాత్." అంది.  షిన్రిన్  యోకు మంచి కాన్సెప్ట్ అన్నాడు.  జీప్  బయలు దేరింది ఎలిఫెంట్ సఫారీ లోంచి  వెళ్ళింది జీప్. కొంచెం సేపు ఆపి మల్లె పోనిచ్చాడు.  ఈ సారి ఆవాల చేలు,  పూలతోటలు వచ్చాయి.   కాస్సేపు జీపు మల్లె ఆగింది. రెజీనా ఫోటోలు తీసుకుంది.    టైం పన్నెండు అవుతోంది. రెండు గంటలకి ఇంటికి చేరగలమా? అంది రెజీనా.  అంత కన్నా త్వరగా చేరగలము ఎంతసేపట్లో చేరతామో గెస్ చేయి. ఏకవచనం లోకి వచ్చేసాడు.  రెజీనా థాంక్స్ జేమ్స్ అంది.   దట్ ఐస్ పెర్ఫెక్ట్ , జేమ్స్ అనిపిలిస్తే చాలు ఈజీగా ఉంటుంది."ఒకే జేమ్స్ ఈరోజు అన్నీ చాలా చూసాము,  అన్నీ  మనోల్లాసాని  కలిగించేవే నిన్న ఇవన్నీ ఏవయిపోయాయో? "  అంది  రెజీనా.
జీప్ ఆగింది  పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ . ఇక్కడ ఏమీ లేవుగా ఎందుకు ఇక్కడ ఆపారు అంది. పదండి  చూద్దురుగాని తినబోతూ రుచి అడగటం ఎందుకు.   అక్కడ  చూసిన దృశ్యం శరీరంలోకి విద్యుత్తరంగాలను పంపింది.   అన్నీ   మనోల్లాసాన్ని కలిగించేవే అన్నారు కదా మదనోత్సాహాన్ని కలిగించేది  చూబించాను.  ఇది కపుల్ కి బాగుంటుంది. అంది అది సరే ఇంకా ఎంతసేపులో బంగాళా  చేరతాము . చెప్పుకో  అన్నాడు జేమ్స్.  "ఉమ్ .. థర్టీ  మినిట్స్ "  నో  మనం వచ్చేసాం చీతా స్ఫోటికి డయాగ్నల్ గా ఉన్నాం.  ఇదే నా గెస్ట్ హౌస్ , నువ్వు  ఎప్పుడైనా రావచ్చు ,రావాలి  అని నా కోరిక ఆహ్వానం. 5 నిమిషాలలో జీప్ బంగాళా చేరింది.

మధ్యాహ్నం అంతా కలిసి లంచ్ చేశారు. అనసూయ అడవి పరిచయం అయ్యిందా అంది. అయ్యింది రోజు రోజుకీ కొత్తగా కనిపిస్తోంది.  జేమ్స్ బాగా తిప్పేడు అనుకుంటాను? అంది అనసూయ . జేమ్స్ గురించి ఏవో అనుకున్నాను కానీ మంచివాడే, అన్నీ చాలా సులభంగా  చూబించాడు,   త్వరగా తీసుకొచ్చాడు. అంది . " అంతే రా ఉదయం నుంచి రాత్రి దాకా రిస్క్ తీసుకున్నవాడికి కష్టబడినవాడికి లేని గుర్తింపు  ఆ రేంజర్ కొట్టేసాడు " అన్నాడు గిరి.          " ఎంతకైనా రేంజర్ కదా , అతని రేంజే వేరు " అన్నాడు సత్య.  "ఎహ్ , ఊరుకోండి  గోల గోల, అతను వేరు మీరు వేరు."  "అదే ఏరకంగా వేరు?" అన్నాడు సత్య. "అబ్బా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా మనమంతా ఒకఇంట్లో ఉండేవాళ్ళం , మనమంతా  ఒకటి." అంది రెజీనా " అబ్బా చక్కగా చెప్పేరు మేడమ్  ఈ మాట అనసూయ అంటే ఎంత బాగుండేదో ..." అని  సిగ్గుతో మురిసిపోతుండగా "  వేడి పులుసు గరిటె సత్య చేతిమీద పెట్టి ఈ లోకంలోకి తీసుకొచ్చింది అనసూయ.  అంత భోజనాలు ముగించిన తరువాత రెజీనా అంది " జగపతి గారు కూడా ఉంటె ఎంత బాగుండేదో, అవును జగపతిగారికి ఎంతమంది పిల్లలు " అంది రెజీనా. ఒక్కడే కొడుకు అంది అనసూయ.  నీకు అన్నదమ్ములు ఎంతమంది అంది  అనసూయ, ఉంటె బాగుండేది నేను ఒక్కత్తినే అంది రెజీనా .  నాగురించి పక్కనపెట్టు , నెమలికి పిల్లలులేరా ? చాలా ఆశక్తిగా  మళ్ళీ.  " అడగకపోయావా ఆమెనే ? " అంది అనసూయ. "ఎందుకులేరు ఒక్క కొడుకు ఉన్నాడు కొడైకెనాల్ లో సోలెయిల్  ఇంటర్నేషనల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. " అన్నాడు సత్య  "అబ్బా నీకు చాలా తెలుసే "  అంది రెజినా. " మొత్తం బయోగ్రఫీ చెప్పేస్తాను " అన్నాడు సత్య గర్వంగా.  గిరి పెద్దగా నవ్వేడు , నెమలి బయోగ్రఫీ ఎవరికైనా తెలుస్తుంది , అని గట్టిగా అని  అను గురించి చెప్పగలవా? అని సత్య చెవిలో అన్నాడు.  సత్య బిక్కమొహం వేసాడు . "మేడమ్  అడిగితే నెమలి ఏదైనా  చెప్పేస్తుంది , కానీ ఆవిడ చేప్పేవేవీ నమ్మడానికి వీల్లేదు. అన్నాడు గిరి.  రెజీనా నవ్వుతుండగా , గిరి లేచాడు "నిజం మేడమ్ , అడక్కుండా ఎవడైనా వాడి గురించి చెప్తున్నదంటే అవి ఏడ్స్ , అస్సలు నమ్మక్కరలేదు , అడగ్గానే చెప్పేసేడు  అనుకోండి  అది నమ్మగూడదు ఎందుకంటే అవి నిజాలు కావు, నిజం ఎవ్వడూ చెప్పాడు మనం తెలుసుకోవాలి. "  హాహా హ్హహ్హ హ్హ. అని రజినీకాంత్ నవ్వు నవ్వి టేబుల్ దగ్గరనుంచి సినిమా పక్కీ లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సాయింకాలం నెమలి ఇంటికి వెళ్ళాలి కొంతసేపు పడుకుంటాను అని రెజీనా మేడ ఎక్కేసింది. 

మత్తుగా నిద్ర పట్టేసింది.  లేటుగా లేచింది . లేచేటప్పటికి , సూర్యుడు పడమటి  కనుమల్లోకి కుంగుతున్నాడు . సాయింకాలం పొద్దుకుంగుతుండగా చీరకట్టుకుని, తయారయ్యింది. పెద్ద కిటికీలోంచి ఆకాశం లో అరుదైన  అరోరా వర్ణం కనిపించింది.   మైమరిపించే నెమలి పించం రంగు చూసి ఒక్క ఫోటో తీసుకోవాలనిపించింది. బాల్కనీ లోకి వెళ్ళింది. రెండు ఫోటోస్ తీసుకున్నతరువాత కాలికి ఎదో తగలడం గమనించి , కిందకి చూసింది. ఒక పేపర్ బాల్. తీసి చూసింది. ఇది ఇక్కడి కెలా వచ్చింది అనుకుంటూ విప్పింది " ప్రాణాలమీద ఆశ ఉంటె వాటర్ఫాల్స్ వైపు వెళ్ళద్దు." అని రాసి ఉంది.  ఆకాశంలో అరోరా సుడులు మెల్లగా విడిపోయి మామూలు పాలిపోయిన ఆకాశం  కనిపించింది  .  ఆమె ముఖంలో సంతోషం వర్ణాలు అన్ని మాయమయ్యి  ముఖం ఖాళీ అయి  పోయింది. ఎదో ప్రమాదం  జరుగుతుంది అని కాదు. ఎవరో తనను ఫాలో అవుతున్నారు. ఎవరు ? ఎందుకు ?  పేపర్ బాల్ బేగ్లో వేసుకుని నెమలి ఇంటికి బయలుదేరింది.

నెమలి ఇంటికి వెళ్ళేటప్పుడు సత్య గిరి వస్తాను అన్నారు కానీ అక్కరలేదు అని నడుచుకుంటూ వెళ్ళింది రెజినా . వెళ్లేసరికి నెమలి సోఫాలో కూర్చొనివుంది. చేతులో పుస్తకం " ది మిస్టరీ ఇన్ ది ఫారెస్ట్"  బై  కెన్ షోర్. సమగ్గా సిట్యుయేషనల్ సాంగ్ లాగ ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు ఉంది ఆ పుస్తకం టైటిల్.   రా రా వచ్చేవా , రావనుకున్నాను అంది నెమలి. సారీ , లేట్ అయ్యాను. అందరు వచ్చి వెళ్లిపోయారు అనుకుంటాను అంది రెజినా. " అదే మంచిది అయ్యింది , అది అడవి పండుగ నువ్వు చూడగలవు పొద్దున్న చూసినట్టు చూడగలవు. పార్టిసిపేట్ చేయలేవు, అలా తొందరగా వచ్చి ఉంటె ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేదానివి. రెజీనా సోఫాలో నెమలిపక్కనే కూర్చుంది " సరే ఇప్పుడు కార్యక్రమం ఏంటి? అందరూ వచ్చి ఏంచేశారు? మళ్ళీ పొద్దున్న పాడినట్టు  పాట  పాడరా? పొద్దున్నపాట చాలాబాగుంది." అంది రెజినా.  "నీ పాటలపిచ్చి పాడు గాను, అంత  నచ్చిందా పాట?  ఈ సాయంకాలం విత్తనాలు , తాము దాచుకున్న అటవీ ఉత్పత్తులు ఒకరికొకరు బుట్టలో ఇచ్చుకుంటారు. అని తనకి వచ్చిన బుట్టలు చూబించింది." నెమలి. ఈ అడవి ఈ కల్చర్ ఇక్కడ జీవితం నాకు బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోవాలన్నంతగా నచ్చాయి , కానీ .. అని ఆగిపోయింది.   నెమలి పరిస్థితి అర్ధం చేసుకుంది , నువ్వు కొంచం రిలాక్స్ అవ్వాలి తర్వాతా అన్నీ మాటలు వాటంతట అవే వస్తాయి , పద నా బెడ్ రూమ్ లోకి వెళదాం అంది. " ఇద్దరు నెమలి బెడ్ రూమ్ లోకి వెళ్లి మంచం మీద కూర్చున్నారు.  మీ ఆయన లేరా?  అడవిలో ఉన్నాడు.  చీకటి అయిపొయింది కదా ఇంకా రాలేదా ??  ఆయన వెళ్ళింది ఇప్పుడే.     ఇంతలో ఎవరో తలుపు కొట్టారు , పట్టాభి వచ్చి ఉండాలి అంది రెజీనా . అతను అయితే తీసిఉన్న తలుపు కొట్టడు. నీకోసం వచ్చి ఉంటారు అంది నెమలి.

 ఇద్దరూ హాల్ లోకి వచ్చారు , గిరి సత్య తలుపు దగ్గర నిలబడి ఉన్నారు , " అంటే ఆలస్యమైపోతుందని అనసూయ అంటే  రెజీనాని తీసుకెళదామని వచ్చాం." ఇద్దరూ ఒకేసారి అన్నారు.  "ఎంత కరెక్ట్ గా గెస్ చేసింది! తెలివైనది అని  తెలుసు కానీ  ఇంత షార్పా! అని రెజీనా మనసులో అనుకుంటుండగానే డోర్ పక్కనే  గోడకి ఫిక్స్ చేసి ఉన్న టెలిఫోన్ తీసి " అనూ, రెజీనాని నేను తీసుకు వస్తాను, ఒక గంట పడుతుంది  యు డోంట్ వర్రీ  " అని పెట్టేసింది. మరో చేత్తో డోర్ వేసేసింది. మరుక్షణం బెడ్రూమ్లో ఉన్నారు ఇద్దరూ.  సడన్గా రెజినా దృష్టి ని కంప్యూటర్ పక్కన  ఉన్న చాక్ పీస్ సైజ్ లో ఉండే పుల్లముక్క ఆకర్షించింది. అది పుల్ల ముక్క కాదు పొద్దున్నే అదే వస్తువు ఎక్కడో చూసింది. అవును జేమ్స్ చేతిలో చూసింది. జీప్ నడుపుతూ జేమ్స్ సిగరెట్ కాల్చాడు. అది సూపర్ స్లిమ్ బ్రౌన్ సిగరెట్. మామూలు రెగ్యులర్ సిగరెట్ కాదు.  రెజీనా బుర్ర పాదరసంలా పని చేసింది . పట్టాభి సిగరెట్లు కాలుస్తారా అంది.

దానికి సమాధానంగా కంప్యూటర్ టేబుల్ మీదనున్న సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని దిండు కింద నుంచి లైటర్ తీసి అంటించింది. ఒక్క దమ్ము లాగి వదిలింది.  తన డౌట్ ని మోస్ట్ ప్రాక్టికల్ గా క్లియర్ చేసింది. అనుకుంది. నువ్వు సిగరెట్లు తాగుతావా ? రెండో ప్రశ్న వేసింది ? ఆస్ట్రేలియా లో ఉండేటప్పుడు జె పీ ఎస్ తాగేదాన్ని , తర్వాతా  మార్ల్బోరో కాల్చాను , ఇండియా వచ్చిన తర్వాత సిజర్స్, గోల్డ్ ఫ్లెక్ , క్లాసిక్ మైల్డ్ కాల్చాను ఇప్పుడు డన్ హిల్స్  కాలుస్తున్నాను  అంది నెమలి.  నిజంగా కాల్చకపోతే అన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పలేరు , కాబట్టి తన మూడవ డౌట్ జేమ్స్ ఇక్కడికి , అంటే నెమలి బెడ్ రూమ్ లోకి వచ్చాడని సందేహించవలిసిన పని లేదు. ఇలా ఆలోచిస్తుండగానే నీకో విషయం తెలుసా ఇవి లేడీస్ సిగరెట్స్ అంది. ఫారిన్ కంట్రీస్ లో ఆడవాళ్లు సిగరెట్స్ తాగుతారు.  ఇండియా లో అమ్మాయిలు సిగరెట్స్ తాగుతారా ? అంది ఇంతకీ నీకీ విషయం తెలుసా ఇండియా లో మెట్రో సిటీస్ లో 80 పెర్సెంట్ ఆడవాళ్లు ముఖ్యంగా యంగ్ విమెన్ తాగుతారు , రెండవ తరగతి సిటీస్లో అయితే 60 పెర్సెంట్ తాగుతారు, స్మాల్ టౌన్స్ లో 30 పెర్సెంట్ దాకా ఉంటుంది.   అన్నట్టు  నువ్వు అమెరికా లో ఉన్నప్పుడు......?  అని ఆపేసింది నెమలి.
అలవాటులేదు అంది రెజీనా . అంటే అర్ధం అప్పుడప్పుడు తీసుకున్నానని , థాంక్స్ ఫర్ ఆనిస్టి. నిజం ఇండైరెక్ట్ గా నైనా  చెప్పేవు అంది అవును నీ అంత ధైర్యం నాకు లేదు అంది. అప్పటికే రెండు గ్లాసుల్లో వైన్ నింపి ఒకటి రెజీనా కి ఇచ్చి ఒకటి తాను తీసుకుంది నెమలి . మెల్లగా చీర్స్  చెప్పుకున్నారు.  వైన్  హెల్ప్స్ ఫ్రెండ్షిప్ , మన ఫ్రెండ్షిప్  పెరిగింది ఇది ధైర్యానికి సంమంధించిన విషయం కాదు , రిలేషన్  షిప్ కి సమ్మదించినది. పరిచయం లేనివారితో పర్సనల్ విషయాలు చెప్పలేము కదా , అంటే ఇది మొహమ్మాటానికి సమ్మందిచిన విషయం, పెళ్లి అయినా మొగుడితో కొంత కాలం మొహమాటం ఉంటుంది. ఆ తరువాత ... అని నెమలి అంటుండగా ,అయ్యో  ఆపు అంది రెజినా. తర్వాతా నెమలి రెజీనాని బంగాళాదగ్గర  వదిలింది.  ఒక జత నల్ల బూట్లు వారిని ఫాలో అవుతుండడం వారు గమనించలేదు. రెజినా తన కొచ్చిన లెటర్ ని నెమలికి చూపించింది " ఇడెవడో చిల్లర వెధవ చేసిన పని ,  జేమ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాటివి ఏవీ నిన్ను చేరలేవు. " గుడ్ నైట్ . నెమలి ఒక్కతే బంగాళా నుంచి వెనుదిరిగింది.

                                                     End of scene 14




  

4 comments:

  1. Replies
    1. Thank you Sahitya Priya. There are 20 chapters in this story. who is following Regina is mystery. it will be revealed in chapter 19. How are the characters and their conversations? Are you enjoying? please post here your feelings.

      Delete
    2. Conversations are superb.But Nemali is not an ordinary woman sir. Really I am shocked. But what is the purpose of Nemali character in this story?

      Delete
  2. Nemali is accomplice of james. She enlightens and entertains the readers giving shock and surprise with her awesome philosophy of life.

    ReplyDelete