Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, June 24, 2020

Anveshana 2020 Scene 17

Regina started thinking about the people. Never before she had thought so much about the people around her. The sun was setting. The sky was ragged blaze of red and orang. She went near the window and gazed at the sky. She started soliloquizing. She had mixed feelings of fun surprise, horror and mystery.
 Had I seen a film or is it real? Is it felicity or serendipity ?
 Oh! the Hamlet fest was wonderful but my mind is not restful
 I was fortunate to visit the Hamlet but why Kartheek hasn't come yet?
 How robust was the ring mistress Chandri, the tall, jet black girl
 with unblemished equine muscle her aerial work was incredible
 She looked like much-praised masterpiece of  Michelangelo.
 I wish I had her  splendid charm. Her trapeze stunt was death defying,
 breath taking and of course nerve racking. It was a surprise
 in the beginning, horror in between, finally her story is heart breaking.
 Asiri shooting a nut on Chandri's head is hair raising.


No, no.. it's heartrending  their skills are venerable
but like candle in the wind they stand vulnerable
for the archer is amazing ambipedal
it could be luxury of bravery not the chicanery
but for the spectator it is certainly a dausterdly  temerity.
I may be prudish but her promiscuousness is outlandish
for sure James and Pattabhi are hand in glove
for aught I know they are a butcher and a lecher
Nemali's wit is immeasurable , her reasoning is impeccable
Is she oblivious or ignorant of her husband's night life?
Oh, Nemali is an enigma!! Anasuya is homely and comely.


The clock work in her head went whirrrrrrrr. So she was tossing and turning on the bed when Anasuya came. She entered Regina's room as usual with her characteristic bird songs" Hello birdie , how is the fest? Have you enjoyed the game my dear little bird?  said Anasuya. Her sweet affection gets sweeter with her dainty voice and her demeanor looks a bit saucy. Regina fixed her gaze on her attire  She looked beautiful but not coquettish like Nemali who has seductive looks. Nemali is extrovert while Anasuya is introvert who speaks without art.

ఇదిగో   పనసతొనలు తిను అంది ప్లేట్ అందిస్తూ. బాగున్నాయి ఎవరు తెచ్చారు? అంది రెజీనా. రస్సా  ఇచ్చింది. అంది అనసూయ. "ఇచ్చిందా తెచ్చిందా ?" అంది రెజీనా . "తెచ్చి, ఇచ్చింది" అంది అనసూయఅబ్బా , ఏంటిది అర్ధంచేసుకోకుండా అంది రెజీనా . "అహ్హ హ్హ హ్హ   అర్దమైయింది , ఇలా ఇచ్చేవాళ్లందరికీ మా సారు ఇంటిల్లిపాదికీ కావలిసినవన్నీ  పంపిస్తారు, సరా , అంది అనసూయ.  ఈరాత్రికి ఇంకా భోజనం చేయను అంది వెళ్లిపోతున్న అనసూయతో జ్యూస్ పంపిస్తాను , మళ్లీ  రేపు ఉదయానే ఉరకాలి కదా అంటూ మేడ దిగి వెళ్లి పోయింది. 




రేపు చేయాల్సిన పనులు రెండు. రేపు డయూర్నల్ బర్డ్స్ ని  వీడియో తీయాలి. వోయిస్ బట్టి రికగ్నైజ్ చేయలేని పక్షులను వీడియో కూడా తీయాలి. పెరబోలిక్ మైక్రోఫోన్ కి వీడియో అరెజ్ చేసుకోవాలి అది ఈరోజే , ఈ రాత్రే  చెక్ చేసుకోవాలి.  ఇకపోతే  రెండవ పని , ఫ్రెంచ్  ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. నెమలి ఇంటికి వెళితే అక్కడ ఇంటర్నెట్ దొరుకుతుంది.  పెరబోలిక్ మైక్రోఫోన్ కి వీడియో కెమెరా సెట్ చేసి. ఒక్కసారి చూసుకుంది. నాక్టర్నల్ బర్డ్స్ అనే పుస్తకం తీసి చదువుతున్నాది. మానవ స్వరానికి పోలి ఉండే అతి మెత్తని పాట వినిపిస్తున్నది. షూ షూ షూ డౌట్ లేదు ఇది ..మలబార్ విజిలింగ్  త్రష్, ఇది వెస్ట్రన్ ఘాట్స్ లో ఉండే పక్షి ఈస్ట్రన్ ఘాట్స్ లో ఉండదే  అనుకుంటుండగా  జ్యూస్ పట్టుకుని వచ్చింది అనసూయ. విజిలింగ్ బోయ్!!! గట్టిగా అరిచి  జ్యూస్ పంపిస్తానన్నావు నువ్వే తెచ్చేవేంటి అంది రెజీనా. గిరి , సత్య లేరా అంది  " బయటకు వెళ్లిపోయారు , రాత్రయితే చాలు ఇక్కడ అందరికీ హడావిడి అంది అనసూయ. బెంకాక్ , పట్టాయా , సింగపూర్ లాంటి సిటీస్ లో  నైట్ లైఫ్ గురించి విన్నాను కానీ ఈ అడవిలో నైట్ లైఫ్ చాలా విడ్డురంగా ఉంది. అంది రెజీనా. రెజీనా జ్యూస్ తాగుతున్నది. పక్కనే బెడ్ మీద కూర్చుని అంది అనసూయ "అదిసరేగానీ ఈ పక్షుల అరుపుల రికార్డింగ్ ఏంటి ? పక్షుల పాటల్లో రాగాలేంటి ? ఇదంతా నిజమేనా ?అంది అనసూయ. "కోయిల శంకరా భరణం రాగంలో పాడుతుంది, నువ్విప్పుడు పాడేవు  చూడు , అలా పాడే పిట్టని మలబార్ విజిలింగ్  త్రష్ అంటారు , దాని  ముద్దుపేరు  విజిలింగ్ బోయ్!!! అంది రెజీనా . ఓహో అందుకా విజిలింగ్ బోయ్  అన్నావు అంది అనసూయ.  "అవును , అది మోహన బిలహరి రాగాలలో పాడుతుంది " అంది రెజీనా.  అబ్బో నీకు చాలా తెలుసే అంది అనసూయ .  సంగీతంలో నాకు తెలిసింది చాలాతక్కువ ఈవిషయంలో జగపతి గారు దిట్ట. నాకు  కేవలం పక్షుల పేర్లు వాటి కూతలు తెలుసు , వాటిని ఎలా రికార్డు చెయ్యాలో తెలుసు . అంది రెజీనా . " సర్లే నాకు అదికూడా రాదు అని సన్నాయి నొక్కు నొక్కింది అనసూయ. " ఎందుకు రాదు , నీకు వచ్చు , నీకు వాటిలా కూయడం వచ్చు , అంది రెజీనా నవ్వుతూ.

ఆకాశంలో పెద్ద మెరుపు . వాన మొదలయ్యింది. గిరి సత్య పరుగు పరుగున లోపలి వచ్చారు. " ఆమ్మో వాన మొదలైపోయింది " అన్నాడు సత్య.  మొదలైపోతేనేం, తిగిగేవాళ్ళు తిరుగుతున్నారు కదా .  అంది రెజీనా ,  ఆ బ్యాచ్ వేరు మాలాంటి వాళ్ళు తిరగకూడదు " అన్నాడు గిరి.  " ఆవిషయాలన్నీ ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పాలా ? మీరు మీ రొమ్స్లోకి పొండి , ఇంక ఆ అమ్మాయి పడుకోవాలి " అని అనసూయ గ్లాస్ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది. గిరి సత్య కూడా నిష్క్రమించారు. బెడ్ దగ్గర ఉన్న చిన్న లైట్ వేసుకుని 11 గంటలు వరకు చదువుకుంది . మెరుపులు డిస్ట్రబ్ చేస్తున్నాయని కర్టెన్స్ దగ్గరకి లాగేసింది.  ఇంక పడుకుందామని టైం చూసి  ఒకసారి కర్టెన్లు లాగి చూసింది. బంగాళా గోడ  దగ్గర లోపలివైపు   ఎవరో  కూర్చుని ఉన్నారు. బేడ్లిఘ్త్ కూడా ఆపేసింది. నల్ల బట్టలు వేసుకుని ఉన్నారు. కాస్సేపు చూసిన తరువాత  ఎదో తవ్వుతున్నారు  అని అనిపించింది . రెజీనా గట్టిగా అరిచింది.  ఆ ఆగంతకుడు పారిపోయాడు . అనసూయ గిరి సత్య అందరు లేచి బయటకు వచ్చారు . బైటలైట్ వేశారు. అందరు గోడ దగ్గరికి వెళ్లి చూసారు. అక్కడ మూడు అడుగుల లోతైన గొయ్యి  తవ్వి  ఉంది .

 ఆ రాత్రి చాలా అస్థిమితం గా అనిపించింది రూం లోకి వెళ్లినా అప్పుడప్పుడూ బైటకు వచ్చి ఎవరైనా ఉన్నారేమో అని చూసింది  . ఒకసారి బైటనుంచి రూంలోకి  వచ్చినప్పుడు అకస్మాత్తుగా, విండో గ్లాస్ కి అంటించి ఉన్న ఒక కాగితం కనిపించింది . ఆ కాగితం గ్లాస్ కి పైనుంచి లోపలకి అక్షరాలూ కనిపించేలా  అంటించి ఉంది. తెల్ల కాగితం మీద నల్ల  స్కెచ్ పెన్ తో రాసిన అక్షరాలు కనిపించాయి.   డోన్'ట్ వర్రీ ,ఇట్ ఈజ్ మీ, అయామ్ ఇన్ ద సీన్ - కార్తీక్. బయటకి వెళ్ళి  గ్లాస్ కి అంటించి ఉన్న కాగితం తీసేసిన తరువాత తనని కలవనందుకు  కార్తీక్ మీద కోపం వచ్చినా  ప్రశాంతంగా నిద్రపోయింది.  చెంచుగూడెం బర్డ్స్ స్పాట్ , రెజీనా  కార్తిక్ కి ఇష్టమైన  సిల్వర్ సారీ  కట్టుకుని కెనాన్ 500 డీ  సూపర్ టెలిస్కోప్ లెన్స్  కెమెరా పట్టుకుని నడుస్తున్నది.  అప్పుడే సూర్యోదయం అయ్యింది. సూర్య కాంతి భీమ్స్  పొడవైన చెట్ల మధ్య నుంచి ఫిల్టర్ అయ్యి టార్చ్ లైట్ ఫోకస్ లా నేలను తాకుతుండగా , పొగమంచు తెరలు చెట్లమధ్య నుంచి పల్చని తెల్లని  సిల్క్ చీరలా కనిపిస్తున్నాది . ప్రకృతి కాంత అని అంటారు, నిజమే తెల్లచీర కట్టిన శోభనం పెళ్లికూతురు లా ఉంది. సూర్యకాంతికి ఆ మంచుతెర కరిగిపోతుంటే ... మైమరచి పోతున్న మనసుకి   మొదటి పక్షి కూత ఒక్క కుదుపు అయ్యింది.    వీడియో కేమ్ ఫిక్స్ చేసిన పారబోలిక్ మైక్రోఫోన్ ని చెట్ల శిఖరాలవైపు చూబిస్తూ , కెమెరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ అడవిలో కలియతిరుగుతోంది. ఆమెకు సబ్ లిమినల్  మైండ్ లో కార్తీక్ మీద అపారనమ్మకం వల్ల సేఫ్టీ గురించిన చింత లేదు. ఎంతో కాలం కలవకపోయినా ఎందుకో కలిసి మెలిసి ఉంటున్న అనుభూతి, ఆ అనుభూతి పేరే నమ్మకం  దాని పర్యాయపదమే ప్రేమ దాని పర్యావసానమే నిశ్చింత. 
ఆమెతో పాటుగా మరో జతబూట్లు నడుస్తున్నాయి.  ఒక నల్ల దుస్తులు వేసుకున్న మనిషి ఆమెను నీడలా అనుసరిస్తున్నాడు.   ఆమె ఆగితే అవి ఆగుతున్నాయి. ఒక తేనెపిట్ట తన కెమెరాకి చిక్కింది , కెమెరా జూమ్ చేయడంలో నిమగ్నమయిన రెజీనా, చేతిలో ఎదో పట్టుకుని తనని అనుసరిస్తున్న అగంతకుడిని గమనించలేదు. వాడు తలా తలపులు ఆకాశంలో ఉన్న రెజీనా ని చూసి , ఇదే అవకాశం అని పరుగు పరుగున ఆమె వైపు వస్తున్నాడు. ఆకుల చప్పుడు అయ్యి ఒక స్ప్లిట్ సెకండ్ లో కెమెరా వదిలేసి పరుగెత్త సాగింది. కొద్ది  సెకండ్స్ తరువాత వెనకనుంచి వచ్చే చప్పుడు ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసింది , చూస్తే ఎవరూ లేరు ఎదురుగా చూసింది చెట్టుచాటునుంచి నల్ల బూట్లు  వేసుకున్న ఆగంతకుడు. వీడు వాడేనా మరొకడా అనుకుంటుండగా చెట్టుచాటునుంచి మెల్లగా ఒక ఆకారం బైటకు వచ్చింది.  చేతిలో పిస్తోల్  రెజీనా వైపు గురి పెట్టి  మెల్లగా నడుచుకుంటూ  రెజీనా వైపు వస్తున్నాడు. మొహానికి మాస్క్ ఉంది  కానీ వైట్ షర్ట్ బ్లు పాంట్స్ వేసుకున్నాడు .  వాడు వీడు ఒకటి కాదు. అతడు వచ్చేది  రెజీనా వెనక పొదలలో దాక్కుని ఉన్న నల్ల బట్టల ఆగంతకుడు కోసం. ఈ సంగతి రేజీనాకి తెలియక బిక్క చచ్చి పోయింది. పారిపోతున్నాడు.  పొదలలో దాక్కుని ఉన్న నల్ల బట్టల ఆగంతకుడు పారిపోయాడు. వాడిని వెంబడిస్తూ పరిగెత్తేడు పిస్తోల్ పట్టుకున్న వ్యక్తి . ఆ ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది . బాహాబాహీ రెజీనా ఎదురుగానే జరిగింది. నల్ల బట్టలవ్యక్తి కిందపడ్డాడు , కానీ నీలం పెట్స్ కాలిమీద తన్ని లేచి పారిపోయాడు. అతడ్ని వెబడిస్తూ నిలపేంట్స్ పరిగెత్తాడు.  కొద్దీ సేపట్లో బ్లూ పేంట్స్ వెనక్కి వచ్చి రెజీనా ముందు మాస్క్ తీసి నిబడ్డాడు. కార్తీక్ !!!

అప్రయత్నంగా ఆర్ద్రంగా వచాయి ఆమాటలు . కార్తీక్ వెంటనే మాస్క్ పెట్టేసుకున్నారు. రేజీనాకి కోపం వచ్చేసింది ,మాస్క్ ఎందుకు ?  నల్ల బూట్లు ఎందుకు వేసుకున్నావు? అని పిడికిళ్లు బిగించి కొట్టసాగింది.  కార్తీక్ మెల్లగా అన్నాడు నేను అండర్ కవర్ లో  హైడింగ్ లో ఉన్నాను.  పడిపోయినట్లు నటించు.  అన్నాడు . వెంటనే రెజీనా కూల బడిపోయింది , కెమెరా తీసుకుని , రెజీనాని బుజం మీద వేసుకుని కార్తీక్ జీప్ వైపు సాగాడు. జీప్ తార్  రోడ్డు ఎక్కింది. ఇదే సమయం అని కార్తీక్ బుజం మీద వాలి పడుకుంది రెజీనా. జీప్ సేఫ్ ప్రదేశానికి చేరాక కార్తీక్ మాస్క్ తీసేసి  రెజీనాని లేపాడు. " నేను లేవను నువ్వు కార్తీకేవో ఇన్స్పెక్టర్ వో చెపితే లేస్తాను అంది.  ఇందాక ఇన్స్పెక్టర్ ని. ఇప్పుడు కార్తీకేనే.
     
అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగెర్స్ ని మానిటర్ చేయడానికి పెట్టిన సి సి కెమెరాలు ఉన్నాయి , నేను సి ఐ డి అని, నిన్ను రక్షించాను  అని తెలియకూడదు సి సి ఫుటేజ్ చూసినవాళ్లు  ఎవరో ఎత్తుకుపోయారు అని అనుకోవాలి. అన్నాడు   ఎందుకు ఎవరికీ తెలియకూడదు అంది రెజీనా. ఉత్త మొద్దు నీకెవడిచ్చెడే ఉజ్జోగం అన్నాడు కార్తిక్. మొద్దు అనగానే పాత రోజులు గుర్తొచాయి  మరింత దగ్గరగా స్టీరింగ్ పట్టుకున్న చేతికి అంటుకుపోయింది.  ఇక్కడ కూర్చుందాం  అంది జీప్ ఆపేసాడు.  ఓపెన్  జీప్ ఒక మట్టిరోడ్డు లోకి తిప్పి ముందుకి పొనిస్తున్నాడు,  రోడ్డులో గుంతలు , నిలిచిపోయిన వాన నీరు. రోడ్డుకి ఇరువైపులా తుమ్మ పొదలు. వాటివెనక పచ్చ గడ్డి మైదానం కొంచం దూరంలో కొండలు . కొండా ఎక్కి చూస్తే పెద్ద పచ్చగడ్డి మైదానంలో జీప్ నడుపుతున్నట్టు కనిపిస్తుంది.  జీప్ కొంచం ముందుకి వెళ్ళినతరువాత ,  మట్టి  రోడ్డుకి ఆనుకున్న తుమ్మ  పొదల స్థానంలో పెద్ద చెట్లు వచ్చేశాయి పచ్చగడ్డి ఉండాల్సిన స్థానంలో కూడా పెద్ద చెట్లే కనిపిస్తున్నాయి.  అంటే కనుచూపు మేరలో చుట్టూ చెట్లు మధ్యలో సన్నని బాట.  అక్కడ జీప్ ఆపేడు.

జీప్ దిగి బోనెట్ ఎక్కి కూర్చున్నాడు. సిగరెట్ వెలిగిస్తూ విలాసంగా నవ్వాడు.  అడవి అత్తారిల్లు లాగుంది ఇతడి  వాలకం చూస్తుంటే.   ఎటువంటి పరిస్థితులలోను నేను అండర్ కవర్ కాప్  అని తెలియకూడదు ఎందుకంటే ఇది ఒక  సీక్రెట్ ఆపరేషన్ ఇందుకు నీ కోపరేషన్ చాలా .. అంటుండగా మధ్యలో రెజీనా అందుకుని ఆపరేషన్  కోపరేషన్ ఈ వంకాయ కబుర్లు ఆపి ముందు నాకు ఇది చెప్పు నా కాంటెక్ట్ ఎందుకు కట్ చేసావ్ , యు పీ ఎస్ సి క్లియర్ చేశానని పొగరా ? అంది బోనెట్ మీదకి ఎగిరి కూర్చుంటూ.  సిగరెట్ తాగుతావా ? అని ఆఫర్ చేసాడు . చి చి నేను సిగరెట్..   అయినా  మాట మార్చకు  ఎందుకు నాకాంటాక్టు లో లేవు  అది చెప్పు  అంది రెజినా .

ఆహా , నెమలి ఇంట్లో చక్కగా  వైన్ తాగినప్పుడు ఛీఛీ అనిపించలేదా ? అన్నాడు.  ఆ విషయం నీకెలా తెలుసు ? అంది రెజీనా ఆశ్చర్యంగా. నీకు తెలియనివి , నెమలికి , జగపతికి తెలియనివి కూడా నాకు తెలుసు. " నెవ్వెప్పుడు వొచ్చావు ?  రాగానే నన్ను కలుస్తావ్ అనుకున్నాను " అంది రెజినా.  చెప్పేను  కదా ఇది సీక్రెట్ ఆపరేషన్ అని మనిద్దరం కలిసి ఒక చోట ఉండకూడదు అలా అయితేనే నేను అందరినీ గమనించగలుగుతాను  అన్నాడు కార్తీక్ .  నిన్న రాత్రి మీ బౌన్డ్రి వాల్ దగ్గర గోయింతవ్వింది నేనే. మీ ఇంటికి ఒక ముసలోడు వస్తుంటాడు కదా , అదే అనసూయ తండ్రి , అతడిని పట్టుకోడానికి ట్రాప్ ఆ గొయ్యి  అన్నాడు. ఇలాంటి సీక్రెట్స్ నాకు చేప్పేస్తున్నావేంటి అంది  అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని అక్కసుతో. " చెప్పేనుకదా  నీ కోపరేషన్ కావాలనిఅన్నాడు కార్తీక్ మళ్ళీ  . "దానికి ఇంకోపెరు వాడుకోవడం ,  నన్ను వాడుకుంటున్నావు అంతేనా?  అంటూ జీప్ మీదనుంచి దిగి వెళ్ళిపోసాగింది  రెజీనా . ప్లీజ్ , ప్లీజ్ , రేజీ .. రెజీ  అంటూ  వెంటపడ్డాడు .

" ఏప్రశ్న అడిగినా ఏదో ఒక బాంబ్ పేలుస్తావ్ , అడిగిన దానికి సమాధానం మాత్రం సమాధానం చెప్పవు.  నన్ను ఎందుకు అవాయిడ్ చేసావు, అది చెప్పమంటే , ఒక సారి నెమలి అంటావు , ఇంకొక సారి ముసలాడంటావు ,ఏం  పిచ్చి దానిలా కనిపిస్తున్నానా?  రెజీనా  గొంతు పూడుకుపోతోంది కళ్ళల్లో నీరు తిరుగుతోంది. వడివడిగా నడుచుకుపోతున్న రెజీనా వెనక పడ్డాడు. రెజీనా ఆగలేదు  కార్తీక్  రెవెర్స్  రనింగ్ చేస్తూ " హతోస్మి , సరండర్, సరండర్"  అన్నాడు,  అయినా రెజీనా ఆగలేదు . జగపతి గారికి నీకు నేను ఒక పావుని అంతేగా , "పామువా బాబోయ్ ...  పాము కాదు పావు , కావాలనే నన్నేడిపిస్తున్నావు కదా  అంది రెజీనా .. ఈ రీసెర్చ్ నాకొద్దు ఇదంతా రామాయణంలో పిడకలవేటలాఉంది "సారి , సారీ నానోట్లో శని ఉంది ,  నాపీక మీద కత్తి వెళ్ళాడుతున్నాది"  అన్నాడు కార్తీక్.  ఇదో కొత్తకథా ? ఆగి సీరియస్ గా అడిగింది.

మీనాన్న గూండాలని పంపించాడు మాఇంటిమీదకి.  ఏం ఇన్స్పెక్టర్ వి కదా ఇంత భయపడుతున్నావ్  సిగ్గులేదు , అయ్యో ఇప్పుడు ఇన్స్పెక్టర్ని అప్పుడు స్టూడెంటేనే కదా. పైగా మాఇంట్లోవాళ్ల  ముంది నాపరువు పోయింది.  కోతలు కోస్తున్నావా ,అంది రెజీనా . అయ్యో నువ్వేకాదు ఎవ్వరూ నమ్మరు. కార్తీక్ రెవెర్స్ రనింగ్ ఆపేసాడు. రెజీనా ముందుకి వెళ్ళిపోతోంది.  రెజీనా ! ఐలవ్ యు అన్నాడు. ఈ రీసెర్చ్ నీ హాబీ,  జాబ్ కాదు.  అందుకే కావలిస్తే వదిలేయవచ్చు అలాగే నన్ను వదిలేస్తావా? రెజీనా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరూ వాటేసు కున్నారు. ఈ ఆపరేషన్ అవ్వగానే ఈ అడవిలోనే మన పెళ్లి అన్నాడు. ఛీ  అడవిలో పెళ్లేంటి ? అంది , ఓకే పెళ్లి సిటీలో చేసుకుందాం శోభనం అడవిలో చేసుకుందాం. అన్నాడు.

ఇప్పుడు జాగ్రత్త గా విను , ఆ ముసలాడు ముసలాడు కాదు. ముసలాడి వేషంలో ఉన్న పడుచువాడు. అందుకే వాడు ఎక్కువ ఎవరితోనీ మాట్లాడాడు. జగపతి ఉంటె రాడు.  వాడు వాన పడినప్పుడు  ఎవ్వరూ లేనప్పుడు వస్తాడు . అసలు వాడు లేడిలా పరిగెడతాడు , కెమెరాకి అందని వేగంతో క్షణాల్లో గోడలు దూకుతాడు. మీగోడ చాలా సార్లు దూకాడు. అన్నాడు .   వాడు ఎప్పుడు అర్ధరాత్రి  గేటులోంచి పోవడమే చూసాను  చూసాను  అంది. చూడమ్మా , గేటుతీసి ఉండగా గోడ గెంతడానికి వాడేమైనా పిచ్చోడా ? అన్నాడు. ఎస్ ఇప్పుడు అర్ధమయ్యింది. నేను గేటు తాళం వేసేయాలి అప్పుడు వాడు గోడ గెంతితే , గెంతుతాడు  గెంతి ఆ గోతులో పడితే అప్పుడు నువ్వు పట్టేసుకుంటావు . నుదుటిమీద ఠపా ఠపా  కొట్టుకున్నాడు. వాడేం అంత పిచ్చోడు కాదు , వాడు తప్పకుండా  గొయ్యి తవ్విన చోట కాకుండా వేరే చోట నుంచి గోడ  గెంతుతాడు. అలా గెంతేడంటే  మన ఇంట్లో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారు. అన్నాడు.

అయ్యో వాడిని అరెస్ట్ చెయ్యవా ? అంది రెజీనా   అలా పట్టేసుకుంటే  వాడి వెనకాల  ఎవరున్నారో ఎలా తెలుస్తుంది , అయినా నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్  ని అనుకుని నాకు కోపరేట్ చెయ్యి  అని కొంచం గంభీరంగా అన్నాడు. ఇప్పుడే కదా లవర్ అన్నావు , ఇంతలోనే ఇన్స్పెక్టరా ?  కాపురం చేస్తుంటే మధ్యలో ఇన్స్పెక్టర్ అనేట్టున్నావు !!! ఎక్కడుంటున్నావు మళ్ళీ ఎలా కలుసుకోవడం? ఈ నీడలా ఉంటాను. నిన్ను ఫాలో అవుతూ ఉంటాను. మొదట అనుకున్న ప్లాం అమలు చేయి. అన్నాడు. జీప్ వెనక్కి బయలుదేరింది. 

8 comments:

  1. Really thoughtful sir.Well described each character through soliloquies of Regina.we can learn some new English words also

    ReplyDelete
    Replies
    1. I think you are very prompt to read and comment.

      Delete
    2. Yes mam. Thank you for your response.

      Delete
    3. A good reader always write a genuine review

      Delete
  2. Mind traveled into the forest along with the scene.

    ReplyDelete
  3. The introduction of hero is superb. I think he meet her in the bungalow. But unexpectedly he met her in the forest. Nice meeting of the couple in the forest. Conversations are quite natural

    ReplyDelete
  4. Please know that you have such talent and your words not only touch me, but so many here--keep writing, expressing and touching our souls. You are a gift to this world. Thank you sir

    ReplyDelete