Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, January 23, 2021

Bharatavarsha 117

 ప్రాతః సప్తవాదనే భవతి: బెంగళూరు నగరే  కెంపేగౌడ  రోహణాగ్రే అనేకే యాత్రికాః  బహుకాలతః  కొచ్చి గచ్ఛన్తం వాయుయానార్ధం ప్రతిక్షా కుర్వన్తి.  మీనాక్షి, యమునా చ  తత్ వాయుయానార్ధం ప్రతిక్షా కురుతః.  తద్ప్రదేశే మూకత్వ రాజ్యతి. యమునా సంతుష్ట ఇతి భాతి. కింతూ మీనాక్షి,    ఏవం నిశ్చయేన కుప్యతి. 

సమయం ఉదయం ఏడు గంటలయ్యింది  ఫిబ్రవరి మాసం పొగమంచు  తెరలు వాతావర్ణములో తేలాడు చున్నవి. మీనాక్షి యమునలు విమానాశ్రయంలో కొచ్చి పోవు విమానము కొరకు వేచియున్నారు. యమునను కొచ్చి తీసుకు పోవుట మీనాక్షికి సుతరామూ ఇష్టము లేకున్ననూ, యమున వెంట బడుచుండుటచే కూడా తీసుకుపోవుట తప్పినది కాదు. అందుచే, చిత్ర సంగీత కూర్పు, అంకణ ( recording)  కార్యక్రమములు విజయవంతముగా పూర్తి చేసుకొని ప్రయాణ మగుచున్ననూ ఆమె వదనము కుప్యము(కోపము)గానున్నది. యమున ఆమెను రంజింపజేయుటకు యత్నించుచున్నది. 

“బెంగళూరు నుండి రహదారిమార్గమున 549 కిలోమీటర్లు దూరము నున్న కొచ్చి, వాయు మార్గమున 366 కిలోమీటర్లు మాత్రమే. భూమార్గమున పోవుటకు 10 గంటలు వలయును గానీ వాయుమార్గమున బోవువారికది యొక గంట మాత్రమే” అనుచూ యమున సోఫా నుండి లేచి ఆ ప్రాంగణములో జింకపిల్ల వలే తిరుగుచూ కన్నడ చిత్ర గీతము " నాద నాద ప్రేమద  నాద జీవన వీణా తంతియల్లి " ప్రేమ లో  నడవమని అర్ధము వచ్చు పాటను పాడి “నాద బ్రహ్మ హంసలేఖ స్వరపరిచిన అండమాన్ చిత్రం నుండి ఒక గీతము విన్నారు.  అని మీనాక్షి వైపు కొంటెగా చూచుచుండెను. మీనాక్షి కోపము తో కుతకుత ఉడుకు చుండెను. ఇప్పుడు “జేను-స్వర-రాగిణి” (తేనె-స్వరాల-రాణి) మీనాక్షి స్వరపరిచిన హనీమూన్  చిత్రం నుండి ఒక గీతము “ప్రీతియల్లి.. ప్రీతియల్లి..  ఈజికొల్లి.. ఈజికొల్లి.. కయ్ కయ్ జోడిసి” ప్రేమ లో ఈదమని ప్రేమించిన వాని చెయ్యి చేకొని వదల రాదని చెప్పు గీతము. 

ఆహా! ఏమి ప్రేమ గీతములు,   ఏమి యుగళ గీతములు, నీ స్వరకల్పనే తల్లీ లోకమును ఉర్రూ తలూపుచున్నావు.  వళ్ళు కాలిపోవుచున్నదే మలబారు తీరమంతయూ మంటలు రేగునేమో, అచ్చటికి పోయి వారినెట్లు  కవ్వింతువో.

మీనాక్షి : నీవు వచ్చునది  కాదమ్మ , నీవు చూడవలసినది   కాదమ్మ  అని చెప్పిననూ, వెంట పడవద్దని బ్రతిమాలిననూ వినక  వచ్చు  ఇట్టి మొండి ఘటమును ఏమి చేయ వలెను! పైగా వర్షుని వలె గణాంకములను చెప్పుచున్నది!  అని  కొర కొరా చూచుచున్ననూ యమునికి కోపము రాకున్నది. 
యమున: ఆహా! వ్యోమ యానమా లఘు లోహ విహంగామా! సుదీర్ఘ ప్రయాణములను సయితము సులభము జేయుచూ భూగోళమునెంత కురచ జేసినావు.
 మీనాక్షికి దుఃఖం పొంగుచుండెను ఇంటివద్దనుండి విశ్రాంతి తీసుకొనము. మంచి వేదికలపై  కి నిన్ను కొనిపోవలెను కానీ..  నిస్సహాహాయముగా యమున వైపు చూసెను. 
నీకంటే నేను ఉన్నతురాలి వలే చెప్పుచున్నావే. తార భర్తను వలలో వేసుకొనుటకు పోవుచున్నావా? అతడి బుద్ధి మార్చి, అతడిని తన ఇల్లాలికి అప్పగించుచున్నావు., నేను నీ సంరక్షురాలిని, నీ కంటి రెప్పను. నీ పెట్టె మోయుటయందు నా కానందము కలదు, ఇటిమ్ము అని మీనాక్షి చేతినుండి పెట్టెను లాక్కుని విమానము వైపు పోవుచుండెను.  మీనాక్షి యమునను అనుసరించుచుండెను. యమున ముందుగా పోయి కూర్చొని మీనాక్షిని పిలువగా ఆమె వచ్చి పక్కన కూర్చొనెను. పరిచారిక వచ్చి యమున వద్దనుండి ప్రయాణ పేటి కను తీసుకొని నిమంత్రిత ప్రదేశమందు పెట్టుచుండగా మీనాక్షి " అమ్మాయి , నీకు పైలట్ సుందరి తెలుయునా ?" అని అడిగెను ఆమె వెనుకనే వచ్చిన మరొక యువతి " నాకు తెలియును ఆమె రాజీ నామా చేసినదని , కానీ అది ఆమోదించబడలేద"ని చెప్పెను
ఆమె వెడలిన పిదప ఇండిగో విమానమును మీనాక్షి ప్రేమగా తాకుచుండెను. “కోడలు ఈ విమానములనే ఎగుర వేయును.” అప్రయత్నముగా ఆమాటలు మీనాక్షి నోట వెలువడినవి. ఎప్పుడూ కోడలి ద్యాసేనా నీ ప్రియుడి గూర్చి కూడా కొంచెము ఆలోచించరాదా అని యమునా హాస్యమాడుచుండగా వ్యోమయానము కదులుట ప్రారంభించెను, కొలది క్షణములలో వేగము హెచ్చి , సుడిగాలివలె విమానపథమున పరిగెత్తి అమాంతము గాలిలోకి లేచెను. సమయము 7. 30. మీనాక్షి యమున భుజముపై వాలి నిద్రించుచుండెను.

                                                                              ***సమయము 8.30 నిమిషములయ్యెను మీనాక్షికి తెలివి వచ్చి కనులు తెరిచెను. విమానమునందు ఆంగ్ల  ప్రకటన వినిపించుచుండెను. ఆ స్వరము ఎంత కమ్మగా యున్నదో " సుందరి అట్లే మాట్లాడునెమో  "   యమునకు ఒక చెంప  మరొక చెంప కోపము  కలిగి " ఈ విమానము చూచిన కూడా అట్లే అనిపించుచున్నది కదా విమానమును కూడా ఇంటికి పట్టుకుపొమ్ము " అనెను. మీనాక్షి గతుక్కుమని కిటికీనుండి క్రిందకు చూడగా కొచ్చి విమానాశ్రయము కోనేటిలో తేలుచున్న తామర పుష్పముమువలె సముద్రము వలె విశాల హరిత పచ్చికలో మనోజ్ఞముగా కనిపించెను. నీలి గగనమందు పాలపొంగులు వంటి మేఘములు , వాటిగుండా క్రిందకు జారుతున్న విమానము అప్సర వలె , విమానాశ్రయము తపమాచరించు ఋషివలె నగుపించెను.

                                                                ***

ప్రఫుల్ల విమానాశ్రయమువద్ద  మీనాక్షి కొరకు కొరకు ఎదురుచూచుచూ యమునను చూచి గతుక్కుమనెను. వారిరువురూ సమీపించిన పిదప " పెళ్లిని పోతూ పిల్లిని చెంక లో పెట్టుకొని వెళ్ళువారుందురా అని వాహనము తలుపు తీసి మీనాక్షినాహ్వానించెను. యమున " నన్ను  పిల్లి అన్నవారి వాహనము నేనెక్కన"ని అనుటతో గొడవ ప్రారంభమయ్యెను. అబ్బబ్బ మీరిద్దరూ పిల్లి కుక్కలవలె పోట్లాడుకొనుచున్నచో నేను బెంగళూరు  పోయెదను  అని మీనాక్షి వాహనము దిగి పోవుచుండగా ప్రఫుల్ల "  మీనాక్షిని బ్రతిమాలి వాహనమెక్కించెను. పిదప యమునను వాహనమెక్కమని వేడి ఆమె వచ్చుచుండగా రెండు చేతుల వేళ్ళను అనుసంధానించి సన్నాయి వూదుచూ "రావమ్మా మహాలక్షి రావమ్మా అని పాట పాడుచూ వాహనమెక్కించెను. వాహనము ముందుకు కదిలెను. కొలది సేపు తరువాత జానకి  నిలయము అను భవనము ముందు వాహనము నిలిచెను. ప్రఫుల్ల సాదరముగా వారిని లోపలి కొనిపోయి సోఫాలలో కూర్చొండబెట్టెను.   

                                                                            *** 
                                
1950 లో తొలినాళ్లలో మళయాళ చిత్రపరిశ్రమ త్రివేంద్రమందుండెడిది , మెర్రీ ల్యాండ్ చిత్రాంజలి వంటి పెద్ద స్టూడియోలు అచ్చట నుండుటచే 2000 వరకు చిత్ర రంగమంతయూ త్రివేంద్రమునందే ఉండెడిది.  క్రమక్రమముగా పెక్కు దర్శకులు , నిర్మాతలు , కళాకారులు కొచ్చి తరలి వచ్చినారు ఈ మధ్యకాలమందు ముఖ్యముగా 90 నుండి 2000 మధ్య కాలమందు దిలీప్, అశోకన్, బిందు , పనికర్ వంటి   మిమిక్రి కళాకారులు చిత్ర రంగమందు అడుగిడుటచే ..  ప్రఫుల్ల తండ్రి రఘువరన్ అట్లు చెప్పుకు పోవుచుండగా , ప్రఫుల్ల తల్లి జానికి వైపు చూచుచూ తల బాదుకొనుచుండెను
జానకి: ఎవరైననూ ఇంటికి వచ్చిన ఈయనతో నాకిది యే  భయము  ఆ వచ్చినవారు ఏ పని పై వచ్చినారు , వారితో మనమేమి మాట్లాడవలెను అది ఏమియూ లేదు , పుస్తకము చదివి నట్లు , మాట్లాడుటయే అని గొంతు పెంచెను.  
అటువంటి వ్యవహారములు నాకేమి తెలియును నీవు చూచుకొనవలెను అని రఘువరన్  లేచి బయటకు పోయెను. యమున , మీనాక్షిలు మొఖం మొఖములు చూచుకొనిరి.
రఘువరన్ అను పేరు విని యుంటిని మంచి దర్శకుడని ఆయనకు పేరు కలదు అని మీనాక్షి మాట కలుపుచుండగా “ ఆయనకొక స్టూడియో ఇచ్చట ఉండబట్టి  మా రోజులు సాగుచున్నవి”  అని చెప్పున్న తల్లి వైపు మీనాక్షి వెనుకనే నిలబడి యున్న ప్రఫుల్ల తన గురించి చెప్పమని సైగ చేయుచుండెను “ఓహ్ మీకు స్టూడియో కలదా!” అని యమున అనుచుండగా
స్టూడియో దేమున్నదమ్మ  రత్నమువంటి బిడ్డ ఉండగా నాకేమి లోటు అని జానకి మాట మార్చెను . వాడికి ఒక కోరిక కలిగినది , అనుచూ జానకి ప్రపుల్లకి సైగ చేసెను.జానకి  సైగతో ప్రఫుల్ల యమునను తీసుకొని పోయి  ఇల్లు చూపసాగెను. మీనాక్షి గోడపైనున్న అరుణ భర్త చిత్రమును చూపి ఆయన కూడా దర్శకునివలె నున్నారే? ఇంటి ఇంటివద్దలేరా? అని అడిగెను 
వాడు నా తమ్ముడు, ఈ ఇంట అందరూ చిత్ర పరిశ్రమనందు దర్శకులే కాక నిర్మాతలు కూడా. వారందరూ చిత్రములు తీసి చేతులు కాల్చుకొనగా నా తమ్ముడు చిత్రములను తీసి చేతులు కాల్చుకొనుటయే కాక ఆస్తులు కూడా కాల్చు కొనెను.
అతడి భార్య పిల్లలు ?
ఏ భార్య కాపురము చేయునమ్మ అతడికి అహంకారము, మొండితనము జాస్తి. మరదలు కూడా చిత్ర రంగమందే నటిగా యుండెడిది. ఆమె సంపాదనంతాయూ ఇతగాడు హారతి కర్పూరము వలే వెలిగించినాడు. అనుచూ జానికి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టెను. మీనాక్షి కూడా ఆమెకు సాయ పడుచూ మాట్లాడు చుండెను. 
 మరి అరుణ ఊరుకొన్నదా? అని మీనాక్షి అడిగెను  
అరుణ అనుచున్నారు మా మరదలు పేరు అరుణ అని మీకెట్లు తెలియును?
ఆబ్బె నేను అరుణ అనలేదండీ దారుణము అంటిని  
నిజమే నమ్మ దారుణమే మా మరదలు కూతురు కూడా చలన చిత్ర పరిశ్రమయందు నటించుచుండెను, ఇదిగో మామరదలు, పిల్ల అని శీతల యంత్రము పై లకుమ నెత్తుకొని యున్నఅరుణ చిత్రమును చూపెను. 
లకుమ చిన్నపిల్ల!  అని మీనాక్షి అని నాలిక కరుచుకొనెను 
ఆ పిల్ల పేరు లకుమ అని మీకెవరు చెప్పినారు? 
లకుమా! నేను లాకుమా అనలేదండి , ఇదే చిత్రం చెప్మా అంటిని  ఇంత అందమైన భార్యని వదులు కొని అతడెట్లుండెనో కదా!   
పిల్లది తల్లిని తల్లిని మించిన అందము అని చెప్పుచూ ఏదో గుర్తుకు వచ్చిన దానివలె అట్లే నిలిచిపోయి నీ అందమును చూచి నాకొడుకు నిన్నే పెళ్లాడెదనని మొండి పట్టు పట్టినాడు. అని మిక్కిలి వగచి  కొలది సమయము తరువాత  మీనాక్షి ని నేరుగా నిందించసాగెను   
జానికి  కళ్ళు ఎర్రబడెను ఛీ నీవు చిన్న పిల్లవాడిని వలలో వేసుకొంటివి నీతో కష్ట సుఖములు చెప్పుకొనుట సిగ్గుచేటు అని కన్నీరు పెట్టుకొనుచుండెను.   మీనాక్షి తాను ప్రఫుల్లను కొడుకు వలె చూచుచున్నానని ఎంత చెప్పిననూ వినక ప్రఫుల్ల బలవంతము చేయుటచే అతడి నూరడించుటకు ఇచ్చటికి వచ్చితిని  అని చెప్పగా  జానకి మొఖం విప్పారెను. " నాకొడుకు నాకు దక్కు చున్నాడు, నాకొడుకు నాకు దక్కు చున్నాడు  "  అని ఆమె సంతోషముతో పొంగిపోవుచుండగా మీనాక్షి నీవు సహకరించిన మరొక మేలు కూడా జరుగును అని ఆమె వచ్చితిన రెండవపని గూర్చి చెవిలో చెప్పుచుండెను .  అదే సమయములో ప్రఫుల్ల యమున వంటగదిలోకి ప్రవేశించిరి.  మీనాక్షి చెప్పుట ముగించగానే జానకి ఆనందాతిశయముతో " ఎంత  శుభవార్త చెప్పినావు”  ప్రఫుల్ల పెద్ద కేక పెట్టి ఎగిరి గంతేసేను. ఇంతలో కృష్ణన్ ప్రవేశించెను. 
  


2 comments:

  1. సత్కార్యము కొరకు మీనాక్షి కొచ్చి చేరెనన్నమాట.

    ReplyDelete
  2. మీరు ఫీడ్ బ్యాక్ ఇస్తే రచయిత తనని అద్దంలా లో చూసుకున్నట్టు ఉండేది 116, 117 ఎడిసోడ్స్ మీరు చదివారా? ఏదో బాగా బిజీలో ఉండి ఆ స్వారించదించకుండా వ్రాసినట్టు ఉంది. మళ్ళీ ప్రశాంతంగా చదివి ఆనందించండి. Please give me your feedback on 116. 117 once again. It is a big help to me. I look forward to your feedback. Thank you very much.

    ReplyDelete