Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, March 20, 2021

సర్వాలంకార భూషిత

 సర్వాలంకార భూషిత కావ్య కన్య - భారతవర్ష 

Language work in Bharatavarsha

కన్నెపిల్లకి బంగారు ఆభరణాలు వన్నెతెస్తాయి, అలాగే కావ్యకన్యకి అలంకారాలు వన్నెతెస్తా యి. ఇవి నగల దుకా ణంలో ఉండే బంగారు ఆభరణాలు కాదు పదాలు పదబంధాలతో కావ్య కన్య కి  చేసే భావాలంకరణ.   మెరుగు తగ్గక  తరతరాలకీ నిలిచి తళ తళ లాడు భాషాభూషణాలు.  

                                             అలంకారములు మూడు రకములు. అవి:

1.శబ్దాలంకారములు: శబ్దం  ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి శబ్దాలంకారములు.

2.అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి అర్థాలంకారములు.

3. ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవి. 

 శబ్దాలంకారములు: ఇవి యారు. నాలుగు అనుప్రాసములు, ఒక యమకముఒక ముక్తపదగ్రస్తము.  

అనుప్రాసము: వర్ణవిన్యాసమును అనుప్రాసమందురుఇవి నాలుగు.

1. వృత్యనుప్రాసము: ఒక హల్లు (వర్ణము) మరల మరల వచ్చుటను వృత్యనుప్రాసమందురు.

సాధారణ ఉదాహరణ చెప్పాలంటే : కాకీక కాకికి కాక కేకికా?

సినిమా ఉదా:  ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ  ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్కా,ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ,  టక్కున టక్కరి పిట్టా, నిన్ను పట్టేదెట్టా? ఎట్టా?

భారతవర్షనుండి నాదము నంది నందిని  నంద నందుని  వందనము జేసి నందము నందుచు…

   పల్లె అందాన్ని వర్ణించు చంపకమాల పద్యము 

   చ. పచ్చటి  చేలుము  చ్చటగ    పట్టము    గట్టిన   పల్లెజూ  చినన్

  నచ్చటె  వెచ్చగ  మనము  నాట్యము జేయును పట్టుబ  ట్టపై      

  ముచ్చట  గొల్పుచు  ముత్యపు  మిద్దెలు,   వీధులు   పైడిచే రులే               

   మెచ్చుచు బల్లిపా    డిదని   బల్కిన   చాలదు   చూచిరా వలెన్

2.ఛేకానుప్రాసము: రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అక్షరాలు  అర్థభేదముతో వెంటవెంటనే మరల మరల వచ్చుట

సాధారణ ఉదా: గుడిలో పూజ పూజ చేస్తున్నది.

 సినిమా ఉదా:   కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలం బాలగోపాలుని

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ

భారతవర్ష నుండి :ఈ ఎరుపు లంగా,  నలుపు చేతుల పై వస్త్రమును ధరించి చూపిన తరింతును." అని వర్షుడు కోరగా, విదిష  వర్షుని వంక ఓరగా చూచి "అయినచో బతిమాలుము" అనెను."బతిమాలుచున్నాను కదా!" "అట్లు కాదు చుబుకము చేగొని  బ్రతిమాలవలెను" అని విదిష అనగా వర్షుడు కలవర పడి మగవానితో ఇట్లే నడుచుకొందువా?" అని అడుగగా  అప్పుడు విదిష "సత్యభామని రంగ స్థలంపై కాళ్ళు పట్టుకొన్న  మగవానికి గదిలో నా గెడ్డము పుచ్చుకొనుట కష్టముగానున్నదా?  కృష్ణునివలె పాడి అడగవలెను" అని ఆజ్ఞాపించగా ఆజ్ఞానువర్తియై వర్షుడు   నా పాడి తెలిసి పాడి అడుగమనుట పాడి కాదు పాడవలెనన్న పాడు పాటేల దొరకదు కృష్ణ,  కృష్ణ శోభ మాటున దాగె కృష్ణ ఘాటు, నీవది  మనసులో పెట్టుకొన్నచో తప్పునా! అని విదిష చుబుకము క్రింద చేతినుంచి రంగస్థలము పై భామ కొరకు పాడిన  పాటను గుర్తు తెచ్చుకొని హృద్యముగా ఆలపించెను.

సరస కవిరాజ రసిక సురరాజ ఘనరాజ రాజరాజ

దోష  రాహిత్య, నిత్య సాహిత్య భోజ, మహిత సాహితీ మనో వల్లభా

కీర్తి దుర్లభా, భక్తివిజయ జ్యేష్ఠ, విదిష శృంఖలిత శృంగార శ్రేష్ఠః

కృష్ణ క్రీడల దృష్టి ఘన కృష్టి మదన గోపాల కావ్య సృష్టి

కలుగు భక్తి పుష్టి కురియు నీదు నీలాల మీద క్రిష్ణనీలాల వృష్టి.

సూచన 1: వెంట వెంటనేరావాలి.   సూచన 2: అర్థబేధం ఉండాలి.

3. లాటానుప్రాసము: ఒకే అర్థము ఉన్న పదములను తాత్పర్యభేదముతోమరల మరల చెప్పుట

పోతన భాగవతము నుండి ఉదా:    కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాధు  వర్ణించు జిహ్వ జిహ్వ

భరతవర్ష నుండి " ప్రేమతో నిండారు రాగము రాగము...నిస్వార్థ నిర్యాణమున జనియించు వెలుగు వెలుగు. నిండు మనసుతో జీవించు జీవి జీవి." (  అరుణతారకు క్రిష్ణన్ ను  అప్పగించు నపుడు యమున అంతరంగములో)

సూచనపదాలు రెండు వెంటవెంటనె రావాలి.

(అక్షరసమూహాలు కాక పదాలు అయి ఉండాలిఅర్థభేదము గాని శబ్దభేదము గాని ఉండారాదు.)

4. అంత్యానుప్రాసము: పద్యములోని పాదాలకు కాని, వాక్యములకు కాని చివరిభాగములో ప్రాస కలుగునట్లు అవే అక్షరములు మరల మరల చెప్పుటను అంత్యానుప్రాసము అని అంటారు.

ఒక  సాధారణ ఉదాహరణ:   అగ్గిపుల్ల   కుక్కపిల్ల,  సబ్బుబిళ్ళ, కాదేది కవితకనర్హం

సినిమా ఉదా: అరటి చెట్టుకు గెల,  నువ్వు విసరకు వల

భారతవర్ష నుండి : అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.  

భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం

యాస్యతి నందిని నందనందనం, నందనందనం మమ అదృష్టం.


5.యమకము: రెండు లేక, అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదాలు అర్థభేదముతో మరల మరల చెప్పుట .

సాధారణ  ఉదా:  మనసుభద్రకు మనసు భద్రమాయె  (మన సుభద్రకు మనసు భద్రమాయె)

సినిమా ఉదా:  నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు!

భారతవర్షనుండి: 

1.ఆర్యాణికల్యాణికాత్యాయణి,నీహారమేనిహారమైప్రకృతికిహారమైజీవులకు ఆహారమై నొప్పుచున్నదికదా!" (బసవడు మిద్దె పైనుండి కైలాసగిరి కొండను చూచుచూ)

2. సాధారణముగా ధారణము దప్ప రణము దెలియని సూరి బరిలో దూకిన ఓడుటయే కాక నెత్తురోడును. ఇది తధ్యమని తలచి మాలిని వర్షుని వారించి నివారించ లేకున్ననూ  రోదించి నిరోధించుట తక్షణ కర్తవ్యమని, పోరు వలదని పోరుచూ,  కన్నీటి కంట వాటముగ కవాటముకడ నిలిచెను.  వర్షుని లో అధిపుడంతరించి వీరజవాను అవతరించెను

3. కల్పము సంభవించునని వికల్పము చెందుట వీరపత్నిచేయదగునా!  నీ సంక్రాందనా క్రందనలునను  నను నిలువరించజాలవు విజయము వరించకున్ననూ రణము  అనివార్యము, సూర రణసూరి కాకున్ననూ, అధిపుడు  అధిపురుషుడు కాకున్ననూ  పురుషుడని గ్రహించుము. అని తల్లిని తొలగించుకొని కదనరంగమునకు సాగిపోయెను

భారతవర్షం తారంగం పద తారంగం, భారతవర్షం చదగరంగం పద చదరంగం

సూచన : పదాలు వెంట వెంటనె రానక్కరలేదు.

6.ముక్తపదగ్రస్తము : ఒక పాదములోచివరి పదాన్ని తరువాతి పాదములో మొదటి పదముగా ఉపయోగించదాన్ని ముక్తపదగ్రసతము అని అంటారు. ముక్తపదగ్రస్తము అని అంటారు.

సాధారణ  ఉదా:     సుదతీ నూతన మదనా

మదనాగతురంగపూర్ణ  మణిమయ సదనా!

భారతవర్ష నుండి :  భువనైక సుందర మాంగళ్య తోరణం భారత వర్షం సర్వతీ పుత్రం

సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం

అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అందాన్ని ఇచ్చేవి. ఇవి వందకుపైగా ఉన్నాయి

భారతవర్ష నుండి ఒక చక్కటి చిక్కటి ప్రాస (ప్రాసాలంకారము)                               

1.వెచ్చగ వచ్చిన విచ్చని మొగ్గను

మెచ్చని కాంతలు, కాంతుడు కాంచిన

ఓర్చని భామల కొచ్చెను పొచ్చము

పైయెద మాటున నవ్విన, సవ్వడి చేసిన చాలును

2. వేడిలేని కాలాన  వాడిలేనివాడు 

ఓడి  నేడు  మధుర వాడ వీడ

వేదించు ప్రశ్నలు బాధించు మనసును

శోధించి జానును సాధించుకున్న

భారతవర్ష నుండి రగడ ప్రాస: (భక్తకనప్ప చిత్రం లో కిరాతర్జనీయం కూడా ఇదే ప్రాసలో ఉంది.)

చిచ్చర పిడుగు వచ్చి పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టుబెట్టగా 

పెట్టె బాణము ధనుఒకచేతను అందుకొని చూసిన కంటను చూడగనే

గురిచూసినంతనే వేసినంతనే  తలలు రెండుగా విలవిలలాడుచు

 తనువు  కొండలా గిరగిరా తిరుగుచు అటుఇటుతగిలిన రెండుబాణముల

 తనువులు విడిచెను వరాహమూ 

కొట్టితి నేనని అర్జునుడు పడగొట్టితినేనని శివుడూ తొడగొట్టెను బీరముతో అపుడు

వేట   నాది  వేటు నాది వేటాడే చోటునాది సాటి తగవు పొమ్మని విలుమీటి  పలికే శివుడూ 

చేవనాది చేతనాది చేటెరుగని ఈటెనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు....

(పోలిక కోసం పాటలో కొంత భాగమే  ఇవ్వడం  జరిగింది ) 

భారతవర్ష నుండి రగడ ప్రాస:

భగభగ లాడే రేడే గడ బిడ గడ అడుగుల పడ 

జడి వడి వడి వడిగా సుడిలా కదిలెను తల్లే 

తడబడి జగడమాడు వాడటుబడి ఇటుబడి

కుడి ఎడమలగా ఆప జూడగా

సడి జూడక, మడ గడి  దాటెను రగడ మాడగ

రంకెలు వేయుచు అరినే పిలిచెను బరిలో దూకెను.

జల జల జల మని చమూచరులు ఆయుధీయులై దూకిరిగా

నిరాయుధయోధునిముట్టిరిగా ప్రాణములే మరి తీతురుగా

తత్తడి రయమున రేగి వర్షుడు పక్కటెముకలోజీరినంతనే

ఒక్కదెబ్బకే కుప్ప కూలెను పెంచలుడే నేలనంటెనూ!

అతడే అతడే వర్షుడురా  విలక్షణ అక్షర యోధుడురా!

కార్గిల్ పోరున అశువులు బాసిన వీర జవానుకి పుత్రుడురా

సాహిత్య ప్రియ ధీరుడురా వీరుడురా రణ సూరుడురా!

*గీతము లో కొంత భాగమే ఇవ్వబడినది

కొన్ని ముఖ్యమైన నిర్వచనములు :

ఉపమేయము     : వర్ణించదలచిన విషయము (దేని గురించి చెప్పదలుకున్నామో అది)

ఉపమానము    : పోల్చడానికి ఎంచుకున్న విషయము (దేనితో పోలుస్తున్నామో అది)

సమానధర్మము : ఉపమేయ, ఉపమానములో సమానముగా ఉన్న లక్షణము 

ఉపమావాచకము : ఉపమాన ఉపమేయమునకున్న పోలిక తెలుపుతూ అన్వయము  కుదిర్చే పదము

సాధారణముగా ఉపయోగించే కొన్ని అర్థాలంకారములు.

ఉపమాలంకారము : ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి అందంగాచెప్పుట

దీనిలో సాధారణముగ ఉపమేయోపమానములు, సమానధర్మము, ఉపమావాచకము ఉంటాయి.

ఒక సాధారణ ఉదాహరణ  : ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది.

భారతవర్ష నుండి : తూరుపు సిందూరపు వన్నెలతో ఉదయరాగము పాడుచుండెను. నగములు మేలిముసుగు దాల్చిన ముత్తయిదువులవలె నిలిచి యున్నవి. అగములు (వృక్షములు) మంచు మాలలు ధరించిన వధూవరులవలె నగుపించుచున్నవి. తూరుపు ఎర్రబారుచూ సిగ్గిల్లిన నవవధువు వదనము వలె నున్నది.

సూచన: ‘లాగ', ‘వలె‘, ‘లాంటి', ‘వలెనె' పదాలు కనిపిస్తే అది సాధారణముగ ఉపమాలంకారము

రూపకాలంకారము : ఉపమేయమునకు, ఉపమానమునకు రెంటికిని భేదము ఉన్నా కూడ లేనట్లే చెప్పుటను రూపకాలంకారము అని అంటారు

ఉదా:      రాజు మూడవకన్ను లేని ఈశ్వరుడు.

భారతవర్ష నుంచి : 

పురుషా సమూహే సుందర రూపే చలతి వనే సంభూయే (అందమైన పురుషుల సమూహము)

భువనో త్తారే,   సుధా  సమూహే   దివ్య మనోహర జాతే(భూమిపైకి దిగిన విదుల్లతా సమూహము)

యశోద తప్తే , కవితా దీప్తే,   యశోధన ఘన వన మాలె. (కవితా తేజము,  మండుతున్న భాస్వరము)

ఉత్ప్రేక్షాలంకారము : ఉత్ప్రేక్ష అనగా ఊహ లేక భావన అని అర్థము. అర్థము. సమానధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానముగాఊహించిచెప్పటాన్ని ఉత్ప్రేక్షాలంకారము అని అంటారు.

భారతవర్ష నుండి  ఉదా:  మీనాక్షి  నవ్వు ముత్యాలు దొర్లినట్టు ఉందినిగనిగ లాడు పసిమి దేహము, నవనవ లాడు పూరేకుల పెదవులు,  మిలమిల మెరియు ముత్యాల సరులు దంతములు, గలగల పారు సెలయేరు నగవులు, మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని మేని మెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది. (ఎర్రని అక్షరములు ఉపమాలంకారం)

సూచన: ఇందులో సమానధర్మము ఉండదు.

దృష్టాంతాలంకారము :రెండు వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబప్రతిబింబభావముతో వర్ణించ

(Two sentences presented as reflections of each other)

ఉదా:   ఉప్పుకప్పురంబుపద్యము, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.  

భారతవర్షలో బసవడు అగస్త్యుడు మధురవాడ వెతుకులాటలో

కొండ కోనలను చీకటి అలిమినట్లు  నిస్పృహ  మనసునలుము కొన్నది.

భారతవర్ష నుండి అరుణతార కేశవునితో చెప్పిన కవిత

చిత్రములడగవు కథలు చిత్రముగా కదిలించు మనుషులను

రాగమాలికలై రంజన చేయును మనసులను మాలిమి

చేయును మూలికలై, ఏలికలై ఏలుచుండు భాషా పేదల

మనసుల  తేలుచుండును కథలై  కావ్యములై, తరతరముల

 మనుషుల కలుపుచుండు తరగని సిరులై నిలిచి యుండు

సినిమా నుంచి: అన్నానికి అరిటాకు - సున్నానికి తంబాకు - పుణ్యానికి స్వామిపాదం తాకు

అతిశయోక్తి అలంకారం : గోరింతలు కొండంతలుగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అని అంటారు.

ఉదా:  కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

భారతవర్షలో అలంకారాలు లెక్కకు మిక్కిలిగా  యున్నవి.  బహుళ అలంకార భూషిత కావ్య కన్య.   (ఇది అతిశయోక్తి అలంకారము) మరికొన్ని అతిశయోక్తి అలంకారాలు. 

విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి వర్ణన

కైలాసగిరి పై పరమేశ్వుడు పార్వతిని కూడి కొలువు తీరి చూచుచుండ ఆదిదంపతుల ప్రమోదమంద ఇనుడు చిరునగవులు చిందించుచుండె. నిహారస్నాన మాచరించిన ప్రకృతి  కాంత  లోకచక్షు పసిడి మయూఖ రేఖలందు తన అందముల నారబెట్టుకొని  నిగనిగలాడు మెరియుచున్నవి.

ఢిల్లీలో సాహిత్య అకాడమీ భవన  వర్ణన

శిల్ప నిర్మాణ  సౌష్టవమును కలిగి  సాహిత్య సంగీత కళా హారముల కాంతులీను యోష,   త్రివేణీ సంగమ ఘోషను ముహుర్భాషా శ్వాస లో నిలిపి భారత రాజధాని యందు సాహిత్య జ్ఞాన జిజ్ఞాసులకు  సోపానములవలె  జిగజిగ లాడు జియ్య వలె, సనాతని విశ్వరూపమువలె   వెలుగుచు భూరి నగరు యొకటి కోపర్నికస్ మార్గమందు కళాదేవళ ధ్వజ

స్తంభమువలె నిలిచియుండెను. లలిత్ కళ అకాడమీ, సాహిత్య కళ  అకాడమీ మరియు సంగీత నాటక్ అకాడమీ అను  మూడు జాతీయ అకాడమీల ను కలిగి యుండు Y- ఆకారపు భవనమదియె.

హైదరాబాదు మణికొండ వర్ణన

బహుళ అంతస్తుల నగరులుతో మాదాపురమును తలదన్నునట్లుండు మణికొండ కాశ్మీరు  కంబళి పై నుంచిన  గజ దంష్ట్ర నిర్మిత రత్నమ   కళాఖండ ము మనిన అతిశయోక్తి కాదు. మణికొండ నందు పది సంవత్సములు కు పైగా నిర్మించిన ద్వాదశ హార్మ్యముల  లాంకో హిల్స్  యను ఒక సుందర పట్టణము మణికొండ  శిరమున బంగారు  కిరీటము వలె నొప్పు చుండును.  నిశీధిని విద్యుత్ దీపకాంతులీనుచూ  ద్వాదశావతారము వలె అగుపించు. ద్వాద ఆకాశ హార్మ్యముల నడుమ  సిగ్నేచర్ టవర్స్ యను భూమండ లోత్తుంగ ధామము మహాపర్వతమును పోలి గగ నాంతర రాళము లోనికి  చొచ్చుకొనిపోయి  చూచువారి శ్రీ మహా విష్ణువు సాక్షాత్కరించినట్లగుపించును.

పదునాఱవ జాతీయ రహదారి వర్ణన  తేటగీతి పద్యంలో

తేదునారు వర్షము లనక  బెండ్లి జేయ   

   మిళ నాట వధువు  దారిచూ చువెడలె         

   ఆంధ్ర  గడప  దాటి  డిసాను ముద్దిడి 

   కొత్త   కోడలు చేరె లకత్త  పురికి

 

పదునారు సంవత్సరముల పిన్న వయసులో తండ్రి పెండ్లి జేయగా  చెన్నపట్టణము  నుండి బయలు దేరిన వధువు  మధ్యలో నున్న  ఆంధ్ర  ఒడిస్సాలను దాటి  కలకత్తా లో నున్న తన అత్తవారింటికి బోవుచున్నట్లు అగుపించునుఆంధ్ర దేశము తన గడప, గడపదాటి, ఒడిస్సాయను  ముద్దాడి  సుదూర ప్రయాణము జెసి తన అత్తవారింటికి చేరిన వదువువలె (పదునాఱవ జాతీయ రహదారికనిపించునుఅనగా  

 

"సొగసు చూడ  వలెనన్న కనులున్న  చాలదన్న 

కనులకు దొరకని అందము కవితకు దొరుకునన్న

కవితా హృదయ మున్న  తిన్న పెంపారునన్న     

అన్నన్న! అన్నుకు  పొన్ను కూరునన్న!     

 

 

చమత్కారం ; చమత్కారం కూడా అలంకారమే , దీన్ని ఆంగ్లమందు రిపార్టీ అందురు

కేశవుడు అనాధ,   మార్దంగికుడు అంటే మృదంగం వాయించుకునేవాడు. అతడు భాషా పండితుడు కూడా అతడు భారతవర్ష  అనే  పండితుడి ఇంట విశాఖలో ఉంటూ తన చెల్లి కొరకు  (తనను పెంచిన  తల్లి కూతురు)   తన స్వగ్రామం బల్లిపాడు వెళతాడు. తిరిగి విశాఖ పోడానికి బయలుదేరి చెల్లి పార్వతి తో కలిసి  బల్లిపాడులో నడుస్తుండగా 

కేశవుడు: జక్కనవల్ల  కైదల , క్షేత్రయ్య వల్ల  మొవ్వ , సిద్ధేంద్రయోగి వల్ల  కూచిపూడి , అన్నమయ్య వల్ల  తాళ్ళపాక, ఆదిభట్ల వల్ల  అజ్జాడ అటు చరిత్ర లో  ఇటు జన హృదయములలో  శాశ్వత కీర్తిని పొందలేదా? పల్లె ఒకనాటికి దివ్యకాంతులీనవలెను.

 అట్లు బోవుచున్న వారికొక యువకుడు ఎదురు వచ్చుచూ కేశవుని జూచి నవ్వి " మొన్న ఉత్సవ కార్యక్రమములో నీ మృదంగవాదమదిరెను కానీ ఎప్పుడూ డోలు మేడలో ఉండవలెనా ? ఏమిచేతువోయి నిత్యమీ డోలుతో ? యని వేళాకోళము జేసెను.

 పార్వతికరికాలి మంట నెత్తికెక్క " దొమ్మీ రేడా , నీవేల అంత  పెద్ద  చరవాణి చేతపుచ్చుకుని తిరుగుచున్నావు ?     అది నిత్యమీ నీ చేతనుండవెలనా ?"  యని అడిగెను.

"దిస్  స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఫ్రెండ్స్ యు నో"  యనాంగ్లమున బింకముగా పల్కినాతడికి

కేశవుడు   దిస్  స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ గాడ్ యు నో   యని  చెప్పెను.

అట్టి ఘాతమునూహించని బుడతడి తేజమడికి వత్తి కాలెను. (Fuse blown out)

శబ్ద ప్రాస : పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్య ప్రాస                                    

టటకిట, టట్టకిట్ట, టటకిట్ట, టటట్ట,     టకిట్ట, టట్టకిట్ట, టకిట

టట్టకిట్ట, టకిటట్ట,  టటోన్ముఖ, టంకృతి స్ఫుటోత్కట, పటహాదినిస్వన,

 వియత్తల దిక్తటతాటితార్భటో ద్భటపటుతాండవాటన,

""కారనుతా! బసవేశ పాహిమాం!

   శబ్ద ప్రాసను శిఖరాగ్రము పై నిలిపిన  భారతవర్ష ఉత్కృష్ట శబ్ద ప్రాస 

రైలుగోదావరి వంతెన మీద పోవుచుండగా రైలు ధ్వని,లయరెండునూ మారినవి. కేశవుడు ధ్వనిని ఆలకించి

"షడగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  గ్ణడగ్డ్  డని ఈడ్చుచు,

గ్ణడగ్ణడగ్డ్ట్గగ్ణ గ్ణడగ్డ్  ట్గగ్ణగ్డ్ డని లాగుచు

 ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ డను లోహానిస్వ

నమ్మున గిర గిర దిరుగు అరుగు చక్రముల్

 క్రిక్చ్కక్ క్రక్చ్కక్ యని పెక్కు స్ఫులింగముల్ 

 కక్కుచు షడట్గగ్ణ టడగ్డ్షడగ్డ్  అంచు లంఘించు

 రాక్షస క్రీంకార శక్తి స్వరూప పృషదంశ మిత్ర

షడగ్డ్ ట్గగ్ణగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  బోకారేశ్వర పాహిమాం"  



ఆ .నిత్య   ముభాషా  నందము నిచ్చు  కవిత       

         చదవ  గపుష్ప   మువలే   విచ్చు కొనుచు        

       విచ్చు   కత్తుల    బోలుచు వెచ్చ  గవెలు 

       గిచ్చి    జగముల  న్నియువెలి గించి పోదె 


11 comments:

  1. 10 వతరగతిలో తెలుగలో 100 కి 99 మార్కులు వచిన్న ఎక్కని అలంకారాలు ఇప్పుడు నా బుర్రల్లోకి సూటిగా ఎక్కయు.... ఈ కాలం పిల్లలకి తెలుగు బోదించడానికి మీ ఒక్క బారతవర్ష చాలు....
    ఆ కాలంలో ఎందరో కవికోదుల గురించి, సాహిత్య పితామహుల గురించి చదువుకున్నాం.... మా కాలంలో మీ రూపంలో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం.... ధన్యోస్మి గురువుగారు.

    ReplyDelete
    Replies
    1. అభ్యాసే వర్ధతే భాషా, సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు.

      Delete
  2. గుణయేన ప్రకాశయతి తిలకః నమస్కరోమి గురుజీ

    ReplyDelete
  3. ఒక కాపీ కావాలి సార్, మేము కూడా చదివి తరిస్తాము.

    ReplyDelete
    Replies
    1. ముద్రణ పూర్తి అవ్వగానే ఒక ప్రత్యేక మైన కాపీ పట్టుకొచ్చి మరీ ఇస్తాను. ఈ లోగా భారతవర్ష లో అలంకారాలు , భారతవర్షలో నవరసాలు అంటూ ఇలాటి ఆర్టికల్స్ రాస్తూ, భారతవర్ష పై అవగాహన పెంచుతూ టీ వీ లో భారతవర్షపై సాహిత్య చర్చలకు తయారవుతూ కాలం గడిపేద్దాం. ఒక చర్చకి మిమ్మల్ని ఆహ్వానించాలనుంది. కానీ ..

      Delete
  4. పయనించితిని భారత వర్షతో ఎనిమిది మాసములు.విహరించితిని మరో లోకములో, ఏరుకొంటిని అక్రర కుసుమాలను. అందమైన కుసుమాలు ఏరి మరో మారు ఈ భాగములో పొందు పరిచితిరి.భారత వర్ష కావ్యం ముగిసిననూ సుగంధ పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. ఇది నిరంతర సాహిత్య యాత్ర అని నిరూపిస్తూనే ఉంది.చిన్నప్పటి నుంచి తలా తోకా లేని ఆంగ్ల వ్యాకరణం అనిప భయము. తెలుగు అనిన, తెలుగు ఛందస్సు అనిన ప్రియము.ఇప్పుడు తెలుగు భాషపై ఇంకా మమకారం పెరిగింది. భారత వర్షను ఇన్ని నియమాలు పాటిస్తూ రాశారని అస్సలు ఊహించలేదు.
    మీ కఠోర శ్రమకు, దీక్షకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.🙏🙏🙏




    ReplyDelete
  5. Sir edi chadhuvuthuntea manasuki enta anadamuga unadi sir rayadanike kani chepadanike kani bashalu leavu sir bavalu tapa . sir epudo chinapudu chadhuvukunamu sir alakaramulu avi sariga gurthu kuda leavu sir kani meru chepthuntea oko alakaramu yuka andamu gopathanamu adi merru bharatavarashalo vadine teru chala chala adbhutamuga unaye sir . sir asalu meru rasina padhayaluvatilo alakaralu abha denike adea sati sir . ha padhyalu meru paduthuntea vinali ani unadi.sir meru rasina kavithavamulu ento bagunayo prati akasharamu venkala me krushi , me patudala, sahityamu patala meku una estamu telusthunadhi sir oka manshi tana jeevitani krushi laga maristea elanti gopa kavayulu vastaye sir .sir meru anatu edi kavayamu kadhu sir maha kavayamu .sir asalu ha varananalu enta bagunayo sir paravachinche pothunamu me kavayamu chadavuthuntea danitho patu maku gnanamu kuda vasthunadhi sir . asalu jathiya darulu varanana balea unadi sir ha railu gadavari dati padhayamu evi ani chadhuvuthuntea epudu book vasthadi epudu anta chadivi anandinachali ani unadi sir.

    ReplyDelete
  6. Sir chala bagundhi sir chala baga vidamarichi alankarala gurinchi chala sulabanga ardham ayyeh vidham ga chepparu and na school days gurthichayi sir ivvi chaduvutuntay maruyu ilantivi inka rayandi sir.

    Danya vadamulu

    ReplyDelete
    Replies
    1. Thank you Raki. kindly use Telugu script . It is easy to read.

      Delete
  7. Excellent, I do not know there is so much in our mother tongue. Kudos to your efforts.

    ReplyDelete