Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, August 2, 2020

Bharatavarsha 16

చరవాణి రవలు పలుకుచుండ మేల్కొనిజూడ సమయము 8 గంటలు  కావచ్చుచున్నది. చరవాణి చూడ బసవడి పేరు కనిపించెను బసవడేందుకో పిలుచుచున్నాడు.  " ఇప్పుడే లేచితిని  ఇంకను పళ్ళుతోములేదు,  అని ప్రారంభించెను.  చాలా ఏండ్లతరువాత మా అమ్మ వద్దకి వచ్చి ఉంటిని యనుచు మాటలాడుచుండ చావడి గదిలో ఏదో అలికిడయ్యెను. "అమ్మ తయారయ్యి సిద్ధముగా ఎచటికోపోవ సిద్ధముగా నున్నది." మరల మనము మాట్లాడుకొనవచ్చును" అని అగస్త్యుడనగా " నిద్రపోతువలే ఇంతసేపు పడుకొని ఇప్పుడు పరిగెత్తుచున్నావా?”యని బసవడనెను, “నీవు తిండిపోతువు నేను నిద్రపోతును కాదన్నవారెవరు” యని అగస్త్య వాణిని ఖండించెను. “అమ్మా ! నేను విశాఖపట్నము పోయెదను.” అని పలుకగా. “నేడుంది రేపుపొమ్ము.” అనెను మీనాక్షి. “నేడుపోవుట ముఖ్యము నన్ను పోనిమ్ము మరల వత్తును.” నేడు నీతో అత్యవసరమైన పని ఉన్నది  ఉండవలెను " యని  అగస్త్య ను ఒప్పించి తనతో పాటు పాఠశాలకు రావలెనని చెప్పగా 

అగస్త్య తయారయ్యి బట్టలు ధరించి వచ్చెను. అగస్త్య పదపోయెదమని మీనాక్షి ముందుకుసాగెను. ద్వారము దాటిన పిదప " తాళము వేయుట మరిచినావు " అని అగస్త్య అనగా వారు నిద్రించుచుండిరి. యని మీనాక్షి పల్కిన  తోడనే అగస్త్య మొఖమున రంగులు మారినవి. మీనాక్షి అది గమనించి గమనించనట్లు నడవ( corridor) కేసి నడవ సాగెను. అగస్త్య ఆమె వెనుకనే నడుచు చుండ అతడి అంతరంగమున ప్రశ్నలు పరిగెడుచున్నవి " అతగాడెవ్వడు? పేరేమి? వృత్తి ఏమి? వయస్సు ఎంత? మనిషి ఎట్లుండును ? గుణము ? రాత్రి ఎంత గొడవ పడినారు మా అమ్మను చెంప దెబ్బ కొట్టిన  నూ ఆనందముగా నున్నది. ఏమీ జరగనట్లు ఎందుకు నటించుచున్నది? 

ఈమె నన్నెక్కడికి కొనిపోవుచున్నది?" అప్పుడు అతడికి ఒక వింత కోరిక వచ్చెను పరిగెత్తుకుని వెనక్కుపోయి నిద్రించుచున్న ఆ నారాధముడిని  పిడిగుద్దులు గుద్దవలెను"  మీనాక్షి ఎత్తు గదిముందు నిలిచి తలుపు తీసెను. సువర్ణశోభలీను అద్దాలగది లోకి తల్లి అడుగు పెట్టగా పక్కనే అగస్త్య నిలిచి క్రిందకి పోవు మీట నొక్కెను. “బట్టలు కొనిపెట్టుటకు తీసుకుపోవుచున్నదేమో” అనుకొని  ఆ తలంపుకు నవ్వుకొనెను. సింహద్వారం దాటి బయటకు వచ్చి, జాతీయ రహదారిపై నిలిచి ఉన్న బస్సును చూసి వడి వడిగా నడుచుచు బోయి మీనాక్షి బస్సునెక్కెను.  అగస్త్య వాహనము పై వ్రాసియున్న పేరు శ్రద్ధతో చదివేను " జాస్మిన్ ఇంటర్నేషనల్ స్కూల్ "  అగస్త్య బస్సెక్కి తల్లి పక్కనే కూర్చొనెను. బస్సు బయలుదేరెను.


పది నిమిషములలో బస్సు ఒక సువిశాల ప్రపంచములోకి అడుగిడెను. గృహ సముదాయ సౌందర్యమంత  మనోఫలకముపై వేసిన ముద్రను జాస్మిన్ అంతర్జాతీయ పాఠశాల   ప్రవేశద్వారం పైనున్న శిల్పకళా చాతుర్యము తుత్తునియలు చేసెను. కవి కల్పనా శక్తినతిక్రమించిన నిర్మాణ చాతుర్యమేదియో అచ్చట సచేతనముగా నున్నది. వాహనము క్రమగతి యందు ఎన్నోదృశ్యములు నేత్రపటలము పై క్షణకాలము  మెరిసి మాయమగుచున్నవి. క్షితిజముల వెంబడి పేర్చినట్టున్న కొండలు    భువనమునకు హద్దుల్ని చూపుచున్నవి.  కనుచూపుమేరలో కనిపించు పచ్చిక పట్టు ఒక జలధివలె నగుపించగా, ఆ పచ్చికపై  పాఠశాల భవనము జలధిన తేలుచున్న ఓడవలె, శుక్రగ్రహమును వీడి వచ్చిన జగనోహినే యనిపించెను.  ఖగోళపరిశోధనా శాల యందు అడుగిడి  నక్షత్రావలోకన జేయు పరిశీలకునివలె మనంబు నద్భుతాతిశయమ్మును  పొందెను.  బస్సు భవంతి ముందున్న రాజకల్పమహాశ్వేతఛత్రము క్రింద నిలిచెను.  బస్సు దిగిన తర్వాత మీనాక్షి " పాఠశాల ఎట్లున్నది ?" అని అడుగగా  మీనాక్షీ నందనుఁడు "ఈ మహార్ణవం ముందు ఏదైననూ దిగదుడుపేకదా !" అని తల్లిని అనుసరించెను

పాఠశాల ముఖ్య అధిపతి తిరు రామచంద్రన్ వద్దకు కొనిపోయి తనకుమారునకు పాఠశాలచూచుటకు అనుమతికోరుచు లిఖితపూర్వక పత్రమును నిచ్చెను. తిరు రామచంద్రన్   చిరు మందహాసము జేసి నేడు మీకు ఎన్ని తరగతులు కలవు యని విచారించి మధ్యానము తరగతులు లేవని చెప్పగా, భోజనసమయము తరువాత ఇంటికిపోవుటకు ఉదారముగా అనుమతినిచ్చెను. 

బయటకు వచ్చు అగస్త్యకు ఒక  జంటకనిపించేను . వారు నిన్న రాత్రి ఇంటికి వచ్చిన జంట. " వీరు ఇచ్చట పనిచేయు సిబ్బంది కావచ్చు అనుకొని ముందుకు సాగెను. మీనాక్షి నడవలో ( కారిడార్) నడుచుకుని సాగుచుండ అగస్త్య ఆమె వెనుక పోవుచుండెను. 5 నక్షత్రముల సత్రమును తలదన్ను క్షేత్రము మది. తల్లి అక్కడ ఆగి నీవు ఏమైననూ ఉచితము గా తినవచ్చు, వలసినది తిని పాఠశాల  భవనము చూసి రమ్ము నా తరగతి గది అదిగో , నేనిచ్చటనే ఉందును. అని జెప్పి మీనాక్షి తన తరగతి గదిలోకేగెను.

అగస్త్య ఉపాహారం తినుచూ , భావనసౌదర్యమును ఆస్వాదించుచూ బసవడు గుర్తుకురాగా " ఉచితముగా పెట్టు బసవడు కదిలిన ఒట్టు." అను మిత్రులు అనుమాటలు  గుర్తుకొచ్చినవ్వు వచ్చెను. నవ్వుచున్న అగస్త్యునికి వెనకనెవరో తనతోబాటు నవ్వుచున్న ట్లనిపించి క్రీగంట చూడగా ఎవరో ఇద్దరు , సిబ్బందివలె నున్నారు , తినుచూ నవ్వుకొను చున్నారు. అందొకడు నల్లవాడు మరొకడెర్రవాడు. నల్లడెర్రడితో, " వందలకోట్లు పోసి ఎవరో జైనులు,  బహు బలిసిన  గుజరాతీ వ్యాపారులు కట్టిరట ఈ పాఠశాల. వారు మాటలను బట్టి వారు కొత్తగా జేరిన శారీరక శిక్షణ విభాగము , ఆల విభాగమువారని అగస్త్య అర్ధము చేసుకొనెను. ఎర్రడునల్లడితో " ఇక్కడికొచ్చేవారంతా బలిసినోళ్లే. బాగా ధనము మూలుగుచుండిన ఏమిజేతురు పిల్లలను లక్షలు కట్టి ఇక్కడ జేర్చుచున్నారు. ఇక్కడజేరిన నివసిస్తున్న  పిల్లలలో ఎక్కువమంది తల్లితండ్రులకు అక్కరలేని సంతానమే. మన జీతము లేమున్నవి. అధిపతి జీతము చూడుము వాడికి నెలకి ఐదు లక్షలట.

అదృష్టమనిన అట్లుండవలె.  కష్టపడకనే సర్వ భోగములను అనుభవించుచున్నాడు. వాడి కళ్ళు అన్నీ ఆ మీనాక్షి మీదే. మీనాక్షి అందమే అందము. నీకు మొదటి మీనాక్షి అనిన ఎంత ఇష్టమో నాకు రెండవ మీనాక్షి అనిన అంత ఇష్టము. రెండవ మీనాక్షి ఎవరు ? అని అడిగెనొకడు. గాత్రము చెప్పు అంగయార్ కన్నె, తమిళములో అంగయార్కన్నె అనిన మీనాక్షి అని అర్ధము. నీవెన్ని జెప్పిననూ పియానో మీనాక్షి స్థాయికి జేరగల అందము ఈ పాఠశాలలో ఎవ్వరినీ లేదు. రంభతో పోటీ పడగలిగే  కుంభములున్న.. వినలేక  అగస్త్య అచ్చట నుండి లేచెను.  

నడవనందు మరబొమ్మవలె  నడుచుచున్న  అగస్త్యకు  బాహ్య సౌందర్యములేవియునూ  కానరాకున్నవి.   వివిధ విచిత్ర భావనల తాకిడినందు తన వ్యక్తిత్వమును పునర్నవీకరణము అగుచున్నదన్న  ఎరుకలేక సాగుచున్న అగస్త్యకు  బాహ్య స్పృహ ముడిఁగిన ఇంద్రియములు తత్తయ్యలు విని స్మారకమును పొందినవి.    తత్తకతక.తత్తకతక. తత్తకతక.  పక్కనున్న తరగతి గదిలో  వరదాచారి నాట్యమందు నిమగ్నమయ్యెను.  ఆ నాట్యమందు అగస్త్య  మనసూరట పొందెను . పిల్లలందరూ నాట్యం చేయుచున్నారు.  ఆచార్యుడు లయ మార్చి  కొత్త తాళం అందుకొనెను. "థాథా  తయ్యకు దిద్దిమి"  ఆ నాట్యము చూచు చుండగా తెలియకనే  కాలమెట్లో  గడిచిపోయెను. అగస్త్య ముందుకి కుడి చేతివైపు తిరిగెను. గాత్రం తరగతి జరుగు చున్నది. స్వర  ప్రవాహము వెల్లువెత్తుచున్నది. రెండవ మీనాక్షి అంగయార్కన్నె  చూసి నవ్వెను  అగస్త్య కూడా నవ్వి  ముందుకు కదిలెను.  విరామ సమయమును సూచించుచూ గంట మ్రోగెను.  అందరూ బైటకు వచ్చుచుండిరి. ప్రాంగణమంతయూ కలకలముగా నున్నది మీనాక్షి, అంగయార్ కన్నెబయటకు వచ్చి తేనీరు సేవించుచుండిరి. అగస్త్యుడు వారిని దూరమునుండి చూచెను.  అతడి ముఖము ముకుళి తమాయెను.    

3 comments:

  1. బాబోయ్ చదువుతుంటే మునిగి పోతున్నట్లుగా ఉంది

    ReplyDelete
  2. O my god. Unexpected twist. I couldn't guess intension of Meenakshi? Why she revealing her secrets to her son?

    ReplyDelete