Wednesday, August 19, 2020

Bharatavarsha 24

ఆనందపురము సమీపమున కలుఉప్పాడ గ్రామీణక్షేత్రమందు సస్యపరీవృతమై, నవ్యమై భవ్యమై అలరారు మహోన్నత భవంతితొకటి మేరు పర్వతమువలె నిలిచి కౌముది యందుతడిచి  కాంతులీనుచుండెను. అర్ధనిశ సమీపించుచుండ కలువచెలి కౌగిట పాలమబ్బులు పరవశంబునుబ్బతిల్లుచుండెను. నగరమునకు అన్యమైన   ఆ సువిశాల మిద్దెపై నొక  మదనాత్ర సంచలిత జవ్వని సంచరించుచు, మగని రాకకు ఎదురు చూచుచూ సోమజ్వాల యందు కాగుచు, లేలిహ(snake) దేహమును  నిడుపాటి కుర్చీయందు కాస్సేపు చౌకాలి-పీటపై కాస్సేపు పలు భంగిమల మార్చుచూ  మిద్దెపై  సంచరించుచుండెను. చంద్రకాంతి యందు నీలోత్పలము ( నల్ల కలువ)వలె మెరియుచున్న  ఆ  జవ్వని విరహ జ్వరమును తాళలేక,  తామరదళా కృతినున్న ఈతకొలనందు  దుమికి ఈదులాడుచుండెను. అప్పుడే వచ్చిన సఖుని కంటికొలను నుండి చూచి యాకామిని ముఖమును  తిప్పుకొనెను. అంతనతడా కొలనునందు దిగి ఆమె వద్దకు బోయి “జిలేబి!” యని ఆ జవ్వని చుబుకమును తనవైపు త్రిప్పుకొని “నల్లని మత్యమువలె ఈదులాడుచున్న నిన్ను చూచుచున్న ఇచ్చట తామరతూపరి (cupid) కాపుగాసెనేమో యనిపించుచున్నది” అనెను “రూబీ! వచ్చితివా! అయినదా మీనాక్షీ నందనునితో సంవాదము, మిక్కిలి జాగు జేసినది జాలక మీనము వలెనున్నావని పరాచకములాడుచున్నారు. అవ్వ! ఇంకా రొయ్యవలెనున్నావనలేదు. బుద్దులెచ్చటికి పోవును?” అనగా అతడి మొఖం వివర్ణమయ్యెను. అతడి మొఖములో విచారము జూసి మరుక్షణము “పరాచకమాడితిని నిజమనుకొనుచున్నావా? నీ కొడుకు నీ ఇష్టము, యని మృదుభాషణములు పలుకుచుండ ఆమె నోటినిమూసి కొద్ధిసేపు జలక్రీడలాడెదము పిదప సంవాదము. తక్కినవన్నీ వేచి యుండగలవు యనుచు ఆమెను కొలనులోకి నెట్టెను. 

పైకి వచ్చినామె ఒక పీఠముపై కూర్చొనగా,  ఆర్ద్రత నున్న ఆమె ప్రక్కనే అతడు కూర్చొనెను ఆమె కొంచెము దూరము జరిగికూర్చొనెను.  నీవు ప్రేమతో రూబీ యని పిలిచిన నేను యువకుడిని అయిపోవుదును. " తీయగా నుండుటచే  నన్ను జిలేబి అనుచున్నావు, నీవు ఎర్రగా యుండుటచే , నిన్ను రూబీ అనుచున్నాను" ......అతడు చేరుకొనబోగా ఆమె పరుగున బోయి చౌకాలి పీఠమునధిరోహించెను...... మరల అతడు సమీపించబోవుచుండ.... నిడుపాటి కుర్చీయందు కూర్చొని కవ్వించెను. “నీవు నన్ను జూడక కొద్దిసేపు పూర్వమే వచ్చి నక్కియుండి నీ యోగాసన భంగిమలను చూచితిని. ఇప్పుడు హంపి విరూపాక్ష శిల్ప లావణ్య విలాసమును జూపి, నన్ను పురిగొల్పి అందకున్నావు అనుచూ ఒక్కఉదుటున అలవలె నెగసి ఆమె చేయందుకొనెను.   శశాంకుఁడు మబ్బుల చాటుకి జారుకొనెను. కొలది సేపు వారిరువురూ ఈత  కొలను గట్టు పై మీనములవలె మైధునమాచరించి పిదప పడకింటికి పోయిరి.

శయ్యపై పడుకొని గవాక్షం నుండి చంద్రుని చూచుచూజిలేబి! నేడు మనసెందుకో మహానందము నొందినది. అగస్త్యుడు రేపు కళాశాలకు బోవలెనని జెప్పినాడు. వలసినవి కొనిపెట్టి పంపించి

ఉంటిని. అగస్త్యుడు వెడలినాడు” “తనయుని జూచిన తండ్రికైననూ ఆనందమే కదా”.  ఆనందము వాడిని చూచినందుకు కాదు వాడియందు చిన్న మార్పు చూచినందుకు. “ఇంతలోనే అతడిలో మార్పు చూచితిరా! అతడిలో మార్పుయనిన అత్తిపూచినట్లే.(అసాధ్యము)  "బహు సంకుచిత స్వభావము అంతలోనే ఎట్లు మారును?"

 నేటి మధ్యానము అతడు సంస్థ ఆవరణలందు కలియ తిరిగినాడు.తీక్షణ శీతలగది (ఛిల్ల్ రూమ్) యందు విహరించినాడు. నేడు నేను జాన్ తో మాట్లాడుతున్నప్పడు పక్కగదిలో పరదా వెనుక నిలబడి నన్ను గమనించుచున్నాడు." 

"నేటి యువతీ యువలకు లైంగిక జ్ఞానము లేదు లైంగిక స్వేచ్ఛ కావాలె నందురు కానీ అది ఇతరులకు దక్కిన దుఃఖింతురు"

 నేటి యువతీ యువకులేకాదు పెద్దలుకూడా అట్లే యున్నారుచక్కగా చెప్పినావే యనుచు చెక్కిలి నిమురగాపలు పుస్తకములు చదివియుంటినినేటి జనులు పఠనము లేక బ్రష్టు బట్టినారు, చదవక కూపస్థమండూకములవలె  ఇతరుల వ్యక్తిగత విషయములలో జోక్యం కలిగిచుకొనుచూ మారీచులవలె మారి  స్త్రీలను వేదించుచున్నారు. 

ఐరోపా బోయినపుడకడ చూచితిని కదా ఒక కప్పు కాఫి త్రాగు సమయమున మాటలాడుచు స్త్రీపురుషులు మనసులు కలిసిన జాలు కొద్ది సమయములో శృంగారేచ్ఛను తీర్చుకొందురు. ఇట్లెంతమందినో కలిసి యుండుటవల్ల  వారు మరల ఒకరినొకరు  కలిసిన ముఖమైననూ గుర్తుపట్టలేరుఅందరు  అట్లుండవలెనని కాదు కానీ ఇచ్చట వారివలె నుండరాదు

అబ్బో ఉపన్యాసము బాగా దంచుచున్నావే! అనేక పుస్తకములు చదివితివా పుస్తకములు చదివినావు? ఎక్కడ చదివినావు?

మన  ఇంటి  గ్రంధాలయం లో  మీరు సేకరించిన పుస్తకములే చాలును. ఎచ్చటికో పోవాల్సిన పని ఏమున్నది? అని చెప్పుచూ  తానీ మధ్యనే చదివిన కాదంబరి గూర్చి చెప్పసాగెను.

 శ్రీహర్షుని ఆస్థానకవుల్లో ఒకడైన  బాణభట్టుకాదంబరి” యను వచన కావ్య రచన జేసినాడు. కాదంబరి ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు. అందొక కథలో శ్వేత కేతువనే మహర్షి, నలకూబలుడిని మించిన అందగాడు, పుష్పములకొరకు ఆకాశగంగలో దిగినపుడు పద్మదళము పై కూర్చొనియున్న లక్ష్మీదేవి అతడిని జూచి మోహించి చూపులతోనే సంభోగ సుఖమనుభవించి బిడ్డను కని మహర్షికి అప్పగించినట్లు వ్రాసెను. నేటి సమాజములో పురాణములలోలేని కథను అట్లు వ్రాయగలడా? వ్రాసిన బ్రతకనిత్తురా? వేదించి   చంపివేతురు" అని ముగించెను.

 దక్షిణమూర్తి: నీవుచెప్పినది నిజమే చదవకుండుటవల్లే ప్రజలకు బుద్ధి నాశనమైనది. పురాణములలో ఏమున్నదో తెలుసుకొన జాలకున్నారు. గ్రీక్ ,రోమను , భారతీయ పురాణములేవైననూ  ఉన్నదంతా స్వేచ్చా శృంగారమే కదా. గ్రీకుపురాణమందు గేయా  భూమాత,యురేనస్  ఆకాశదేముడు. గేయా, యురేనస్ యొక్క తల్లి మరియు భార్య. వీరికి క్రోనస్ చివరిగా జన్మించిన బిడ్డ. తల్లి ఆజ్ఞానుసారము క్రోనస్ తండ్రి యురేనస్ను వధిస్తాడు.  

మొదటి శతాబ్దపు గెలీలియన్ యూదు మహిళ యోసేపు భార్య, యేసు తల్లి యగు  నజరేతు, మరియు ఆమె బంధువు పూజారి జెకర్యా భార్య యగు ఎలిజబెత్  పవిత్రాత్మతో కలిసి   బిడ్డలను పొందారుఎలిజబెత్ వివాహిత, నజరేతు కన్య పాత్రలు మహాభారతం లో కుంతిని పోలి ఉంటాయి. నాటి స్త్రీలను  వారు అంత  వమానించ లేదు.

 

 పురాణముల విషయము అటులుండనిమ్ము, ప్రజాస్వామ్యము రాకపూర్వం 18 శతాబ్దము వరకు ఫ్రాన్స్, జెర్మనీ చైనా ఎక్కడ చూచినా రాచరిక వ్యస్థలే ఉండెను. భారత దేశమును పరిపాలించిన మొఘలులు నుండి    ఫ్రెంచ్ లూయీ రాజులు, చైనా మింగ్ చక్రవర్తులు, రష్యా జార్ ప్రభువులు ఎవ్వరైననూ ఒకొక్క రాజుకు పెక్కు భార్యలుతో బాటు అనేక సహచారికలు (ఉంపుడుగత్తెలు)

ఉండెడివారు. రాజుల వలె కవులు మేధావులు తత్వవేత్తలు కూడా  ఎక్స్ట్రా మరీటల్ లియేజన్స్  (వివాహేతర సంబంధములు) నెరిపిననూ వారి గౌరవమునకు ఏమియునూ భంగము రాలేదు. ఉదాహరణప్రాయమైన ఫ్రెంచ్ ఎన్లైటెన్మెంట్ ఫిలాసఫర్ (వేదాంత జ్ఞానోదయమూర్తి) గా కీర్తి కెక్కిన వోల్తేర్, స్విస్ ఇల్లస్ట్రస్ రైటర్  (ప్రబోధాత్మ రచయితరూసో  విగ్రహములు , వారి  లైంగిక, వ్యక్తి గత జీవితములో ఎన్ని లోపములున్ననూ,   షాతో దు ఫెర్నీ లో  నెలకొలిపి గౌరవించుట మనమెరుగమా. మహా కవి శ్రీనాధుడు, అష్టదిగ్గజములలో ప్రధానమైన ధూర్జటి కూడా వేశ్యలోలరు కాదా మరి వారి   వ్యక్తి గత జీవితములో దూరక వారిని గౌరవించుటలేదా?

మన పూర్వీకులు వ్యక్తిగత స్వేచ్ఛను ఇట్లు అడ్డుకొనుట మనము చూడము. అజంతా  ఎల్లోరా  , కోణార్క్ , విరూపాపక్ష వంటి అనేక  దేవాలయములయందు చూపిన అపూర్వ శిల్ప కళ వెనుక ఏమిదాగియున్నది?

జిలేబి నీ వాక్ధాటి విన్న సురేంద్రుడు, నరేంద్రుడు కూడా  మెచ్చుఁ కొందురు, అని దక్షుడు అనుచుండగా , “కానీ నేడు నీ కొడుకువంటి వారు అనుమానించి పొంచి చూతురు. జాన్ తో నేనెక్కువసేపు మాట్లాడుచున్నానని గమనించి అట్లు పొంచి చూచినాడు.” 

 జాన్ నీ అన్న వరుస యని తెలియక ..  దక్షుడనుచుండగా తల త్రొక్కిన త్రాచువలె    శయ్యమీదనుండి లేచితెలియక ఇట్లు జూచిన మనము నవ్వుల పాలవ్వమ్మా? పనివారు అతడిని చూచినారు.”

జ్ఞానము వాడికుండవలెను, లైంగిక జ్ఞానము నేనెట్లు భోదించగలను. నీకు నేను బోధించలేదుకదా.

నీవు చెప్పలేకున్న పుస్తకములున్నవికదా చదవమని చెప్పుము

పుస్తకములు అందరివద్దనున్నవి కాని అవి చదివిన జ్ఞానము వచ్చునని జ్ఞానము తమకు వలయునని అది వారి జీవితమునకు  వెలుగు దెచ్చునని నమ్మకము లేదువైరాగ్యము జ్ఞానము బోధించిన నేమి ప్రయోజనము?” యని 

పుస్తకములు అందరివద్దనున్నవి కాని అవి చదివిన జ్ఞానము వచ్చునని జ్ఞానము తమకు వలయునని అది వారి జీవితమునకు  వెలుగు దెచ్చునని నమ్మకము లేదువైరాగ్యము జ్ఞానము బోధించిన నేమి ప్రయోజనము?” యని

అది అట్లుండనిమ్ము, నీవీమధ్యన ఇంగిలీషు ముక్కలు కూడా బాగానే ప్రయోగించుచున్నావు.” అనగానాకేమి తక్కువ మిలియనీయర్ అండ్ ఫ్యూచర్ సి ఆఫ్ మీనాక్షి ఫిషరీస్ యని ముంజేతో తో అతడి డొక్కలో నొక్క పోటు పొడిచెను. " అబ్బా!! దుర్మార్గురాలా! ఇంత జ్ఞానము కలిగి  స్వార్ధము చూపుచున్నావు." అని వగచెను " జ్ఞానమున్నచో స్వార్ధముండదని ఎవ్వరు చెప్పినారు స్వామీ !”    

 


3 comments:

  1. ఈ సీన్ ఇప్పటికి వ్రాసిన అన్ని సీన్లకి తలమానికం
    అద్భుతంగా వ్రాసారు
    అభినందనలు

    ReplyDelete

  2. భారతవర్ష విజ్ఞానగ్రంధము మాత్రమే కాదు.శృంగార కావ్యం కూడా.ఈ గ్రంధాన్ని ఇంత చక్కగా తీర్చి దిద్దుతున్న అక్షర శిల్పికి నమస్సుమాంజలి

    ReplyDelete

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...