గుమ్మిడిపూండి గగన తలమున, మరకత వనమున మాఘ పౌర్ణిమ చలువఱేడు జిలిబిలి
వెలుగులు చిలుకు చుండెను.
కలువ రేణి అమృత కిరణ
గాఢ పరిష్వంగమున
గంబూర
శోభిత
వనములు ,
శృంగార సోయగ నగములు రమ్య రసానుభూతి నొందుచుండెను. యంత్ర రాణములు చొరబడని జనపదమున నెలవైన మరకత వనమున, పచ్చిక పడియల, ఘనమైన మడుగుల తోయరాశి లెల్లయు చంద్రికా ఛాయల
తళతళ మెరియుచుండెను.
చంద్రలోకమువలె నున్న ఆ ఉపవనమున కుటీర గృహమువద్ద నిలిచి యా ముగ్ధ వధువు ప్రకృతిని నేత్రపర్వముగా పరికించి పరవశించెను. దట్టముగా దేవగన్నేరు వృక్షములు
నలు చెఱగుల మందార, గులివింద, మన్మథానంద వృక్షములు, అక్కడక్కడ కొల్లివిట్టులు మూలల పారిజాతములు రసమయ శృంగార భావములను రేపు చుండ ఆ శశివదన లాహిరి గొనెను.
మన్మథానంద వృక్షముపై
వాలిన పికము చక్కెర చంగమున రవములు పలుకుచుండ చక్కెర విలుకాడు
పుష్ప బాణములను సంధించుచున్నటు భ్రాంతి నొందెను. దూరముగా పచ్చికలో కొలువద్ద నున్న వరదా చార్యుడు కొలనులో మసలుచున్న మీనములను
తిలకించుటాపి తన ఎదుటనున్న విద్యుల్లతను చూచుచుండెను. సఖుడు తనను గమనించుట చూసి
ఆ వాలు కన్నుల వయ్యారి వాలుజడ నొకపరి విసిరి, కాంతులీను ధవళ వస్త్రములందు వరదాచారి క్రీగంట కాంచుచుండ పారిజాత పుష్పములను యెరుచూ ఆ శిల్ప సోయగ శుభాంగి మగని చెంగట రతీదేవి వలే సంచరించుచుండెను. శకునములు గాంచి డెందము పొంగారు చుండ లతలల్లిన లీలాగృహమున తోలి శోభన కార్యము నిర్విఘ్నమగునని నిశ్చయముగ దలిచెను.
కన్దర్ప శరమే తగిలెనో
సఖి ఇచ్చిన గుళిక యే పలికెనో కొత్తరాగమంకురించగా వరదాచార్యుడు మెల్లగా పిల్లివలె అడుగులు వేయుచూ యక్షిణి వలెనున్న కన్నెను సమీపించెను. ఇంకా కొలును వద్దనే యున్నాడనుకొని తలయెత్తి చూసిన రమణి పక్కనేవున్న తనసఖుని చూసి “బంతి చామంతుల బుగ్గలు నిమురుచుండ అవాక్కయి తెల్లమొఖము వేయగా తెల్లని దేవగన్నేరు పుష్పములన్నియు పకపకా నవ్వు చున్నట్లు తోచెను.
అభిజ్ఞాన శాకుంతలమున శకుంతలను వర్ణించిన కాళిదాసు మనోహర వర్ణన అంగయారుకన్నె కతికినట్ల గుపించును.
అనాఘ్రాతం పుష్పం, కిసలయమలూనం కరరుహై
రనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసమ్
అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః
శకుంతల రూపం యింకనూ వాసన చూడని అప్పుడే పూసిన పూవు.
మాయని , గోటితో గిల్లని క్రొత్త చిగురు. ఇంకనూ రంధ్రము వేయని తీర్చిన ముత్యము. ఇంకనూ తీపు చవి చూడని క్రొత్త పూదేనె. మనోహరమైన, పరిపూర్ణమైన పుణ్యాలకు ఫలము. అటువంటి శకుంతలననుభవించడానికి బ్రహ్మ యెవరికి రాసి పెట్టాడో నాకు తెలియకున్నది ‘ అని మధురమైన ఉపమానాలను ఈ శ్లోకంలో కూర్చాడు కాళిదాసు.
కొలనులో మసలుచున్న మీనములను తిలకించుట మీకిష్టముకదా?
“నీకన్నులు చంచలమైన బేడిసలు కాదా!” యనుచు యా అనాఘ్రాతం పుష్పమును,
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె యను గానము గాలిలో అల వలె తేలుచు, లీలగా వినిపించుచుండెను.
ఎక్కడి అభిజ్ఞాన శాకుంతలం
ReplyDeleteఎక్కడి పరువం వానగా
Nice coordination of time sir
ఈ భాగములో మీరు వాడిన భాష మకరందం కన్నా తియ్యగా వుంది. Waiting for twist.
ReplyDeletewow, wow wow!!! Thanks
DeleteChala bagundhi sir.u r the ocean of knowledge and language.
ReplyDelete