వసతి గృహ గవాక్షమునుండి దామిని రహదారిని చూచుచుండెను. పసిమి వర్ణమున మెరియుచున్నఅభిజాత ఆమె పక్కనే నిలచియున్నది."వర్షుడి వాహనము వెడలిపోవుచున్నది. ప్రస్తుతమునకు పేరు అడగవలదని" వర్షుడు చెప్పెను. వర్షుడి వచ్చి మిమ్మల్ని నాకప్పగించే ననిన మీరు సామాన్యులు కాదు కావున మీరిచట నుండరాదు. మీరు నాకు మిక్కిలి పూజ్యనీయులు నాతొ రండు అని దామిని ఆమె పెట్టెను గ్రహించి సాగుచుండగా, స్తబ్ధమై అజ్ఞాతమై ఆ గుప్తవనిత ఆమెను అనుసరించ సాగెను. పనిపిల్ల వెనుకనే ఆమె సంగీత పేటికను తెచ్చుచుండెను. వాహనము నందు వస్తువులు పెట్టిన పిదప వారిరువురూ వాహనమునెక్కిరి. శీతల పవనముల సేదతీరుచూ వారుసాగుచుండిరి.
శా.ఊరంతా హరివి ల్లులాయె మదినే ఊయాల లూగించు ఈ
తోరంపు బృహదా రులప చ్చటికాం తిప్రాకె చూడంగ నే
ఊరంతా పరిగె త్తుచెట్లు వనమే ఊరేగు నట్లున్న దీ
దారంతా భవనా లుగాత లలనే దాచేను మేఘాల లో
అంబరమణి, కిరణము నిటారుగా పడుచున్నవి విశాలమైన విశాఖపట్టణ జాతీయ రహదారి నల్లని కాలసర్పము ను తలపించుచున్నది దానిని చూచి భీతిల్లినట్టు వాహనములన్నియూ పరుగులు దీయఁచున్నవి. నున్నటి నల్లని రహదారిపై దూరముగా నీటిఛాయలు తారసపడి వాహనము సమీపించుచుండగా అవి మాయమగుచున్నవి. రహదారి కిరువైపులా పచ్చని చెట్లు. చెట్లు కూడా అంతే వేగముగా పరిగెడుచున్నవి, ఊరేగింపుగా వూరు తరలిపోవుచున్నట్లున్నది.” ఆకులురాలి మొఖములు వేళ్ళాడు చెట్లు ఆసుపత్రి ముందు నిలిచిన రోగులవలె. మరకత దళములతో గుంపులుగా నిలబడిన చెట్లు విహారయాత్రికులవలె, లేత హరిత పల్లవములతో జంటలుగా నిలబడిన చెట్లు వధూవరులవలె నగపించుచుండెను. కానీ చెట్ల పరుగు చూచినా అప్పులవాళ్ళు వెంటబడి తరముగా పరిగెడుతున్నట్లున్నది.
తే. అప్పు లిచ్చిన వాడువ చ్చప్ప డగగ
చెప్పు లుమరచి భీతితొ చెడప రిగెడ
నేల చెప్పుచు గొప్పలు నేటి తరము
అప్పు పాముల చిక్కెనా హార మయ్యె
ఊరేంత మారిపోయెనో కదా. అనుచున్న ఆమెతో దామిని “మీరు ఈవూరిలో మునిపుండిరా” యని అడిగిఆయ్యో అనవసరముగా వివరములడుగుచున్నానే యని కలత చెందెను.
బుల్లయ్య కళాశాలమీదుగా ఫోక్స్ వాగను పోవుచుండగా ఒక కుర్రవాని చూసిన ఆ తల్లి హృదయము తడిమినట్టయి నది . “యితడు మా అబ్బాయి వలే యున్నాడు” అని అతడినే చూచుచూ “ఎట్లుండెనో నాబిడ్డ తినుచుండెనో లేదో?” అని వాపోచుండగా " ఎంతుండునమ్మా నీ బిడ్డ" అని దామిని అడిగెను " ఇరువది నాలుగు వర్షములుండును " యని చెప్పగా విని అవాక్కయ్యి తేరుకుని నవ్వసాగెను.
ఆశీలుమెట్ట వద్దకు చేరి దారిదీపముల వద్ద ఎడమ చేతివైపు మలుపు తిరిగి పైకి ఎగయుచుండెను. “ఇది ఆంధ్రవిశ్వ విద్యాలయ మార్గము” అను చుండగా అచ్చటనున్న ఒక వీధిలో ప్రవేశించిన ఫోక్స్వాగన్ ఒక పెద్ద భవనము ముందు నిలిచెను. “ఆ వీధితో విడదీయరాని రెండు అనుబంధములు ఆమెకు గుర్తువచ్చెను. ఒక బంధమును భర్త తెంచిననూ మరొక బంధము తన బంధువుల గృహము. ఒక్కక్షణకాలము ఆ వీధిని కలియ చూచుచుండగా " ఏమండి , లోపలి రండి " అని దామిని పిలుచుచుండగా ఆ భవనము పై నున్న నామ ఫలకము పై " హృదయాలజిస్ట్ " అనుండుట చూసి నివ్వెరపోయెను. నవ్వుచూ ఎవరీ హృదయాలజిస్ట్ కొంటె కోణంగి వలే నున్నాడే అనుచుండగా " దామిని మా ఆయనే ఆ కొంటె కోణంగి " అని జెప్పి నవ్వు చుండగా, మీనాక్షి మొఖమున అపరాధభావం మెదలుచుండెను. ఈ ఇంటి యజమాని అనుకొని అయ్యో పొరపాటు నంటిని మీవారనుకొనలేదు. మీరన్నది నిజమే ఆ హృదయాలజిస్టు ఈ ఇంటి యజమానే. అంతేకాదు నా యజమాని కూడా. ఆయన ఎల్లప్పుడూ ప్రతివిషయమునందునూ హాస్యము చూచుచుండును , హాస్యము నద్దు చుండును. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకొని లోపలి వెడలిరి. లోపలి నుంచి ఇద్దరు పని మనుషులు వచ్చి వారి సామాలు తెచ్చిరి.
మీరు స్నానము జెసి వచ్చిన మనము కలిసి భోజనము జేయవచ్చు, వారు ఆసుపత్రి నుంచి రాత్రి కే ఇంటికి వచ్చెదరు. స్నానము జేయుటకాపడతి స్నానాల గదిలోకి బోయి చూడ రోయపురమందు తనుండెడి ఇల్లు గుర్తొచ్చెను. ఆ విశాల గృహమునందధునాతన సౌకర్యములు హాయిగొలుపుచుండ ఆమె స్నానము ముగించి బయటకు వచ్చెను. దామిని దూరవాణిలో మాట్లాడు చుండెను. అటు స్వరము వర్షుడని గ్రహించి అతడికి మనసులోనే దీవెనలందించెను.
ఇద్దరూ భోజనములు చేయుచుండగా దామినికి ఆమె తనకు సంపత్ నగర్ తో గల అనుభందమును వివరించెను. దామిని ఆమెను అబ్బురముగా కని హర్షమును తెలిపెను.భోజనములు ముగిసిన పిదప ఆ ముద్ద బంతులిద్దరూ అద్దాల కిటికీ వద్ద నిలిచి ఇంటి ఆవరణలో నున్న విశాలమైన తోటలో మొక్కలను చూచుచుండిరి. అందమైన ఆరడుగుల పొడవుగల వృక్షముల వరుస లో నిలిచున్నవి. వాటి గుండ్రని పచ్చని తలలు గోళములవలె
మెరియుచున్నవి. వాటి మధ్యలో మూడడుగుల ఎర్రని చిన్న పొదలు కనువిందు చేయుచున్నవి. ఇద్దరు పని వారు వాటిని పెద్ద కత్తెరలతో కత్తిరించుచున్నారు.
గోడ దగ్గర నిమ్మ, సపోట , కరివేప వంటి చెట్లు కూడా కలవు." ఇటువంటి చెట్లు గొడవద్ద వేసిన ఇబ్బందులు కలుగును కదా అని ఆమె అనగా విని దామని " అయ్యో మీకు అసలు విషయమును సూటిగా ఎట్లు చెప్పవలెనని ఆలోచించు చున్నాను" అని దామిని అనెను. “సూటిగా చెప్పన ప్రమాదమున్నదా.” ఆమె అనుచుండగా, ఎవరో ఒక వ్యక్తి గోడదూకి నిమ్మ చెట్టు క్రింద నక్కి కూర్చొనెను మొక్కలు కత్తిరించుటాపి పనివారు చెవులు రిక్కించి వినుచుండిరి. ఆ వచ్చిన వ్యక్తి దొంగ వలే నక్కుచూ వొంగి నడుచుచుండెను. ఊహకందనిది జరిగింది ఆ వ్యక్తి జేబులోంచి తుపాకీ తీసి పట్టుకొని పొదచాటున నెక్కెను. ఆశ్చర్యము , పనివారు కూడా జేబు నుండి చిన్న తుపాకులు తీసిరి. దామిని పక్కకు చూడగా ఆ భామకు కళ్ళు తిరుగుచున్నవి, ఆమె పక్కకు ఒరిగిపోవుచుండగా దామిని ఆమెను పట్టుకొనెను.
మొక్కల చాటున దాగొని వారు తుపాకులతో కాల్పులు జరుపుకొనుట ప్రారంభించిరి. ఒక పొదనుండి మరొక పొదకు అతడు పరిగెడుట , వారుకూడా అతడిని వెంబడించుట చూచుచున్న ఆ యువతి " ఇది విశాఖ పట్నమునందు వైద్యుని ఇల్లా లేక హాలీ వుడ్ చిత్రమా " అనెను. అంతలో అతడి చరవాణి మ్రోగెను. రాధకృష్ణ హియర్ అనుచూ మాట్లాడుచుండగా పనివారు తుపాకులు తలపై పెట్టినారు. పనివారిని తుపాకులు తీయమని బ్రతిమాలి మాట్లాడుట ముగించి లోపలి వచ్చిన కానీ అతడు కేవలము ఆటలు ఆయూడ్చున్నాడని ఆమెకు అర్ధము కాలేదు . వైద్యులు ఇట్లు కూడా ఉందురా అని ఆమె దామినితో అనగా “అమ్మ ఇప్పటికైననూ మీకు అర్ధమైనది నా భారము తీరినది.” అని ఆమె భర్త కు భోజనము వడ్డించెను. అతడు భోజనము చేయుచూ అప్పుడప్పుడూ ఛలోక్తులు విసురు చుండెను. " పక్క గదిలో ఆమె ఉన్నది కాస్త మీ ధోరణి మార్చ వలెను" అనెను.
మార్చేద్దాం అనుచూ " ఆమె పేరు అడిగెను. "తెలియదు, చెన్న పట్నమునుండి వచ్చెను అని చెప్పుచూ తెలిసిన వివరములు తెలియ జేసెను." పేరు తెలియదని చెప్పగానే , ఇదియునూ ఆటవలె నున్నదని భావించి సంబరపడుచుండ దామిని ఖంగు తినెను.
రేపు విశాఖ ఉక్కు నగర కళాక్షేత్రమున భారతవర్ష తులాభారం ప్రదర్శన కలదు నీవు హైద్రాబాద్ కు పోలేదు కావునా ఇచ్చట చూడవచ్చు " ననెను. ఇట్లెన్ని ప్రదర్శనలు ఇత్తురు? ఎంత కాల మిత్తురు అని దామిని అనగా " చూచు వారున్నంతకాలమూ నాటికలు కొనసాగును, నానాటికీ పెరుగుచున్న ప్రేక్షకాదరణ తో అతడికి ఈ నాటిక రాష్ట్ర వ్యాప్త కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టెను. అతడి పేరు తరుచుగా పత్రిక లందు శీర్షికలుగా వచ్చుచున్నది. అని అతడు చెప్పుచుండగా “పతాక శీర్షికగా వచ్చు సమయము సమీపములోనే ఉన్నది, అనెను అతడు " సమీచనం " అనెను.
"అతడు రాసిన భక్తి విజయము పద్యములు ఎంతో మనో రంజకముగా కూర్చబడినవి. మాలినిగారు నాకొక ప్రతిని ఇవ్వగా చదివి ఆందించుచున్నాను. సాహిత్య అకాడమీకి పంపి యున్నాడు." "సాహిత్య అకాడమీ పురస్కారం వర్షుని వరించుటయా" అని అతడు కిల్లి కజ్జములు పెట్టుకొనెను దామిని " ఎప్పుడూ హాస్యములాడు చుండుట యేనా మీ పని.. శుభం పలకరా పెళ్లి కొడకా అనిన సామెతను గుర్తు వచ్చుచున్నది.” వారిదారిమద్య వాగ్వివాదం చెలరేగెను. అతడు మాటలాపి " ప్రక్కగదిలోనున్న మగువ వచ్చెను అనుచూ ఇట్లనుట కష్టము కనుక మిమ్మల్ని “మదాం ఎక్స్” అని పిలుతును. అని “గుప్త నామమున వ్యవహరించిన అభ్యంతరము లేదు కదా!” అని అడుగగా. ఆమె నవ్వి నా పేరు మీనాక్షి అని చెప్పెను.
***
ఇంతలో ఒక హ్రద్రోగి వచ్చెను. అతడు హృదయాలజిస్ట్ కు పాత రోగి అతడిని చూడ గానే డాక్టర్ రాధ కృష్ణ మొఖమంతయూ నవ్వు పూసెను. వారిద్దరూ డాక్టర్ గారి గదిలోకి వెళ్లిరి.
కూర్చో శోభన్ బాబు, "నాపేరు మోహన్ బాబు అండి.
సరే మోహన్ బాబు, సుమారుగా నీకు ఆస్తి ఎంతుండును?
ఒక ఇల్లు, పొలం ఉన్నాయండి.
వీలైనంత తొందరలో వీలునామా రాసేయండి
ఎందుకండీ , నా గుండె గట్టిదండి.
సరే మందులు రాసిస్తాను అని చీటీ ఇచ్చి అతడిని పంపెను
సైకాలజిస్ట్ సత్యమూర్తి వచ్చెను. అతడు నేరుగా డాక్టర్ గదిలోకి పోయి కూర్చొనెను.
పైనుండి మీనాక్షి దామిని లు చూచుచుండిరి, " రావణా , పిసికాలజిస్ట్ కి కాఫీ "
అని రాధాకృష్ణ గట్టిగా అరిచెను. "పనివాడు కాఫి పట్టుకొని లోపలకి పోవుచుండగా
మీనాక్షి : రావణ యని పేరు కొత్తగా నున్నది
అవునమ్మా నాకునూ కొత్తగానే యున్నది , నాపేరు రవణ. అని అతడు లోపలి బోయెను.
దామిని : ఇదమ్మా ఈ హృదయాలజిస్ట్ సంగతి.
మీనాక్షి: రేపు రావణ, రవాణా అగునేమో!
దామిని : చూడమ్మా పిసికాలజిస్ట్ కి కాఫీ అని హోటల్లో వలె ఎట్లు అరుచుచున్నారో. పుణ్యం కొద్దీ పురుషుడన్నారు
మీనాక్షి:అహ్హహ్హ మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలమయెనో కదా! నీవు చాలా అదృష్టవంతురాలివి అతడే చిల్డ్ స్పెషలిస్ట్ అయినచో?
దామిని : హతోస్మి , చైల్డ్ స్పెషలిస్ట్ , నీ నోట పడి చిల్డ్ స్పెషలిస్ట్ గా మారెనా!
డాక్టరు గదిలో - సత్య: ఆసుపత్రి లో డాక్టర్ దమయంతితో గొళ్ళెము పడినదని విన్నాను.
ఆడవారితో మాట్లాడు పద్దతి నేర్చుకోవయ్యా రాధాకృష్ణ .
రాధా : పిసుకుడైననూ రాలేదు. నేను పిసికాలజిస్ట్ నైనచో ఎంత బాగుండెడిది.
మీనాక్షి విచారమంతయూ మరిచి ఆ ఇంటి వాతావర్ణమును ఆనందిచుచుండెను.