Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, October 20, 2020

Bharatavarsha -55

 యశోద ఆసుపత్రి  సమీపంలో సికింద్రాబాదులో పెరేడ్ గ్రౌండ్స్ కి ఎదురుగా హరిహరా కళాభవన్ యను భువనమును తలపించు, పెద్ద కళామందిరము సాంస్కృతీ వర్జితారణ్యమున గర్జించు సాహిత్య మేఘము వలే నొప్పుచుండెను. 

త.వన  మేయద    శోకచ    క్ర సము    న్నత మే   ఆహో! మహా 

   భువన  దర్శన     భాగ్యమీ  తలబో     యనాట   కశాలయే

   వన   జాల క      లాపమో యనికాం   చిబిత్త     రపోదురో

   వన మందున    డాలు కొంచు ఆ  యశస్సు    గ్రహింతురో 

అశోక చక్ర వలె  సమున్నత  కీర్తి కాంతి గల  భవనమును చూచిన గగనమునకెగసిన  కీర్తి తరంగము వలె,  తాకిన ఆ  ప్రకంపనలు సాహిత్య వనమున కీరవాణి రాగమున పాడు కీరము వలె నుండును.  జంటనగర  సాహిత్య పిపాసా పిపీలకములకు క్షీరము వలె, గరకొను  హృదయములను గరిగించ నృత్య సంగీత సాహిత్య హవనములు జరిపించు సోమయాజివలె భావితరముల భావములను గను తల్లి వలె, జగన్మాతవలె నున్నది.  

త. జతలు    ఆరుగ   గూ డి రిం  తులు చొ క్కమేవి   రజి మ్మె  యా

   లతిక     లందరు     కూడ గా   విరుల   న్నిపాడు   సరాగ   మే   

   వతను    గాజడ   పూల చీ   రల మా  టలే వి     మలాత్మ లా 

   సుతను   లందరు    చేరికా   యిరిసా    మరస్య    తకల్గ    గా 



మొదటి వరుసలో  పన్నెండు మంది కూర్చొనిరి  మాలిని,  మంజూష  విదిష లు ముదిత లొకదరి , లకుమ తారలు వారి నంటి , నవ దంపతులా ప్రక్కనే డయానా తదుపరి పురుషులు అగస్త్య, సందీప బసవ రాఘవుల్ రంగ స్థలము వద్ద ముందు వరుసలో కూర్చొనగా  ఒక పెద్ద కుటుంబమువలె కనిపించుచుండెను. వారు జడలు , పూలు, చీరలు గూర్చి అనేక విషయముల గూర్చి మాట్లాడుకొనుచూ విరులన్నీ సరాగము ( స్నేహము) పాడునట్లు కనిపించుచుండిరి. విమలాత్ములైన అనగా  స్వచ్ఛమైన మనస్సుగల సుతనులు అనగా సుకుమారదేహముగల వారందరు చెలిమిని పొందిరి.   భానోజీ రావుగారు వేదికనధిరోహించి మొదటి వరుసలో నున్న ఈ పన్నెండు మందికి  ఒక ఛాయాచిత్రమును తీసి చూపగా వారందరూ చూచుచూ సంతోషిచుచుండిరి. నాటకము మొదలగుటకు ఇంకనూ సమయమున్నది యని వెంట వచ్చిన సేవకుడు పళ్ళెమునుండి మొదటి వరుసనున్న అందరికి పానీయములు అందించెను

ఒకప్పుడీ కళా భవనము  కళా విహీనంగా నుండెడిది. ఫ్రెంచ్ చలన చిత్రోత్సవం , బాలల చిత్రోత్సవం , ఇంద్రజాల ప్రదర్శనలు అప్పుడప్పుడూ జరుగుచుండెడివి.  ఈ మధ్యనే ఈ కళామందిరము ఆధునీకరణ జరిగెను.  ఇది నగరమందు అతిపెద్ద కళామందిరము.

రవీంద్రభారతి కంటే పెద్దదా? యని ఎవరో  అడిగిరి

అవునండీ, రవీంద్రభారతి యందు వేయి మంది కూర్చొని  చూచు అవకాశము కలదు. ఈ హరిహరా కళామందిరమునందు పదునాలుగు వందలమంది ప్రేక్షకులు కూర్చొని చూచు అవకాశము కలదు.  యని వారు పానీయములు సేవించుచుండగా  వారి వద్ద కూర్చుని మాట్లాడు చుండెను.   ఇంతలో 30 సం వయసుగల ఒక అందాల భామ  అచ్చటికి వచ్చెను. ఆమె అరుణతారకి నమస్కరించి  ఎదురుగా నున్న కుర్చీలో కూర్చొనెను. భానోజీరావుగారు " ఈమె నా మేనకోడలు  డాక్టర్ రంజని.  ఈమె రుక్మిణీ పాత్రధారిణి.

రంజిని:     మొదట   సారస్వత పరిషత్ లో ఈ తులాభారము ను ప్రదర్శించ వలెనని యోచించినాము కానీ 250 మంది ప్రధాన మందిరంలో , 100 మంది పై అంతస్థులో కూర్చొనే వీలుంది ,  ఈ నాటకమునకు  విశేష జనాదరణ ఉండునని ఊహించి ఇక్కడ ఏర్పాటు చేసినాము. అద్దె ఎక్కువైననూ ఇచ్చట ఏర్పాటు చేసినాము. 

ఆ భవనమా  అచ్చట ప్రదర్శించిన నెవ్వడూ  బోడు  అను చుండగా అరుణతార ఆమె వైపు కోపముగా చూసెను  

1961లో  రవీంద్రభారతి ప్రారంభమయ్యెను ఇది అంతకంటే పాతధమ్మా

15 శతాబ్దం కాకతీయుల పాలన పోయి న తరువాత    తెలుగు వెలుగులు నశించుచుండెను నిజాం పాలనలో  ఉర్దూ అధికారభాషగా, రాజభాష గా  మారిపోయింది     నిజాం  రాజుల పాలనలో నిరాదరణకు గురైన తెలుగు ఉనికిని కాపాడడానికి  1923 లో హనుమంతరావు పంతులు ఆధ్వర్యంలో  ఆంద్ర జన కేంద్రం , 1923  లో  ప్రారంభమైన  అనేక శాఖలు గావిస్తారించి . ఇందుకు  అనేక వందలాది సాహితీయోధుల కృషి యున్నదమ్మా. కలక్టరు గారు , అప్పటి తాసిల్దారుగారు కూడా తెలుగు భాషాప్రియులు వారందూ చెమటోడ్చి నిధులు పోగుచేసినారు. 1951 లో 2 గదులతో ప్రారంభమైన కళాపరిషద్ ఎం పీ గా ఉన్న సి నారాయణ రెడ్డి గారు 25 లక్షలు ఎం ఫై లాడ్స్ నుంచి నిధులుసమకూర్చారు.  ఇప్పుడు రెండంతస్తుల భవన ముగా మారెను. అని భానోజీరావు గారు చెప్పుచుండగా  

ఇప్పుడు ఆధునిక హంగులు లేనియెడల కష్టమని లకుమ చెప్పుచున్నది. అది నిజమే కదా చరిత్ర చెప్పుకొని  మురియుటవల్ల లాభమేమి ఆధునికంగా ఆలోచించవలెను అని లకుమకు వంత పాడుచుండగా  కన్నె డయానాలకు వెగటు పుట్టెను.  

భానోజీరావుగారు మాటమార్చి అనుకున్నట్టుగానే ఇంకనూ ప్రేక్షకులు వచ్చుచున్నారు. కళామందిరము దాదాపు నిండిపోయెను.  భారతవర్ష పేరు ప్రజలకి బాగా  ప్రాకి యుండుటచే.. అను చుండగా “యితడు సురభి సంస్థ కు చెందిన సీనియర్ కళాకారుడు యని చెప్పి ఇంకా

 మేము పోయివత్తుమని మేనకోడలు రంజనితో లేచి పోయెను. రంజనిగారు కూడా జనాదరణ పొందిన సినీనటీ అని అక్కడ నిలబడి వినుచున్న " మంచి కళలు" సంస్థ వ్యవస్థాపకుడు  చెప్పెను. 

లకుమ అగస్త్యతోమెల్లగా  “జనాదరణ .. హు..  మొత్తము నాలుగు చిత్రములలో చేసి మూల కూర్చొనెను. అనుచుండగా ఇప్పుడు నీ చేతులో ఉన్న చిత్రములే నాలుగు. అని అగస్త్యుడనెను. అది విన్న రాఘవ  " మత్తుగొల్పు ఆమె  అందమటువంటిది"  అని సం దీపునితో అనెను. " ఏమున్నది దానిలో పొడవుగా , బలిష్టంగా యుండును నాకు లకుమ  మనతో చదువుకున్న పిల్లవలే కనిపించును." అని సందీపుడు అనగా రాఘవుడు " అందని ద్రాక్ష పళ్ళు పుల్లన " అనెను. బసవడు నవ్వెను.  సందీపునకు అరికాలిమంట నెత్తికెక్కెను.    అప్పుడు  సందీపుడన్న మాటలు విని బసవడు , రాఘవుడు అవాక్కయ్యిరి. 

మాలినిగారు " మీరు సురభి సంస్థలో సీనియర్ నటులుగా చేయుచున్నారా? చాలా మంచి సంస్థ అని అమాయకంగా అనుచుండగా, “నన్ను సురభి నారాయణ అందురు. భానోజీరావుగారు గౌరవముతో నన్ను సీనియర్ నటుడు అనుటయే తప్ప మాసంస్థ యందు పెద్ద చిన్న భేదముండదు. 130 సంవత్సరాల  చరిత్ర గల సురభి నాటక మండలి యొక్క అసలు పేరు శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి. వారు ఒక పెద్ద కుటుంబం. నేడు, ఐదు తరాలలో ఒక కుటుంబంలో వందకు పైగా సభ్యులు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా  వేదికపై పనిచేస్తున్నారు. వీరంతా ఏ పని లేదా పాత్ర హీనమైనది లేదా ఉన్నతమైనది కాదని భావిస్తారు.  తెరవెనుక కార్మికులు, వీరిలో పెద్ద సంఖ్యలో ఉన్నవారు, పెద్ద నటులకి ఏ వేతనం లభిస్తుందో అతి పిన్న వయస్కుడికి అదే వేతనం లభిస్తుంది.” విద్యుత్ దీపాలు ఆరినవి. తెర లేచుచున్నది.

5 comments:

  1. కళా భవనమును చక్కగా వర్ణించారు. సంభాషణలు సహజంగా ను, వివరణాత్మంగా నూ ఉన్నవి.

    ReplyDelete
  2. కళాత్మకంగా వర్ణించారు
    సురభి వారి వర్ణన సందర్బోచితం

    ReplyDelete
  3. సురభి వారి వర్ణన
    కళాత్మక వివరణ సందర్బోచితం

    ReplyDelete
  4. కళా భవనం గురించి బాగుంది సార్ ఇ సంబషనలు చదువుతునపుడు నిజంగా జరిగుతునట్టే ఉంది భారతవర్ష పేరు ప్రజలకి బాగా ప్రాకి యుండుటచే..

    ReplyDelete