Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 4, 2020

Bharatavarsha 43

 సూర్యుడితో పాటు నిద్ర లేచిన భారతవర్ష సైకిల్ తీసుకొని ప్రయాణమగుచుండ  మాలినిగారు  "బాబూ ఇంత పెందరాడే బయలుదేరావు?" తప్పదు వెళ్ళవలెను."అని వర్షుడుబోవుచుండెను. ఇంతలో మంజూష “సమంగా తలదువ్వుకొని బొమ్ము" “ఏమీ పర్వాలేదు” “అసలే మితభాషి యగు వర్షుడిప్పుడు తీవ్ర మితభాషిగా మారినాడు “విడ్డురంగా నున్నది వీడెన్నడూ  జీన్స్ ధరించడే”అని మంజూష అన్నది.



బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరిన భారతవర్ష తో మాలినిగారు “చీకటి పడ్డాక ఇంటికి చేరుతున్నావు ఇదివరకు ఇట్లుండెడిదికాదు “ఇప్పుడు కొంచెం  పని ఎక్కువ  గానున్నది.  కొంత కాలం ఇట్లే యుండును.” అని జెప్పుచున్న వర్షునితో మంజూష “మధ్యాహ్నం భోజనానికి రాకుంటివి?” నాకొరకు చూడవలదు. కొంతకాలం ఇట్లే యుండును.” అనుచూ స్నానమునకు బోవుచుండగా మాలినీ మంజూషలు మొఖములు చూచుకొనుచూ అట్లే నిలిచిరి. “వీడు పోను పోనూ అర్థకాని బ్రహ్మ పదార్ధమగుచున్నాడు” రాత్రి 10. 00 గంటలు అగుచుండగా మాలినిగారు యాధాలాపముగా వర్షునిగదిలోకి జూసి దీప మార్పివేసి యుండుటచే " చీకటింట ఏమి చేయుచున్నావ"నుచూ లోపలి బోయి దీపమిడి చూడగా  దీప కాంతిలో కుర్చీలో కూర్చుని గాఢ  నిద్రలోకి జారు కొన్న వర్ష కనబడెను. తల బల్లపై  ఎట్లు వొరిగెనో   వ్రాయుచున్న చేత  కలమట్లే వొరి గియుండెను. “న్యాయము గెలవవలెనన్న ఒకడొరగవలె” నని ద్విపద శ్రేణి కనిపించెను. “వర్షుడు నిద్రించుచున్నాడని నేనే దీపమార్పివేసితిని” అని మంజూష తల్లి చెంత కొచ్చి మెల్లన తెల్పెను.

మాలిని గారు వర్షుని కలం తీసు కొనుచూ  కందిన వర్షుని అరచే తిని చూసి మ్రాన్పడి చేష్ట లుడిగి పక్క గదిలోకి పోయి మౌనముగా రోదించుచుండిరి తల్లి కంట నీరు చూసిన మంజూషకు ఏమి చేయవలెనో పాలుపోకుండెను. 

కొడుకు బోధనా వృత్తి వదిలి మరేదో మొరటుపని జేయుచున్నాడని గ్రహించి మాలినిగారు  చింతా క్రాంతత నొంది ఉపాయము తోచక దీనమతియై  మనసున ఖేదపడు చుండ మంజూష  ఆమె భుజముపై ఒదిగి  దీనలోచనము (పిల్లి) వలె ప్రక్కనే కూర్చొనెను. వర్షుని గదిలో మరల దీపము వెలుగుట జూచి  “మంజూ,  పోయి వర్షుడేమి జేయుచున్నాడో చూచిరమ్మ” నెను.  

కొ ద్ధి  రోజుల  తర్వాత .. ఒక రోజు   ప్రాతఃసంధ్యా కాలమందు బయలుదేరు చున్న వర్షుడు " అమ్మా కోటేశ్వరరావు వచ్చినచో ఈ డబ్బు నీయవలెనని చెప్పి  వెడలుచూ “మంజు ఇదిగో  నీ కంప్యూటర్ కోర్స్  రుసుమని జెప్పి  చెల్లి చేతికి మొత్తమిచ్చి చ్చి వెడలెను

అపరాహ్నవేళ  కోటీశ్వరావు  ఉత్తమర్ణుడు చిరకాల పరిచయస్తుడు రాగా మాలిని గారు డబ్బు ఇచ్చుచు “వర్షుడీ  డబ్బు ఎందులకిచ్చ్చున్నాడు?” అని తన ఆందోళ ననెఱిఁగించి నిజము దెల్పమని వేడగా “ నేను వడ్డీ వ్యాపారిననెఱుగుదురు గదా!  గురువుగారు వ్యాజ్యము నడుపుటకు లక్ష రూపాయలప్పు జేసినారు. మా అబ్బాయి కి చదువు జెప్పుగురువగుటచే ఆయన ధర్మ బుద్ధినెరిగినవాడనగుటచే పరోపకారము నకు నడుముగట్టిన ప్రెగ్గడ కీ పాటి జేయకుండుట పంకమగునని  కుదువ ఏమియూ నడగక  డబ్బిచ్చితిని. దేవుని దయ వల్ల నేమి ఆయన కష్టము చేతనేమి  వ్యాజ్యము నెగ్గినది కానీ ... అని ఆపి నీళ్లు నములు చుండెను  

ఇప్పుడతడికొచ్చిన జెటేమి ? యని మాలిని గారు  నొక్కి ప్రశ్నించగా “దేవుని దయ ఆయన యందు లేకుండెను ఆయన కాలేజీ నందు పనిజేయుటలేదు. నాగిరెడ్డి బంధువు ఒకామె ఆ కళాశాలలో చదువుకొనుచూ  గురుపై లైంగిక ఆరోపణలు  జేసి పదవీత్యుతునొనర్చెను. “ఇదంతయు వ్యాజ్యము వీగినందుకు నాగిరెడ్డి అక్కసుతో నడిపించుచున్న నాటకమని దెలియుచున్నది.” యని మాలినిగారు అనుచుండగా “ న్యాయము గెలవవలెనన్న ఒకడొరగవలె”  నను వర్షుడు వ్రాసిన  ద్విపద శ్రేణి మెరిసి ఆమెకు కనులార్ద్రమయ్యెను. 

 నాగిరెడ్డి అతడి బంధువు పెంచలయ్య .  ఉజ్జోగమిచ్చి కొద్దికాలముతరువాత తొలగించునట్లు ఒక  పథక రచన చేసినారు. ఏమీ వీడి  దౌష్ట్యము  ఆ మహిషాసుర మర్ధిని వీడిని గొనిపోవలె. నాబిడ్డకీవిషము ఎట్లు తెలపవలె అని పెల్లుబికిన దుఃఖమును ఆపుకొనక ఏడ్చుచున్న ఆమెనెట్లు  ఓదార్చ వలెనో  కోటికి దెలియ కుండెను. " అమ్మ మీరు కలత జెందపనిలేదు ఈ విషయము అతడే నాకు జెప్పినాడు ." మంజుకీ విషయము తెలిపిన కలత పడును అనుచున్న ఆమెతో "అమ్మమ్మ తెలియనిత్తునా ఈ వడ్డీ డబ్బునాకు మీరెప్పుడైనా ఇవ్వచ్చును అని అనుచున్న కోటితో డబ్బుకిబ్బంది  ఏమియునూ లేదు అని చెప్పి డబ్బిచ్చి అతడిని పంపివేసెను. 

ఒకనాడు కొడుకు చేయుచున్న పని చూడవలెనని అతడెక్కడ పని చేయుచున్నాడో కనుక్కొని ఆటోలో పోవుచుండెను. వర్షుడు పనిజేయుచున్న గంట్యాడ గాజువాక మీదుగా చేరుసరికి  ఒక గంట పట్టెను. గాజువాక జెరుసరికి మాలినిగారికి విసుగు వచ్చింది. వర్షుడు గుర్తుకొచ్చి హృదయము బరువెక్కి  ఈ సుదీర్ఘ   ప్రయాణ జేయ డస్సి పోదురు  వీడు సైకిల్ మీద పోయి అచ్చట  వెచ్చలందెట్లు  పని చేయుచున్నాడో యని మిక్కిలి కలవర పడుచూ చేరిన ఆమె  వర్షుడు పని జేయుచున్న ప్రదేశమును జేరి తీవ్ర ఎండవేడికి పనివారు వేసుకొన్న గుడారము లో ముసుగు పెట్టి కూర్చొనెను.  

పనివారితో కలిసి రాళ్లపై తయారు డబ్బాలప్రక్క కూర్చొని చపాతీలు  తినుచున్న   కొడుకును చూచుచుండెను.  రోళ్ళు బ్రద్దలగు ఎండ కాయుచున్నది. దూరముగా భవన నిర్మాణ యంత్రములు  విశ్రాంతి తీసుకోను చున్నవి. కొద్ది దూరములో తారుడబ్బా నిప్పు పై మరుగు చున్నది. " భోజనము ముగించి క్షణము ఆలస్యము జేయక పని చేయవలెన"ని ఒక పర్యవేక్షకుడు వచ్చి  శ్రామికులను హెచ్చరించి పోయెను. " ఒక్క క్షణము కూర్చోనివ్వడు  రాక్షడు" యని పని వారు విసుకొను  లేచిరి. అంత వర్షుడు చిరునవ్వు న  స్వేదమున చిత్తుగా తడిచిన చొక్కా విప్పి నడుముకి కట్టుకొనెను. వేసవి తీవ్రత దృశ్యం చేయవలెనన్న  ఇచ్చటికి రావలయును . ఎండవేడిమికి శోష వచ్చునేమో అన్నట్లుండి  మాలినిగారు గుడారమున గల కుండనుండి నీటిని తీసుకొని త్రాగి చూచుచుండిరి. మరిగిన తారు  డబ్బాలను తీసి శ్రామికులు  మరొక  తారు డబ్బాను నిప్పు పై పెట్టు చున్నారు

లెగండెహె, లాగండెహె!! డబ్బాకి తాడు కట్టి లాగుచున్నారు. వర్షుడు ముందుండి తాడును చేత బట్టుకొనెను. చాతి  సాగి భుజములు పొంగి , కండలు తిరిగి పొత్తి  కండరములు బిగుసుకొని సైనికుడి వలే ఉన్న వర్షుడు పాడుచున్నాడు.

భారతవర్ష : గంట్యాడ నేలమీద కొట్టాడ్రో  బాంబు దెబ్బ!! 

శ్రామికులు: గంట్యాడ నేలమీద కొట్టాడ్రో  బాంబు దెబ్బ !!

భారతవర్ష : తాడు గట్టి లాగితే కదులుతుంది తారుడబ్బా 

శ్రామికులు:  తాడు గట్టి లాగితే కదులుతుంది తారుడబ్బా !!

అబ్బడి యబ్బ  అబ్బడి దెబ్బ   దెబ్బ దెబ్బ

అబ్బడి యబ్బ  అబ్బడి దెబ్బ   దెబ్బ దెబ్బ


పిదప రాతి ఇటుకల గుత్తులుగా కట్టి వాహనంలో పెట్టుచుండిరి. 


కండల్లో  శక్తుంది  హైలసో   హైలసా !!

గుండెల్లో దమ్ముంది  హైలసో  హైలసా!!


ఆ పని జరుగు చుండగా పర్యవేక్షకుడు వచ్చి " వానవస్తే  సిమెంట్ ఏమగును? " అనుచూ   సిమెంటు బస్తాలు దగ్గరలో ఉన్న ఒక భవనంలోకి తరలించమని చెప్పి పోయెను. భారతవర్ష చొక్కా ధరించెను. పక్కనున్న చక్రాల బండి పైకి పెక్కు బస్తాలనెక్కించి చాలా బస్తాలనొక్క సారిగా తరలించుచుండిరి. భారతవర్ష బండి ముందున్న దండము బట్టి లాగుచుండగా కొందరు శ్రామికులు వెనుకనుండి తోయుచుండిరి. గుండె బావిలో దుఖపు కొండ చరియలు విరిగి పడు చున్ననూ మాలిని గారికి  వర్షు ని జూడ యుద్ధంలో రాజు విక్రమం చూచుచున్నట్లున్నది.


నిప్పుల కొలిమిని లెక్క చేయక

హైలో హైలెస్సా హైలో హైలెస్సా

గొంతు  ఎండిన అడుగు ఆపక

హైలో హైలెస్సా హైలో హైలెస్సా

ఉక్కబో సినా చొక్క చిరిగినా

హైలో హైలెస్సా హైలో హైలెస్సా

(ఈ పాటలకు అసుకవితా ధోరణితో  అప్పుడు జరుగుతున్నవి పాటగా పాడు చుందురు భారతవర్ష చొక్కా చిరిగేను కాబట్టే ఆ పదములు చేర్చి అతడు పాడుచున్నాడు. ఇది రచయిత స్వీయానుభవం) 

మాలినిగారు:  ఏవో కొన్ని ఉలిపిరి చినుకులు చాలవు ఇంత వేదనా భరిత దృశ్యాలకు సముద్రమే స్పందనమై ప్రవహించాలి. రోహిణి లో రోళ్ళు పగులుతాయి అంటారు  కానీ గుండె పగులుతున్నాయ్..

5 comments:

  1. చదువుతుంటే కన్నీటి ప్రవాహం సంద్రమై పొంగుతోంది

    ReplyDelete
  2. మాటలు రావట్లేదు.కథ మొదలైన దగ్గర్నించి ఒక్క భాగం కూడా వదలకుండా చదివాను. విదిష తల్లి మరణం, సుందరి తండ్రి మరణం కూడా ఇంతగా కదిలించలేదు.కానీ వర్షుని పరిస్తితి ఇలాంటి పరిస్తితిలో కూడా అతని గుండె నిబ్బరం🙏🙏🙏

    ReplyDelete
  3. ధర్మము కొరకు పోరాడి పండితుడు మారే శ్రామికునిగా

    ReplyDelete
  4. Heart squeezing story and heart touching style

    ReplyDelete
  5. చాల బాగుంది ఎన్నో బదకారమైన సంఘటనలు ఉన్నయి

    ReplyDelete